NRI-NRT

ట్రైసిటీలో ఘనంగా దీపావళి సంబరాలు

ట్రైసిటీలో ఘనంగా దీపావళి సంబరాలు-Mytri Diwali 2019 In Tricity Michigan-TNILIVE Michigan Telugu News

మిషిగన్ రాష్ట్ర్ ట్రైసిటీలో మైత్రి తెలుగు సంఘం ఆధ్వర్యంలో గత శనివారం నాడు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాగినాలోని ట్రైసిటి హిందు ఆలయంలో విద్య తోటకూర, శ్రీనివాస్ వేమూరి ఏర్పాటు చేసిన ఈ వేడుకకు, సాగినా-బేసిటి-మిడ్ ల్యాండ్ పట్టణాల నుండి ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఐశిని కోనేరు గీతాలాపన అనంతరం సాంస్కృతిక కార్యాక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు షణ్విత, అభి, హను ప్రసీద, తీర్థ సహస్ర, వెర్ణిక, శ్లోక, అక్షర, అశ్విన్, కుషాన్, అఖిలేష్, ధ్వని, శ్రియ, మరియం, జైనబ్, క్రిష్టా, షర్మిత, సుహానా, జియా నయన, అద్వైత, అనన్య, ఆదిత్య, రిషిక, సిసిలియాలు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. కృష్ణకాంత్ చలసాని రచించిన గులాబ్ జాం 1.0 హాస్య నాటిక, జయ నంబియార్ బృందం ప్రదర్శించిన కిలి కిలి డ్యాన్స్, హేమమాలిని చేగొండి బృందం ప్రదర్శించిన కాలం యొక్క ప్రాధాన్యతను తెలియజేసే మూఖాభినయం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి భాను, మేఘనలు వ్యాఖ్యాత్రులుగా వ్యవహరించారు. స్థానిక ప్రముఖ వైద్యులు, హిందూ టెంపుల్ చైర్మన్ డాక్టర్ రఘురాం సర్వేపల్లి మాట్లాడుతూ తెలుగువారందరూ ఇక్కడ ఒక కుటుంబంలా కలిసి పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సాగినాలో నిర్మిస్తున్న రామాలయం నిర్మాణం రెండవ దశ అభివృద్ది పనుల గురించి వివరించారు. మైత్రి నిర్వాహకులు శ్రీధర్ గింజుపల్లి, మురళి గింజుపల్లి, నాగ సమ్మతం, సుజయ్ మద్దూరి తదితరులు పాల్గొన్నారు. బాణాసంచా కాల్చి వేడుకలకు ముగింపు పలికారు.