DailyDose

వైకాపా ఇసుక మాఫియా వీరేనట-తాజావార్తలు-11/12

TDP Releases YSRCP Sand Mafia Leaders List-Telugu Breaking News Today-11/12

* ఇసుక మాఫియాపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజా చార్జిషీట్ విడుదల చేసింది. జిల్లాల వారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల పేర్ల జాబితాను ప్రకటించారు. 13 జిల్లాల్లో 60 మంది వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన వీరు.. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థ సారధి, ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రోజా, పెద్ది రెడ్డి, వారి అనుచరులకు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
* మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర క్యాబినెట్‌ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. క్యాబినెట్‌ తీర్మానాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు.
* ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆప్ ఆంధ్రప్రదేశ్ గా పెరు మార్పుప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి గౌరవార్థం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం: దేవులపల్లి అమర్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో APUWJ ఆధ్వర్యంలో జరిగిన రాఘవాచారి సంస్మరణ సభ లో ప్రకటన
*మొత్తం 4,103 ఖాళీల భర్తీకిగాను దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) నోటిఫికేషన్ విడుదలైంది. పదవ తరగతితో పాటు ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్ధులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
*రాజధానిలోని స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్‌ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు.
* శీతల ప్రాంతాలైన జి.కె.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో చలి తీవ్రత నెలకొంది.
*విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి తాకిడితో ప్రజలు వణికిపోతున్నారు.
*నాగాయలంక పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సమస్య తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
*మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ, అనూహ్య పరిణామాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలిపిస్తున్నాయి. అధికార పీఠం.. వివిధ పార్టీల మధ్య దోబూచులాడుతోంది.
*అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలో ఆర్టీసీ లేదని, దాని కింద ఎలాంటి ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోనే ఉందని చెప్పింది. ప్రజోపయోగ సర్వీసులకు సంబంధించిన వ్యవస్థలు పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలో ఉంటాయని, ఇవి అత్యవసర సేవలకు చెందినవి కాదంది.
*తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు బాగున్నాయి. త్వరలో మరోసారి పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ రెండు పథకాల అమలును స్వయంగా వీక్షిస్తానని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ చెప్పారు.
*మౌలిక వసతుల రంగంలోని కొన్ని ప్రధాన కార్పొరేట్ సంస్థలకు సంబంధమున్న భారీ హవాలా రాకెట్ను ఆదాయపు పన్ను విభాగం తాజాగా గుర్తించింది
*రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై రాష్ట్రం ఆసక్తిగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు అమలులో ఉండే ఈ సిఫార్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
*ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతుందని.. ఇందుకు అనుగుణంగా రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఆంగ్లమాధ్యమంలోకి మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
*మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి తెలంగాణ వేదిక కానుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో డిజిటల్ మీడియా, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, వినోద రంగ సదస్సు ‘ఇండియాజాయ్-2019’ జరగనుంది.
*పోలీసు అధికారులను సామాజిక మార్పునకు అనుసంధాన కర్తలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులు వీకే సింగ్ స్పష్టం చేశారు. పోలీసులను మానసికంగానూ దృఢ చిత్తులుగా తీర్చిదిద్దటం తమ లక్ష్యమని ఆయన సోమవారం ఒక ప్రకటనతో తెలిపారు.
*తెలంగాణ ఐఏఎస్ అధికారి కాట ఆమ్రపాలి కేంద్ర సర్వీసులో చేరేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆమెను కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో ఉప కార్యదర్శిగా నియమిస్తూ గత నెలలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి అనుగుణంగా ఆమెను రిలీవ్ చేసి, కొత్త పోస్టులో చేరేందుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలంసాహ్ని నియామకానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ కార్యదర్శిగా ఉన్న ఆమెను ఆ విధులనుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
*రాష్ట్ర ఆదాయ వనరుల మంత్రి వర్గ ఉపసంఘం సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో సమావేశమైంది. ఆర్థిక మంత్రి హరీశ్రావు అధ్యక్షత వహించగా, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆబ్కారీ, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖల ఆదాయ, వ్యయాలను సమీక్షించారు.
*చలి బాగా పెరుగుతోంది. సోమవారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా మోమిన్పేటలో అత్యల్పంగా 14.3, మెదక్లో 16.5 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో రాష్ట్రంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. ఇంకా చలి పెరిగే సూచనలున్నాయి. వర్షాలు తగ్గిపోయాయి. తూర్పు, ఈశాన్య భారతం నుంచి గాలులు వీస్తున్నాయని, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.