Business

కడప నుండి కొత్తగా కర్ణాటకకు విమానాలు

Kadapa To Karnataka Flight Services

కడప నుంచి త్వరలో కర్ణాటక రాష్ట్రానికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కడప నుంచి విజయవాడ, హైదరాబాదు, చెన్నై ప్రాంతాలకు విమాన సర్వీసులను ట్రూజెట్‌ సంస్థ నడుపుతోంది. ఇదే సంస్థ డిసెంబరు రెండో వారంలో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంకు మరో విమాన సర్వీసును నడపడానికి సిద్ధమైంది. గోవా వెళ్లాలనుకునే పర్యాటకులకు కడప నుంచి బెల్గాం వరకు విమానంలో ప్రయాణించి అక్కడ నుంచి రోడ్డు మార్గాన రెండు గంటల్లో గోవాకు చేరుకోవచ్ఛు కడప వాసులకు కర్ణాటక రాష్ట్రంతో చాలా అనుబంధం ఉంది. విద్య, వ్యాపారం, పర్యాటకం కోసం అధిక సంఖ్యలో పక్క రాష్ట్రానికి ప్రయాణిస్తున్నారు. వారందరికీ విమాన సర్వీసు అందుబాటులోకి వస్తే సమయం ఆదా ఆవుతుంది.
*ఇండోర్‌, మైసూరు ప్రాంతాలకు
ఈ నెల 15 నుంచి న్యూ కనెక్టివిటీ ద్వారా కడప నుంచి ఇండోర్‌, మైసూరు ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ట్రూజెట్‌ కల్పించింది. ఇండోర్‌ వెళ్లే ప్రయాణికులు కడప నుంచి హైదరాబాదు మీదుగా నేరుగా ఇండోర్‌కు ప్రయాణించవచ్ఛు తిరుగు ప్రయాణంలో ఇండోర్‌ నుంచి నేరుగా కడప వరకు ప్రయాణించవచ్ఛు కడప నుంచి మైసూరు వెళ్లే ప్రయాణికులు వయా చెన్నై ద్వారా ప్రయాణించవచ్ఛు తిరుగు ప్రయాణంలో మైసూరు నుంచి చెన్నై మీదుగా నేరుగా కడప చేరుకోవచ్ఛు
*ఉడాన్‌ పథకంలో భాగంగా..
జిల్లాలో విమాన ప్రయాణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి, చిన్న పట్టణాలు, నగరాల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడానికి ఉడాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2017 ఏప్రిల్‌ 27న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద నడిచే విమాన సర్వీసులు ఇప్పటి వరకు కడప నుంచి మూడు ఉన్నాయి. ఇప్పుడు బెల్గాంకు మరో సర్వీసు నడపనున్నారు. ఈ సర్వీసులు ప్రతిరోజూ నడుస్తాయి. శని, ఆది, సోమ వారాలలో విమానయానం ధరలు అధికంగా ఉంటాయి. సుమారు నెల రోజుల ముందే టిక్కెట్టు బుక్‌ చేసుకుంటే ధర తక్కువగా ఉంటుంది.
*జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కడప విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం జిల్లా నుంచి మూడు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోని బెల్గాంకు విమాన సర్వీసు ప్రారంభిస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. గతం కన్నా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అందుకనుగుణంగా టెర్మినల్‌ భవనాన్ని విస్తరించబోతున్నాం. త్వరలో నైట్‌ల్యాండింగ్‌ సదుపాయం కల్పిస్తున్నాం. – పి.శివప్రసాద్‌, ఎయిర్‌పోర్టు డైరెక్టరు, కడప