NRI-NRT

కెనడాలో కార్తీక పౌర్ణమి వేడుకలు

calgary canada kartheeka pournami celebrations-tnilive telugu news

కెనడా ఆల్బర్టా కాల్గరీలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాల్గరీలోని శ్రీ అనగా దత్త సొసైటీ సాయి బాబా మందిరంలో అత్యంత వైభవంగా సహస్ర దీపాలతో కనుల విందుగా ఎంతో భక్తి శ్రద్దలతో అలంకరించారు. దేవాలయ ప్రధాన అర్చకులు రాజకుమార్ శర్మ గారు కార్తీక పౌర్ణమి విశిష్టతను చక్కగా వివరించారు. సుమారు 400 మందికి పైగా ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీ శివ అభిషేకం, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం వేదనిష్ఠతో నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. అందరికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. మన సాంస్కృతిని చాటి చెప్పేందుకు శ్రీమతి లలిత. శ్రీశైలేష్, రాజకుమార్ శర్మ మరియు వాలంటీర్లు పాల్గొని చేసిన కృషికి అందరూ అభినందించారు.