Devotional

త్రిపుర పౌర్ణమి అంటే తెలుసా?

What is tripura pournami-Telugu devotional news

1. ‘త్రిపుర’ పౌర్ణమి విశిష్టత – ఆద్యాత్మిక వార్తలు – 12/11
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఇది అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ ఒక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. పౌర్ణమిరోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీదా, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలపై బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయంలో ధ్వజస్తంభంపై నందాదీపంతో పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎతె్తైన ప్రదేశాల్లో భరిణల్లో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొనె్నల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది.
వైజ్ఞానికపరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాల వెలుగుల నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గిపోయి వాతావరణం శుద్ధి అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్ర్తిలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే ‘అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా.. పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా?’ అని అడిగితే.. కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు. శివుడి వరంతోటి ఆ దంపతులకి కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలదీ ఆ తల్లిదండ్రుల్లో గుబులు పెరుగుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్త్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడ్ని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.
ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరోపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు నగరాలను వరంగా పొందారు. అలాగే ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంపై, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురునీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో లోకాలన్నింటా కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు విసిగిపోయి బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను.. మీరు విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల కార్తీక పౌర్ణమికి ఈ పేరు వచ్చిందని పురాణ కథనం.
కార్తీక పౌర్ణమిరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతకాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజూ దేవుడ్ని పూజించి దీపారాధన చేసే సమయం లేనివారు, నిష్ఠను ఆచరించలేని వారు కార్తీక పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు.. నెలంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్ర్తిల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే.. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం. కార్తీకపౌర్ణమిరోజు శివుడు త్రిపురాసురులను సంహరించి ఇంటికి వస్తాడు. విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించిందట. అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవాన్ని జరుపుతుంటారు. కార్తీకపౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఈ జ్వాలా తోరణోత్సవాన్ని చూడటం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయట. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికావ్రతం వంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం వంటి పూజలు చేస్తారు.
*ప్రత్యేకతలు
దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలి. వీరిని ఎంత నిష్ఠతో పూజిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.
2.వేద భారతి.. నదీ హారతి
నిర్మల్ జిల్లా బాసర గోదావరి తీరంలో నిర్వహించిన నదీ హారతి కార్యక్రమం కనులపండువగా జరిగింది. పౌర్ణమి ఘడియలు సోమవారం సాయంత్రమే రావటంతో బాసర క్షేత్రంలో స్థానిక వేదభారతి పీఠం రుషికన్యలు చతుర్దశ భువన హారతి నిర్వహించారు. నదీమాతల్లికి 14 రకాల హారతులతో అర్చనలు చేశారు.
3.మహా’దేవుడు!
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని సెంగల్ మహేశ్వరం శివపార్వతి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన 111.2 అడుగుల ఎత్తైన భారీ శివలింగాన్ని ప్రారంభించారు. ఆధునిక హంగులతో ఎనిమిది అంతస్తులుగా నిర్మించిన ఈ శివలింగం ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లలో స్థానం సంపాదించింది. అంతర్భాగంలో సిద్ధుల శిల్పాలతోపాటు 108 శివలింగాలు ప్రతిష్ఠించారు.
4. శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొంటున్నారు. కార్తీక దీపాలు వెలిగించి, శివుడికి అభిషేకం చేస్తున్నారు.
జిల్లాలోని పిల్లలమర్రి, మట్టపల్లి, మెల్లచెర్వు, నాగులపహడ్ శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.
5. తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలన్ని కిటకిటలాడుతున్నాయి. శివుడికి ప్రత్యేకంగా భక్తులు అభిషేకాలు చేస్తున్నారు. భీమవరం, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలంలోని శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు.
6. నేడు, రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనాల్లో అదనపు కోటా
వృద్ధులు, దివ్యాంగులకు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనానికి మంగళ, బుధవారాల్లో అదనపు కోటా కేటాయించారు. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటరులో వృద్ధులు, దివ్యాంగులకు మంగళవారం 4వేల టోకెన్లు జారీచేస్తారు. వీటిని ఉదయం 6గంటల నుంచి పొందవచ్చు. అలాగే ఐదేళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులను బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ద్వారా అనుమతిస్తారు. ఇదే నెలలో 26న వృద్ధులు, దివ్యాంగులకు, 27న ఐదేళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు మరో అవకాశం కల్పించారు.
7. గోదారమ్మకు మహా హారతి
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో స్థానిక వేద భారతి పీఠం ఆధ్వర్యంలో గోదావరి హారతి పూజ నిర్వహించారు. వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు రుద్రాభిషేకం, యాగం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో గంటపాటు గోదారమ్మకు హారతులను ఇచ్చారు. మరోవైపు సోమవారం రాత్రి భద్రాచలంలోనూ గోదావరి మహా హారతిని ఘనంగా నిర్వహించారు.
8. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం,
12.11.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 18C°-26℃°
• నిన్న 70,319 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 02
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 23,479 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.20 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
#ఈ రోజు మరియు 26న
వృద్ధులు / దివ్యాంగులకు
ప్రత్యేక ఉచిత దర్శనం,
(భక్తులు రద్దీ సమయాల్లో
ఇబ్బంది పడకుండా ఈ
అవకాశం సద్వినియోగం
చేసుకోగలరు)
#రేపు మరియు 27 న
చంటిపిల్లల తల్లిదండ్రులకు
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
(ఉ: 9 నుండి మ:1.30
వ‌ర‌కు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి
అనుమతిస్తారు,
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు
మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141

మరిన్ని వివరాలకు https://www.edukondalu.com/ ను వీక్షించండి
9. శుభమస్తు
తేది : 12, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పౌర్ణమి
(నిన్న సాయంత్రం 5 గం॥ 59 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 1 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(నిన్న రాత్రి 7 గం॥ 16 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 49 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 11 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 20 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 11 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 7 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 15 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 19 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యశి : తుల
చంద్రరాశి : మేషము
విశేషం
12. కార్తీక పౌర్ణమి
10. రాశిఫలం – 12/11/2019
తిథి:
శుద్ధ పూర్ణిమ సా.6.14, కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం
భరణి రా.9.01
వర్జ్యం:
శేషవర్జ్యం: ఉ.7.17 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహుకాలం:
మ.3.00 నుండి 4.30 వరకు తీవిశేషాలు: కార్తీక పూర్ణిమ
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. స్ర్తిలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అకాల భోజనాదులవల్ల అనారోగ్యమేర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్రొత్త పనులు ప్రారంభించరాదు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఋణప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
11. చరిత్రలో ఈ రోజు/నవంబర్ 12
జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం
1842 : భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత జాన్ స్ట్రట్ జననం (మ. 1919).
1866 : చైనా దేశ మొట్టమొదటి అధ్యక్షుడు సన్ యాత్ సేన్ జననం (మ. 1925).
1885 : కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి జననం (మ.1932).
1896 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ జననం (మ.1987).
1918 : ఆస్ట్రియా స్వాతంత్ర్యదినోత్సవం.
1925 : ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు, పసుమర్తి కృష్ణమూర్తి జననం (మ.2004).
1946 :భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణం (జ.1861).
1969 : పాకిస్థాన్ మొదటి అధ్యక్షుడు ఇస్కాందర్ మిర్జా మరణం (జ. 1899).
12. శ్రీరస్తు శుభమస్తు
తేది : 12, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : భౌమవాసరే (మంగళవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : పౌర్ణమి
(నిన్న సాయంత్రం 6 గం॥ 2 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 4 ని॥ వరకు పూర్ణిమ తిధి తదుపరి పాడ్యమి తిధి)
నక్షత్రం : భరణి
(నిన్న రాత్రి 7 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 51 ని॥ వరకు భరణి నక్షత్రం తదుపరి కృత్తిక నక్షత్రం )
యోగము : (వ్యతీపాత ఈరోజు ఉదయం 10 గం ll 36 ని ll వరకు తదుపరి పరీయాన్ రేపు ఉదయం 10 గం ll 4 ని ll వరకు)
కరణం : (విష్టి ఈరోజు ఉదయం 6 గం ll 33 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మధ్యాహ్నం 12 గం ll 0 ని ll )
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 13 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 26 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 13 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 20 ని॥ లకు
సూర్యామయం : సాయంత్రం 5 గం॥ 41 ని॥ లకు

సూర్యరాశి : తుల
చంద్రరాశి : మేషము
కార్తీక పౌర్ణమి
మహా కార్తీకి
కార్తీక జ్వాలా తోరణం
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయమున రట్నగిరి ప్రదక్షిణం
విష్ణుఆలయేషు కార్తీక పర్వ దీపోత్సవం