Health

బరువు సహజంగా తగ్గుదాం

Please lose weight naturally and not with steroids

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న చాలామంది వెయిట్‌లాస్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. అలా కాకుండా సహజంగా బరువు తగ్గించుకోవడానికి ఇంట్లోనే చాలా చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.. జీవక్రియ రేటును పెంచే కలబంద అందరి ఇంట్లో ఉంటుంది. బరువును తగ్గించే, ఫ్యాట్‌ను కరిగించే సామర్థ్యాన్ని ఇందులో ఉంటుంది. కలబంద రసాన్ని గ్రీన్‌ టీలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్‌, విసిరల్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల కొవ్వును కరిగించడంలో కలబంద సహాయపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్‌ ను రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవడం వల్ల స్లిమ్‌ గా తయారు కావచ్చు. కలబంద రసం లో ఉండే ఫైటో స్టెరాల్స్‌ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడి శరీర బరువు తగ్గుతారు. శరీర బరువు తగ్గించే అద్భుతమైన మరో ఔషదం అల్లం. ఒక కప్పు నీటిలో ఒక చెంచా కలబంద రసం, ఒక చెంచా అల్లం రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఎక్కువ సమయం మరిగించాలి. చల్లారిన తర్వాత తాగాలి. క్రమం తప్పకుండా తాగితే అతి బరువు సమస్య తీరుతుంది.టీ ఆక్సిడెంట్‌ లను అధికంగా కలిగి ఉండే గ్రీన్‌ టీ శరీర బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది. గ్రీన్‌ టీలో కలబంద రసం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.