ScienceAndTech

ఫేస్‌బుక్ పే వచ్చేసింది

Facebook Pay Is Here-Telugu Science And Technology Latest News Roundup Today

సరికొత్త ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు అందించేందుకు ‘ఫేస్‌బుక్‌ పే’ అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలు సులువైన, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రారంభిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనిని ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
*ఎలా వినియోగించాలంటే..
‘ఫేస్‌బుక్‌ పే’ను వాడుకోవాలంటే తొలుత మీ ఫేస్‌బుక్‌ ఖాతాలోని ‘సెట్టింగ్స్‌’ లోకి వెళ్లండి. అక్కడ ‘ఫేస్‌బుక్‌ పే’ అనే ఆప్షన్‌ని సెలక్ట్‌ చేయండి. తరువాత పేపాల్‌, లేదా మీకు ఇష్టమైన ఇతర చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి. తర్వాత ‘యాడ్‌’ చేయండి. ‘ఫేస్‌బుక్‌ పే’ ఇంచుమించు అన్ని పెద్ద బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో, పేపాల్‌తో కూడా పనిచేస్తుంది. మనం ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నామో దీని ద్వారా నిఘా పెట్టవచ్చని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ప్రస్తుతం దీనిని వాడటానికి ఫేస్‌బుక్‌ ఖాతా ఉండటం తప్పనిసరి. అయితే, త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లలో కూడా అందుబాటులోకి వచ్చినపుడు ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో పని ఉండదని ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో వివరించింది