DailyDose

తెదేపా సత్తా చూపిస్తాం-బాబు-రాజకీయ-11/13

TDP Will Bounce Back-Chandrababu-Telugu Politics Today-11/13

* తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పాల్గొన్న కృష్ణా, గుంటూరు జిల్లా మండల పార్టీ నాయకులుభవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే రేపటి దీక్ష: చంద్రబాబువిజయవాడలో రేపటి 12 గంటల నిరసన దీక్ష సక్సెస్ చేయాలి.
రెండు జిల్లాల నుంచిరీగా తరలిరావాలి.ఇసుక కృత్రిమ కొరతను వైసిపి నేతలే సృష్టించారు. శాండ్ మాఫియాగా ఏర్పడి దోపిడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని అడ్డుకున్నారు. కష్టం, ఇంత నష్టం గతంలో లేదు. 5నెలల్లో 50మంది కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్ర చరిత్రలో లేవు. పనుల్లేక ఎన్నో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. అనేకమంది అప్పుల పాలయ్యారు. ఇంత పెద్దఎత్తున ఆత్మహత్యాయత్నాలు గతంలో ఎన్నడూ లేవు.టార్గెట్లు పెట్టుకుని వైసిపి నేతలు దోచేస్తున్నారు.
ఇసుక, సిమెంటు,మద్యం,వర్కులు అన్నింటిలో దోపిడి.వ్యాపారాలు చేయాలంటే, ఆస్తులు అమ్మాలంటే ‘జె ట్యాక్స్’ కట్టాలి.
కార్మికుల కష్టాల్లో అందరూ అండగా ఉండాలి. కార్మికుల కుటుంబాలకు సంఘీభావంగా చూపాలి. వివిధ ప్రాంతాలనుంచి ర్యాలీగా దీక్షకు తరలిరావాలి. కార్మికులకు సంఘీభావంగా ర్యాలీలు జరపాలి. అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నిలిపేశారు. సింగపూర్ కన్సార్షియంతో ఎంవోయూ రద్దు చేశారు. ఏపి అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతం. రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు.పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేశారు. రాష్ట్రంలో అన్నిప్రాజెక్టుల పనులు ఆపేశారు.ప్రభుత్వ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం. రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేస్తున్నారు. ఇష్టానుసారం చేయడానికి ఇది నిరంకుశత్వం కాదు. ప్రజాకంటక పార్టీగా వైసిపి మారింది. ప్రజల పట్ల బాధ్యతగల పార్టీ తెలుగుదేశం.37ఏళ్లుగా టిడిపి పేదలకు అండగా ఉంటోంది. 22ఏళ్ల అధికారంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసింది. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతోంది. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం కృషి.రాష్ట్రంలో తక్షణమే ఇసుక ఉచితంగా ఇవ్వాలి. సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలి. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలి. పనులు కోల్పోయినవారికి నెలకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి.12 గంటల నిరసన దీక్షలో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలి.
* రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరింది
బడిని, గుడిని వదలని వైసీపీ వాళ్ళు, అవకాశం వుంటే ఇసుకకి, ఇంద్రధనస్సు కి వైసీపీ రంగులు వేసేలా వున్నారు
అన్నవరంలో అన్యమత ప్రచారం, ఐలాండ్ లో అర్చిల పై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టల్స్ ఏర్పాటు, వైసీపీ మత వ్యాప్తి నీ సూచిస్తుంది.ట్విట్టర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
* రేపు ఉదయం 8గంటల నుంచి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష
ధర్నా చౌక్ లో ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు…మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్…రేపు ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు ఇసుక దీక్ష చేపడుతున్నారుప్రతి ఏడాది గోదావరి,కృష్ణ కు వరదలు వస్తాయిటీడీపీ హయాంలో ఏనాడు ఇసుక కొరత రాలేదుదీక్షకు రాజకీయ పార్టీలు, భవన నిర్మాణ కార్మిక సంఘాల మద్దతు కోరాం
* కశ్మీర్‌పై వెనక్కి తగ్గిన బ్రిటన్‌ ప్రతిపక్షం
కశ్మీర్‌ అంశంపై భారత వైఖరికి భిన్నంగా వ్యవహరించిన బ్రిటన్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. అక్కడి భారతీయ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని మార్చుకుంది. కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. ఇతర దేశాల వ్యవహారాల్లో ఇకపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ ఛైర్మన్‌ ఇయాన్‌ లావెరీ ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌పై భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరింబోమన్నారు. సెప్టెంబరులో కశ్మీర్‌లోకి అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించాలంటూ చేసిన తీర్మానాన్ని అత్యవసర, భావోద్వేగ సందర్భంలో తీసుకోవాల్సివచ్చిన నిర్ణయంగా అభివర్ణించారు. తమ పార్టీ వైఖరి వల్ల బ్రిటన్‌లోని వివిధ వర్గాల మధ్య చీలికలు రావాలని తాము కోరుకోవడం లేదన్నారు. కశ్మీర్‌లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని, అక్కడి ప్రజలకు స్వీయ నిర్ణయాధికారాన్ని కల్పిస్తూ ఐరాస నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ గత సెప్టెంబరులో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన అక్కడి పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత వర్గాలు దీన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. తప్పుడు అభిప్రాయలపై ఆధారపడి తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించాయి. మరోవైపు కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోసం బ్రిటన్ లేబర్ పార్టీ అభ్యర్థించడాన్ని ఇటు భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా విమర్శించింది. ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే లేబర్ పార్టీ ఈ చర్యకు దిగిందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
* ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణ: జగ్గారెడ్డి
ఒకవైపు రైతులు, మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రం ‘ఆత్మహత్యల తెలంగాణ’గా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. స్వరాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఉండవని సీఎం కేసీఆర్‌ చెప్పారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. 39 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగడం ఇదే తొలిసారని.. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదన్నారు
* రేపు బీజేపీలో చేరనున్న 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు
కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు రేపు బీజేపీలో చేరనున్నారు. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు రేపు సీఎం యడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అశ్వంత్ నారాయణ సీఎన్ తెలిపారు. బీజేపీలో చేరేందుకు వారు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ పార్టీ సీనియర్ నాయకులను కలిశారన్నారు. సీఎం యడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నలిన్ కుమార్ కతిల్ సమక్షంలో రేపు ఉదయం 10.30 గంటలను పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన అనంతరం వీరిలో పలువురు ఎమ్మెల్యేలు అశ్వంత్ నారాయణతో కలిసి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను ఢిల్లీలో కలిశారు.
*జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి- లోకేష్
భావన నిర్మాణ కర్మిలుక నోటి దగ్గరి కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోతలు నిర్మిస్తున్నరని తెదేపా నేత నారా లోకేష్ ఆరోపించారు. ఏపీలో నెలకొన్న ఇసుక కృతిమ కొరత అక్రమ రవాణా పై ఈనెల పద్నాలుగున చందబాబు చేపట్టిన నిరసన దీక్ష నేపద్యంలో విజయవాడలో విడుదల చేసిన ఇసుక దొరకడం లేదు అంటూ చిలక పలుకులు పలుకుతున్న జగన్ భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలి.
*అమ్మాలన్నా, కొనాలన్నా జే ట్యాక్స్ కట్టాలి- చంద్రబాబు
పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపా నేతలతో నేడు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక కృతిమ కొరతను వైకాపా నేతలే సృష్టించారని అన్నారు. ఏపీలో వెంటనే ఇసుక ఉచితంగా ఇచ్చి అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ఇదు నెలల్లో యాభై మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారనే చంద్రబాబు పేర్కొన్నారు. పనుల్లేక ఎన్నో కుటుంబాలు పస్తులున్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
*భాజపాలోకి తెదేపా ఎమ్మెల్యే
మాజీ మంత్రి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఏపీ భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు కలిసారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భాజపాలోకి వెళతారనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జోరుగా సాగుతోంది. ఈ నేపద్యంలో సోము వీర్రాజు గంటాను కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం మ్నీదియాతో మాట్లాడిన సోము వీర్రాజు తెదేపా త్వరలో ఖాళీ అవడం ఖాయం అని అన్నారు. తెదేపా నుంచి త్వరలోనే మరికొంతమంది నేతలు భాజపాలోకి వస్తారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
*నిరాహార దీక్ష మాటను అపహాస్యం చేస్తున్నారు: విజయసాయి
ఏపీలో ఇసుక కొరత సమస్య పై ఈనెల పద్నాలుగున ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెదేపా అధినేత చంద్రబాబు దీక్షకు దిగనున్నారు. భావన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలియజెప్పడానికి ఇసుక దీక్ష చేస్తున్నామని తెదేపా నేతలు ప్రకటించారు. అలాగే పద్నాల్గవ తేదీ తరువాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. కొడుకేమో నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష ఆన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చస్తున్నారు అని విజయసాయి రెడ్డి వ్యంగాస్తరాలు చేసారు.
*చ్ఘంద్రబాబు ఎంత కష్టపడినా లాభం లేదు: సోము వీర్రాజు
ఏపీలో త్వరలో తెదేపా ఖాళీ అవుతుందని భాజపా సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబ్బు ఎంత తిరిగినా ఇదే జరుగుతుందని ప్రజలు ఆయనను నమ్మరని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడురూ తెదేపాకి చెందిన ఎమ్మెల్యేలంతా భాజపాలోకి చేరతారని చెప్పారు. ఈససనసభ సమావేశాల్లోకి భాజపాకి ప్రాతినిధ్యం ఖాయమని అసెంబ్లీలో భాజపాకి మంచి స్థాయి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
* ఇసుక మాఫియాగా ఏర్పడి దోచుకుంటున్నారు
టార్గెట్లు పెట్టుకుని మరీ వైకాపా నేతలు ఇసుకను దోచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే రేపు దీక్ష చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇసుక కృత్రిమ కొరతను వైకాపా నేతలే సృష్టించి.. మాఫియాగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు చేయాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా ‘జె ట్యాక్స్’ కట్టాలని దుయ్యబట్టారు. కార్మికుల కష్టాల్లో అందరూ అండగా ఉండాలని.. వారి కుటుంబాలకు సంఘీభావం చూపాలని తెలిపారు. కార్మికులకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
* వైకాపా దాడులపై ఫిర్యాదులు‌: కిషన్‌రెడ్డి
వైకాపా ప్రభుత్వం పూర్తిగా పక్షపాతంతో, కక్షసాధింపు చర్యలతో పనిచేయడం మంచిపద్ధతి కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. భాజపా కార్యకర్తలపై వైకాపా దాడులకు దిగుతున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వంలా వ్యవహరించాలి తప్ప కక్షసాధింపు చర్యలతో వ్యవహరించడం మంచి సంప్రదాయంగా ఎవరూ భావించబోరని సూచించారు. రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతోందని.. బలవంతపు మతమార్పిడులు మంచిది కాదన్నారు. అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష పార్టీ పోరాటం చేసినా తమ సంఘీభావం ఉంటుందని స్పష్టంచేశారు.
* ఉద్ధవ్‌తో కాంగ్రెస్ నేతల కీలక భేటీ
మహారాష్ట్రలో పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించి, కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చించేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, పార్టీ సీనియర్ నేతలు మానిక్‌రావు థాక్రేలు ట్రిడెంట్ హోటల్‌లో ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యారు. వీరి మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యమని పేర్కొంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఇచ్చిన నివేదకతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఉద్ధవ్‌తో కాంగ్రెస్ నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ నిర్ణయంపై శివసేన ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
* మా బలమేంటో అప్పుడు చూపిస్తాం: లక్ష్మణ్
రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ గెలిచాక కేసీఆర్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇదే సమయంలో బీజేపీ, మోదీ గ్రాఫ్ వేగంగా పెరిగిపోతోందన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోవన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలంమేంటో నిరూపించుకుంటామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగాయన్నారు.
* కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన చాడ
సీఎం కేసీఆర్ వైఖరి, ఆయన నిర్ణయాలు తీవ్ర ఆక్షేపనీయం అని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఎవరినీ కలవడం లేదని, కొత్తగా వచ్చిన గవర్నర్ అందరినీ కలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న కేసీఆర్.. ఆ ప్రజలను ఎందుకు కలవరని ప్రశ్నించారు. కేసీఆర్ మొండి వైఖరి, అహంకారమే ఆర్టీసీ సమ్మెకు కారణమని అన్నారు. సీఎం వైఖరి కారణంగా 27 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు.
*కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే
కందగిరి లక్ష్మీ నరసింహ స్వామి జాతర సాక్షిగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందగిరిగుట్టను ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి నర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఏడాదిలోగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రోడ్లు, మిగిలిన పనులకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు.
*మా ప్రయత్నాలు కొనసాగుతాయ్:కాంగ్రెస్,ఎన్సీపీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ చర్చలు, ప్రయత్నాలు కొనసాగుతాయని కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో దిల్లీలో కాంగ్రెస్, ఎస్సీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మీడియాతో మాట్లాడారు. కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి తాము ఇంకా చర్చించలేదని శరద్పవార్ చెప్పారు.
*విలువలు దిగజార్చేలా వైకాపా వ్యాఖ్యలు: కాల్వ
గతంలో ఎప్పుడూ లేని విధంగా కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా ప్రభుత్వం యత్నిస్తోందని తెదేపా సీనియర్నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘జగన్ సీఎం అయ్యాక ఓ వర్గం వారు ఆనందంగా ఉన్నారని రోజా చెప్పారు. ఈ ప్రభుత్వం ఏ వర్గానికి కొమ్ము కాస్తుందో రోజా మాటలు రుజువు చేస్తున్నాయి. తెదేపా హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. నాడు వైఎస్ హయాంలో, నేడు జగన్ హయాంలో అధికారం ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలుసు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. స్పీకర్ స్థానానికి తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదని తమ్మినేని చెబుతున్నారు.
*ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు: వంశీ
గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని…కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. సామాజికమాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు, బెదిరింపులు, ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడంపై గతంలో వంశీ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది.
*భగీరథ, కాకతీయ’ను కేంద్రమంత్రి మెచ్చుకోలేదు: భాజపా
తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఎదుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు మైండ్గేమ్ ఆడుతున్నారని భాజపా విమర్శించింది. సోమవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతోగానీ, సమావేశంలోగానీ మిషన్ భగీరథ, కాకతీయ పథకాలను ఎక్కడా మెచ్చుకోలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.ప్రకాశ్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
*మహారాష్ట్రలో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం: ఒవైసీ
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనతో భాజపాకే లాభమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. అక్కడ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ కార్యాలయం దారుస్సలాంలో మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. శివసేనతో జట్టుకట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. తమ పార్టీ మహారాష్ట్రలో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై రాజ్యాంగానికి లోబడే స్పందించినట్లు చెప్పారు. తన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్లో నమోదైన కేసుకు భయపడేది లేదని పేర్కొన్నారు.
*ఝార్ఖండ్ ఎన్డీయేలో చీలిక!
ఝార్ఖండ్ ఎన్డీయేలో చీలిక వచ్చింది. అసెంబ్లీ సీట్ల పంపకం కొలిక్కి రాకపోవడంతో భాజపా, లోక్ జనశక్తి(ఎల్జేపీ), ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ)లు తలోదారి చూసుకుంటున్నాయి. తమను సంప్రదించకుండా భాజపా 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయడం… ఎల్జేపీ, ఏజేఎస్యూలకు మింగుడు పడలేదు. సీట్ల పంపకంపై అవగాహన కుదరకపోవడంతో తాము సొంతంగా 50 చోట్ల పోటీ చేస్తామని ఎల్జేపీ ప్రకటించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు.
*పవన్ నాయుడికి చంద్రబాబు చెప్పేదే వినిపిస్తుంది
జనసేన అధినేత పవన్ నాయుడికి వైకాపా ప్రభుత్వం అమలుచేస్తున్న మంచి కార్యక్రమాలేవీ కనిపించట్లేదని.. చంద్రబాబు చెప్పేదే వినపడుతోందని రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే 1.20 లక్షల మందికి ఉద్యోగకల్పన, ఆటోవాలాలకు రూ.10 వేలు, రైతుభరోసా వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తున్నా ఆయనకు ఇసుక సమస్యే కనిపిస్తోందన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
*వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా
రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి వైకాపా ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 14న చేపట్టనున్న దీక్షను పురస్కరించుకుని విజయవాడలోని కేశినేని భవన్లో మంగళవారం తెదేపా నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇసుక దొరకకపోయినా.. ఇతర రాష్ట్రాలకు మాత్రం భారీగానే తరలుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు పార్టీలకు అతీతంగా కలిసి పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
*ఇది ప్రభుత్వ వైఫల్యమే: అమర్నాథ్రెడ్డి
వైకాపా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సింగపూర్ ప్రభుత్వం అమరావతి రాజధాని నగరం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేసుకుందని తెదేపా నేత, మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. రాజధాని విషయంలో తన ప్రాధాన్యతను మార్చుకోవడం వల్లే పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు సింగపూర్ ప్రభుత్వం పేర్కొనడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
*జగన్ చేజేతులా నాశనం చేస్తున్నారు: మోహన్దాస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏపీపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఛైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి.వి.మోహన్దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. అమరావతిలో అంకురప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేయడం, దాని నుంచి సింగపూర్ సంస్థల కన్సార్షియం వైదొలగడంపై ఆయన మంగళవారం ట్విటర్లో స్పందించారు.
*18న ఏలూరుకి చంద్రబాబు రాక
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18న జిల్లాకు రానున్నారు. మూడు రోజులపాటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామ లక్ష్మి తెలిపారు. మంగళవారం సాయంత్రం తణుకు బైపాస్ రోడ్లోని కల్యాణమండపాన్ని ఆమె పరిశీలించారు. 18న మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబునాయుడు జిల్లాకు చేరుకుంటారన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారన్నారు.