DailyDose

పెరిగిన డాలరు విలువ-వాణిజ్యం-11/13

Dollar Value Hiked-Telugu Business News Today-11/13

*దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ప్రారంభమైంది. దళార తో పోలిస్తే 71.75 వద్ద ప్రారంభమైంది.
*మోటరోలాకు చెందిన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఫో‍ల్డబుల్‌ డివైస్‌లపై భారీ క్రేజ్‌ నెలకొన్న నేపథ్యంలో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా తన ఐకానిక్‌ మోడల్‌ మొబైల్‌ను మళ్లీ తీసుకొస్తోంది. అత్యుత్తమ ఫీచర్స్‌తో ఫోల్డబుల్‌ డిస్‌ప్లేతో తన పాపులర్‌ మోడల్‌ ‘మోటరోలా రాజర్’ను తీసుకురాబోతోంది. మోటరోలా రాజర్ 2019 పేరుతో అదీ ఫ్లిప్‌ తరహాలోనే ఆ విష్కరించనుంది.
* సుప్రీంకోర్టు తీర్పుతో వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని బ్రిటన్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ సీఈవో నిక్‌రీడ్‌ వ్యాఖ్యానించారు. వొడాఫోన్‌– ఐడియా జాయింట్‌ వెంచర్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
*వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,070, విజయవాడలో రూ.38,740, విశాఖపట్నంలో రూ.39,140, ప్రొద్దుటూరులో రూ.38,800గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,300, విజయవాడలో రూ.35,900, విశాఖపట్నంలో రూ.36,000, ప్రొద్దుటూరులో రూ.35,950గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,900, విజయవాడలో రూ.45,500, విశాఖపట్నంలో రూ.45,500, ప్రొద్దుటూరులో రూ.45,500 వద్ద ముగిసింది.
*ఆన్లైన్ క్యాబ్ బుకింగ్స్ యాప్ సంస్థ ఉబెర్, భారత్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం భారత్లో తన అనుబంధ సంస్థ ఉబెర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీలో కొత్తగా రూ.1,767 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
*గోల్డ్ ఈటీఎఫ్లపై మదుపరులకు భరోసా కుదురడం లేదు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (అంఫి) తాజా గణాంకాలే ఇందుకు ఉదాహరణ.
*దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) మరో కొత్త కారును ప్రవేశపెట్టనుంది.
*ఆర్థిక మందగమనం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) జీడీపీ వృద్ధి రేటుకు పెద్ద చిల్లే పెట్టబోతోంది. కీలక రంగాల్లో పెట్టుబడులు, డిమాండ్, వృద్ధి రేటు మందగించడంతో 2019-20లో జీడీపీ వృద్ధి రేటు అయిదు శాతం మించక పోవచ్చని ఎస్బీఐ ఆర్థిక పరిశోధనా విభాగానికి చెందిన ‘ఎకోర్యాప్’ తన తాజా నివేదికలో పేర్కొంది.
*సెప్టెంబరు, 2019తో మగిసిన రెండో త్రైమాసికంలో స్థానిక అరబిందో ఫార్మా కంపెనీ తన లాభాలను స్వల్పంగా పెంచుకుంది.
*పెన్నార్ ఇండస్ట్రీస్ సెప్టెంబరు, 2019తో ముగిసిన రెండో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్) ఈ కాలానికి కంపెనీ రూ.579.95 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభం ఆర్జించింది.