DailyDose

లోకేశ్‌ను పట్టించుకోని ధూళ్లిపాళ్ల-రాజకీయం-11/14

Dhulpalla Narendra Stays Away From Lokesh-Telugu Political News-11/14

*గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. అయితే ఆయన టూర్ కు మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ళ నరేంద్ర దూరంగా ఉన్నారు. లోకేష్ టూర్ కు ఆయన ఎందుకు రాలేదనేది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయంషగా మారింది. పొన్నూరు నుంచి దూలిపాళ్ళ నరేంద్ర ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి కొంత సైలెంట్ గా ఉంటున్నారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భావన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబ సభ్యులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. లోకేష్ తో పాటు గుంటూరు జిల్లా కీలక నేతలు వచ్చారు. తన నియోజకవర్గానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వస్తే దూలిపాళ్ళ నరేంద్ర పాల్గొనకపోవడం చర్చనీయామ్షంగా మారింది. దూలిపాళ్ళ నరేంద్ర పది రోజుల కిందటే అయ్యప్ప మాల వేసుకున్నారట. దీంతో ప్రోగ్రాం కు రాలేదని గుంటూరు తెదేపా నేతలు కొందరు క్లారిటీ ఇచ్చారు. అయితే నారా లోకేష్ తో దూలిపాళ్ళ నరేంద్రకు గ్యాప్ ఉందనేది ఆఫ్ ది రికార్డుగా వినిపిస్తున్న మాట. గుంటూరు జిల్లా తెదేపా అద్యక్ష పదవి కోసం పార్టీ ఆలపాటి రాజాతో పాటు దూలిపాళ్ళ నరేంద్ర ట్రై చేస్తున్నారట. వీరి మధ్య అద్యక్ష పదవి కోసం తెగ పోటీ నడుస్తుందట. తన నియోజకవర్గంలోకి లోకేష్ ను ఆలపాటి రాజా తీసుకు వస్తున్నారని భావించిన దూలిపాళ్ళ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతోంది. ఆలపాటికి నరేంద్రకు మొదటి నుంచి జిల్లాలో వర్గ పోరు నడుస్తుందట.
* సిమెంట్ కంపెనీలపై జే టక్స్
సిమెంటు కంపెనీలను బెదిరించారు. వాటి నుండి రూ.2500 కోట్లు జే ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేసారు. ఆ కంపీనీలను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇసుకకు కృతిమ కొరత సృష్టించారు. అని తెదేపా ఆరోపించింది. చంద్రబాబు ఇసుక దీక్షను పురస్కరించుకుని ప్రచురించిన కరపత్రంలో తెదేపా రాష్ట్ర కమిటీ పలు ఆరోపణలు చేసింది. సమయులకు ట్రాక్టర్ ఇసుక దొరకడం లేదని కాని వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు నాయకులు వందలాది లారీల ఇసుకను యథేచ్ఛగా తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు తరలించి వందల కోట్లు దోచుకున్తున్నర్నై విమర్సించారు.
* రఫేల్‌’పై కేంద్రానికి ఊరట
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్‌పై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రఫేల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 డిసెంబర్‌ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ కేంద్రానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరీలతోపాటు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తాజాగా వీటిపై తీర్పు వెల్లడించింది.
* రాష్ట్రపతి పాలనా విధింపు వెనుక ఒక అదృశ్య శక్తి ఉంది- శివసేన
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించడం పై భాజపాతో పాటు ఆరాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి పై శివసేన అధికారిక పత్రిక సామ్నా ఆరోపించింది. రాష్ట్రపతి పాలన విధించాలనే నిర్ణయం వెనుక ఒక కనిపించని శక్తి ఉందని తెలిపింది. ఆ అదృశ్య శక్తే గవర్నర్ ను ఒప్పించేలా భాజపాకి ఆపార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షాకు మార్గనిర్దేశం చేసిందని పేర్కొంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంతో తానూ చాలా అప్ సెట్ అయ్యానని ఇది దురదృష్టం అంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మొసలి కన్నీరు కారుస్తునారని సామ్నా విమర్శించింది. రాజకీయ అస్తిరత్వతో మహారాష్ట్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని పడ్నవిస్ అన్నారని ఆయన చెప్పేవాన్ని అబద్దాలేనని విమర్శించారు.
* ఇంటి దొంగలు సీఎంకు కనపడరా?: చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో కార్మికులు రోడ్డునపడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇసుక సమస్య ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసత్యాలతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలను మోసం చేయలేరని అన్నారు. ఇసుక కొరత సృష్టించి సిమెంట్‌ కంపెనీలతో సీఎం బేరసారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భవననిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆయన విజయవాడలోని ధర్నాచౌక్‌లో 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని మండిపడ్డారు. ‘ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంటే.. ఇంటి దొంగలు సీఎంకు కనపడరా?’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.‘‘ ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఇసుక సమస్యను సృష్టించారు. దాదాపు 35 లక్షల మంది తిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారు. ఎవరూ చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోరు. కానీ భవన నిర్మాణ కార్మికులు సెల్ఫీ వీడియోలు తీసి తన బాధ చెప్పుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇసుక కొరత వల్ల 125 వృత్తుల వారు రోడ్డునపడ్డారు. ఇంతలా ఇసుక సమస్య ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. దేశంలోనే మొదటిసారిగా ఉచిత ఇసుక పాలసీ మేం తీసుకొచ్చాం. ఉచిత ఇసుక పాలసీపై విమర్శలు చేసి.. ఇవాళ మాఫియాకు అప్పగిస్తారా? పోలీసులకు స్వేచ్ఛనిస్తే 24 గంటల్లో మాఫియాను అడ్డుకుంటారు. ఈ సమస్యలకు ఉచిత ఇసుక పాలసీనే పరిష్కారం. దాదాపు 50 మంది కార్మికులు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించదా?’’అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలోకే..జనసేన అధినేత పవన్కల్యాణ్
తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే ఏపీ సీఎం జగన్రెడ్డితోపాటు వైకాపా ఎమ్మెల్యేలు మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఏ ప్రాంతానికి వెళ్లినా వారు తమ భాషను సంరక్షించుకుంటారని, భాషను చంపేసుకోవటంఅంటే మన ఉనికిని చంపేసుకున్నట్లే అని పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలోని విశాలాంధ్ర బుక్హౌస్, ఎమెస్కో బుక్ హౌస్లను సందర్శించారు.
*ఆర్టీసీని యథాతథంగా ఉంచండి: భట్టి
రాష్ట్రంలో 39 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. సమ్మెతో బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే దానిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీకి చెందిన ఆస్తులను ధారాదత్తం చేయొద్దని.. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు. రూట్లను ప్రైవేటుపరం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఆర్టీసీని యథాతథంగా కొనసాగించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
*కొత్త సంవత్సరంలోగా ప్రభుత్వం ఏర్పడాలి’
ఎన్సీపీ నేత అజిత్ పవార్
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఎవరికి వారు త్వరలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం అజిత్పవార్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేయడంతో.. తొలుత ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదరిన తర్వాతే శివసేనతో చర్చలు జరుపుతామన్నారు. తమ విధానాలతో పోలిస్తే శివసేన మ్యానిఫెస్టో భిన్నంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయమైనా కాంగ్రెస్తో కలిసే తీసుకుంటామని పునరుద్ఘాటించారు.
*వైకాపా గూటికి దేవినేని అవినాష్?
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైకాపాలో చేరనున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న అవినాష్ వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విజయవాడలో తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆయనతో పాటు కడియాల బుచ్చిబాబు, తదితరులు వైకాపాలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. అవినాష్ తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.
*సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోలేదు: లక్ష్మణ్
‘ఉమ్మడి ఆర్టీసీ నుంచి కేంద్రం వాటా టీఎస్ఆర్టీసీకి బదిలీ కాలేదు. కార్మికుల సమ్మె విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి లేదు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘చమురు కంపెనీలు ఆర్టీసీకి పెట్రోల్బంకులు ఇస్తే, వాటిని రూపాయి పెట్టుబడి లేకుండా 50కి పైగా ప్రైవేటుసంస్థలకు కట్టబెట్టారు. ఆ ఒప్పందాల్ని రద్దు చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తా’ అని చెప్పారు. లక్ష్మణ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న ఆలోచన భాజపాకు లేదని తెలిపారు. ప్రధాని మోదీ గ్రాఫ్ పెరుగుతుంటే, కేసీఆర్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని వ్యాఖ్యానించారు. ‘ఎన్టీఆర్ సీఎం అయిన ఏడాదికే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ప్రజల ఒత్తిడి పెరిగితే తెరాస ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి’ అంటూ లక్ష్మణ్ కీలకవ్యాఖ్యలు చేశారు.
*‘ఖరీఫ్’ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలి: సీపీఎం
ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కోరింది. చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. మార్కెట్లలో మద్దతు ధరలు అమలు కావడంలేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం వరకూ సుమారు 3 లక్షల క్వింటాల పత్తి వస్తే సీసీఐ కేవలం 400 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిందని చెప్పారు. తూకాల్లోనూ మోసాలను తక్షణమే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
*భాజపా కార్యకర్తలకు వైకాపా వేధింపులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొందరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోందని, అది మంచి పద్ధతి కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి హితవు పలికారు. వైకాపా కార్యకర్తలు తమను వేధిస్తున్నట్లు శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల ప్రాంతాల భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారని వెల్లడించారు. పథకం ప్రకారం మతమార్పిడులు జరగడం సరికాదని, అన్యమత ప్రచారంపై తగిన సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎప్పటికప్పుడు తమకు సమాచారం వస్తుందని గుర్తుచేశారు. బుధవారం విశాఖలోని భాజపా నగర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
*వైకాపా పిచ్చి పరాకాష్టకు చేరింది: కన్నా
రాష్ట్రంలో వైకాపా పిచ్చి పరాకాష్టకు చేరిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.‘బడినీ, గుడినీ వదలని వైకాపా వాళ్లు అవకాశముంటే ఇసుకకి, ఇంద్రధనస్సుకీ రంగులేసేలా ఉన్నారు. అన్నవరంలో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్లో ఆర్చిపై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవ్లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు.. వైకాపా మత వ్యాప్తిని సూచిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. కొన్ని ఫొటోలను ఈ ట్వీట్కు జతచేశారు.
*అసత్యప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు: లోకేశ్
ఇసుక కృత్రిమ కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన వైకాపా ప్రభుత్వం, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చిల్లర ఎత్తుగడలు అవలంబిస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘‘బ్లూఫ్రాగ్ సంస్థకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నాకు ఆ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అసత్య వార్తలు సృష్టించిన వారిపైన, సామాజిక మాధ్యమాల్లో వాటిని వ్యాప్తి చేస్తున్న వారిపైన చట్టప్రకారం చర్య తీసుకుంటా’’అని హెచ్చరించారు.
*చంద్రబాబు దీక్షకు జనసేన సంఘీభావం
రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత, సర్కారు హత్యలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలో గురువారం నిర్వహించనున్న 12గంటల దీక్షకు మద్దతివ్వాలని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి వర్ల రామయ్యలు జనసేన అధినేత పవన్కల్యాణ్ను కోరారు. దీనికి పవన్కల్యాణ్ సానుకూలంగా స్పందించి, జనసేన తరఫున దీక్షకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. బుధవారం పటమటలంకలోని ఆయన నివాసానికి వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులు, ఇసుక కొరత, చంద్రబాబు దీక్షపై వారు చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ‘సరైన విధానం లేకుండా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలు సంఘటితం కావాలి. చంద్రబాబు దీక్షతో ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.