Movies

డిసెంబరులో నయన్ పెళ్లి

Nayanthara To Tie The Knot In December 2019

దక్షిణాదిలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ఇప్పటికే రెండుసార్లు ప్రేమపేరుతో మోసగించిపోయిందన్న విషయం తెలిసిందే. అయినా మూడోసారి ప్రేమనే నమ్ముకుంది. శింబుతో ప్రేమ పెళ్లి వరకూ చేరలేదు. ప్రభుదేవాతో పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు కూడా. అయినా సమాజంలో జీవిస్తున్నారు కనుక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరగడంతో పెళ్లి చేసుకోవాన్న నిర్ణయానికి ఇదీ ఒక కారణం అని ప్రచారం జరుగుతోంది. కాగా ఓ ప్రముఖ జ్యోతిష్కుడు కూడా నయనతార వివాహం డిసెంబరులో జరుగుతుందని చెప్పారు.