WorldWonders

అపరకుబేరులకు ఆర్థిక కష్టాలు

Billionaires Across The Globe In Huge Losses-WorldWonders

వాణిజ్య యుద్ధం, ఈక్విటీ మార్కెట్ సంక్షోభం, అంతర్జాతీయం ఉద్రిక్తతలు ప్రపంచంలోని బిలియనీర్ల (100 కోట్ల డాలర్లు అంత కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులు) సంపదలకూ చిల్లు పెడుతున్నాయి. ఈ మూడు కారణాలతో గత ఏడాది వీరి సంపద 38,800 కోట్ల డాలర్లు (సుమారు రూ.27.54 లక్షల కోట్లు) పడిపోయింది. బిలియనీర్ల సంపద విలువ ఇలా పడిపోవడం 2015 తర్వాత ఇదే మొదటిసారి. ప్రముఖ ఇన్వె్స్టమెంట్ బ్యాంక్ యూబీఎస్, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ సంయుక్తంగా విడుదల చేసిన ‘యూబీఎ్స/పీడబ్ల్యూసీ బిలియనీర్స్ రిపోర్ట్’ ఈ విషయం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలోని బిలియనీర్ల ఆస్తుల విలువ 8.53 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.605.63 లక్షల కోట్లు)డాలర్ల పరంగా 2018లో 12.8 శాతం తగ్గిన చైనా బిలియనీర్ల సంపద.చైనా బిలియనీర్లను దెబ్బతీసిన స్టాక్ మార్కెట్ సంక్షోభం, యువాన్ మారకం రేటు తగ్గడం, జీడిపీ వృద్ధి రేటు.కష్టాలున్నా చైనాలో ప్రతి 2-2.5 రోజులకు ఒక కొత్త బిలియనీర్.
నాలుగు శాతం పడిపోయిన హాంకాంగ్ బిలియనీర్ల సంపద.టెక్నాలజీ ఊపుతో అమెరికాలో 749కు పెరిగిన బిలియనీర్ల సంఖ్య.2019లో ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరగనున్న బిలియనీర్ల సంఖ్య.