DailyDose

మహానందిలో విజిలెన్స్ తనిఖీలు-నేరవార్తలు-11/14

Vigilence Raid On Mahanandi Temple-Telugu Crime News Today-11/14

*మహానంది దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. టెండర్లుభక్తుల విరాళాలుహుండీ లెక్కింపుదసరా బ్రహ్మోత్సవాలుఅన్నదానంగోశాల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ మేరకు సోదాలు చేపట్టారు. దేవస్థానం అనధికార రికార్డులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
* పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వేంపాడుపామాయిల్ తోట లో గుర్తు తెలియని మహిళ హత్య..ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సిఐ శ్రీనివాస రావు. పెదపాడు ఎస్సై జ్యోతిబసు
* గంజాయి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఎఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. బుధవారం 240కేజీల గంజాయిని మారేడుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* కూకట్‌పల్లి మైత్రి నగర్ లో మద్యం మత్తులో ఓ వ్యక్తి పై దాడి…బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన రాజేష్ అనే వ్యక్తి పై రోడ్డుకి అడ్డంగా మద్యం సేవిస్తున్న కొంతమంది వ్యక్తుల దాడి…
*కల్హేర్ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట అన్నదమ్ములైన ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. మహదేవ్‌పల్లికి చెందిన శివమ్మపేరుతో ఉన్న ఎకరా కుంటల భూమిని వీఆర్ఓ లాలయ్య ఇతరుల పేరిట పట్టాచేశారని ఆమె కుమారులు ఆరోపించారు. భూమిని తిరిగి తన తల్లి పేరుమీద చేయాలని ఎన్నిసార్లు తిరుగుతున్నా రెవెన్యు సిబ్బంది పట్టించుకోవడం లేదని అన్నదమ్ములు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం దగ్గర వీఆర్ఓను నిలదీశారు
* గంజాయి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఎఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. 240కేజీల గంజాయిని మారేడుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎఎస్పీ వివరాలు వెల్లడించారు.
* అడవి పందులను వేటాడటానికి ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు తగులుకొని ఇద్దరు గిరిజన మహిళలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బాలగొండ గ్రామంలో చోటు చేసుకుంది.
* మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో ని రజక సంఘం కాలనీ, కుమ్మరి బోగుడ కాలనీలో డీసీపీ సంజీవ్ ఆధ్వర్యంలో లో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని40 బైక్స్, 6 ఆటోలలో పాటు15వేల విలువగల గుట్కా,4 కింటల్ ల రేషన్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు.
*ఇద్దరు బాలురు. బడి వదిలాక ఆడుకోవడానికి వెళ్లారు. ఓ డబ్బా కనిపించింది. అందులో ఉన్న ద్రవాన్ని పానీయమనుకున్నారు. ఇద్దరూ దాన్ని తాగేశారు. అది పురుగుల మందు అని వారికి తెలియదు. గొంతు దిగిన విషం గుండెల్ని మెలిపెట్టింది. ఒళ్లంతా పాకి ప్రాణాలు తీసేసింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి శివారు పిట్టలగూడెంలో బుధవారం సాయంత్రం జరిగిందీ సంఘటన.
*ఒడిశా రాష్ట్రం బాలాసోర్లోని ఓ రొయ్యల శుద్ధి పరిశ్రమలో గ్యాస్ లీకైంది. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటలో సుమారు 80 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
*రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో వాహనం, బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్లోని సికర్లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
*విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టరును ఢీకొట్టి లారస్ ఔషధ పరిశ్రమకు చెందిన బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆసంస్థకు చెందిన 10మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
*హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ‘హైదరాబాద్ టైం కేఫ్’పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దాడి చేసిన సమయంలో 25 మంది హుక్కా సేవిస్తున్నట్లు గుర్తించారు.
* ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పేరిట నమోదైన బీఎండబ్ల్యూ కారు యూపీలోని వారణాసిలో ఓ ఆటోను ఢీ కొట్టింది. వారణాసిలోని రోహిన్య ప్రాంతంలో గురువారం ఉదయం బీఎండబ్ల్యూ కారు ఆటోను ఢీ కొట్టింది.
*జమ్మూకశ్మీర్లో కిష్టవర్ జిల్లాలో బుధవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఐదు మంది గాయాల పాలయ్యారు.
*కుటుంబ కలహాలతో తండ్రి చేతిలో తనయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
*విశాఖ సిరిపురం ప్రాంతంలోని బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ డీఎస్పీ చిట్టిబాబు ఆధ్వర్యంలో అధికారులు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తృత సోదాలు చేశారు.
*సెంట్రింగ్ మేస్త్రీగా పనిచేసే గండికోట తిరుమలరావు(52) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన గుంటూరు జిల్లా గ్రామీణ మంగళగిరి మండలం చినకాకాని దీనదయాళ్నగర్ నివాసి.తల్లిలేని పిల్లాడిని అన్నీ తానై పెంచాడా తండ్రి. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కుమారుడు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల సాంబారు పాత్రలో పడి చనిపోయాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యాంసుందరరెడ్డి, కల్పన భార్యాభర్తలు.
*గుండెపోటుతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో చోటుచేసుకుంది.
*రెవెన్యూ రికార్డుల ప్రకారం తనకు రావాల్సిన భూమిని ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బుధవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల తహసీల్దారు కార్యాలయం ఎదుట రైతు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
*ఇద్దరు బాలురు. బడి వదిలాక ఆడుకోవడానికి వెళ్లారు. ఓ డబ్బా కనిపించింది. అందులో ఉన్న ద్రవాన్ని పానీయమనుకున్నారు. ఇద్దరూ దాన్ని తాగేశారు. అది పురుగుల మందు అని వారికి తెలియదు. గొంతు దిగిన విషం గుండెల్ని మెలిపెట్టింది. ఒళ్లంతా పాకి ప్రాణాలు తీసేసింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి శివారు పిట్టలగూడెంలో బుధవారం సాయంత్రం జరిగిందీ సంఘటన.