DailyDose

చింతమనేనికి బెయిల్-నేరవార్తలు-11/15

Chinthamaneni Gets Bail-Telugu Crime News Today-11/15

* మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ కి బెయిల్ మంజూరుఇప్పటికే నాలుగు కేసుల్లో జైలు లో వున్న ప్రభాకర్ నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన కోర్టు రేపు ఏలూరు సబ్ జైల్ నుండి చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యే అవకాశం
* శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారామ్ గారిపై టిడిపి నేతలు అచ్చెన్నాయుడు,కూనరవికుమార్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు,టిడిపి ఈ పేపర్ లో స్పీకర్ ను దూషిస్తూ చేసిన ప్రచురణలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలు జోగిరమేష్ ,శ్రీ కైలే అనిల్ కుమార్ లు అసెంబ్లీ కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు సమర్పించారు..
* హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 41లో విషాద సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన
ఆడుకుంటున్న చిన్నారిని అదుపుతప్పిన డీసీఎం వ్యాను ఢీకొట్టింది.
* విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న వంశీ అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అసలు దోషులను శిక్షించాలని పోలీస్ కమిషనర్ ను కోరిన వంశీ
* గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న రామిరెడ్డి పాలెం గ్రామ మాజీ సర్పంచ్ కుమ్మెత కోటిరెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
* డూరు ఎసై నాగరాజుపై అవినీతి ఆరోపణలు.మద్దిపట్ల గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ ను ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తరపున బంధువులతో ఏకమై తీవ్రంగా కొట్టినట్లు ప్రసన్న తల్లి ఆరోపణ.మనస్తాపానికి గురై ఆత్మహత్య కు పాల్పడిన యువకుడు.
తల్లికి ఆధారమైన కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్న తల్లిఎస్పీ కి సదరు ఎసై పై ఫిర్యాదు చేస్తామని మృతిని బంధువులు తెలిపారు.
* ఒడిశా జైలులో శిక్షననుభవిస్తున్న ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ హత్యకేసులో బడగడా ప్రాంతానికి దక్తర్‌ సాహూ అలియాస్‌ దకత్‌ (34)అనే వ్యక్తి గంజామ్‌ జిల్లాలోని అస్కా సబ్‌ జైలులో అక్టోబర్‌ 29 నుంచి శిక్షననుభవిస్తున్నాడు.
*బండరాళ్లతో కొట్టి ఓ మహిళను హత్య చేశారు. ఈ ఘటన గురువారం పొద్దున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ లో జరిగింది.
*ఒకే డిపోకు చెందిన ఇద్దరు ఆర్టీసీ కార్మికులు గుండెపోటుకు గురయ్యారు. మరో కార్మికురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. వారిని తోటి కార్మికులు హాస్పిటల్స్కు తరలించగా.. చికిత్సపొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల వల్లే కార్మికులు మానసికంగా కుంగిపోతున్నారని, దీంతో గుండెపోటు వస్తోందని యూనియన్ నేతలు అంటున్నారు.
*అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియా, శాంటా క్లారిటీలోని సౌగుస్ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం స్కూల్ ప్రారంభమయ్యే సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సౌగుస్ హైస్కూల్‌లో చదివే 16 ఏళ్ల విద్యార్థి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
*ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో తహశీల్దార్ పై బెదిరింపులకు దిగాడు ఓ రైతు. పెట్రోల్ బాటిల్ తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు రైతు. తన పట్టా పాస్ బుక్ ఇవ్వకపోతే పెట్రోలో పోసి తగలబెడతా అంటూ బెదిరించాడు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
*పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పొలం నుంచి గడ్డి తీసుకువస్తున్న ట్రాక్టర్ ఒడ్డు దాటుతుండగా బోల్తాపడింది. ప్రమాదంలో పైన కూర్చున్న నలుగురు గడ్డి కింద చిక్కుకుపోయారు.
*ఆస్ర్టియన్ ఆర్మీలో విషాదం నెలకొంది. రెండు ఆర్మీ కుక్కలు కలిసి ఓ సైనికుడిని చంపేశాయి. కుక్కల దాడిలో మృతి చెందిన సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్నాడు
*మ‌రాఠీ ప్లే బ్యాక్ సింగ‌ర్ గీతా మాలీ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. గురువారం రోజు తన స్వ‌స్థ‌ల‌మైన నాసిక్‌కి కారులో వెళుతుండ‌గా ముంబై-ఆగ్రా హైవేపై ప్ర‌మాదం చోటుచేసుకుంది.
*హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ప్రైవేటు స్కూలు బస్సు బోల్తాపడింది. బస్సు ముందు భాగం బ్రేకులు పట్టేయడంతో డివైడర్‌ను ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో పిల్లలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
*గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న రామిరెడ్డి పాలెం గ్రామ మాజీ సర్పంచ్ కుమ్మెత కోటిరెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
*మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీలుస్విఫ్ట్ కారులో తరలిస్తున్న 15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని,ఒక వ్యక్తి అరెస్ట్.ఎక్సైజ్ సీఐ ప్రేమిలకుమారి కుమారి ఆధ్వర్యంలో దాడులు
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం బుగ్గారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పనులు ముగించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు మహిళలను మణుగూరు నుంచి అశ్వపురం వెళ్తున్న కారు ఢీకొట్టింది.
*కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన బండ సమ్మక్క(48) దారుణ హత్యకు గురైంది.
*మోహన్నగర్, బాలాజీ కాలనీలో ఈ నెల 11న జరిగిన ప్రవీణ్రెడ్డి హత్య కేసులో నిందితుడు రవిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
*క్తిగత చిత్రాలను సేకరించి… ఇబ్బంది పెడుతున్న భర్త, అతని స్నేహితుడిపై ఓ మహిళ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
*కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అల్గునూర్ నుంచి మానకొందూర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
*పచ్చని సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చుపెట్టింది. అదే పనిగా ఓ ఆకతాయి విసిగించడం.. భర్త అనుమానించడం.. ఇదంతా అవమానంగా భావించిన వివాహిత ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన కుమురం భీం జిల్లా జైనూరు మండలం కొండిబగూడ గ్రామంలో జరిగింది
* నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న నిర్మల గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.
*జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1లోని హైదరాబాద్ టైం కేఫ్ (హెచ్టీసీ)లో హుక్కా నిర్వహిస్తున్న జీషాన్ అహ్మద్తో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.
*జైలుకు వెళ్లివచ్చినా తీరు మారకుండా వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నేరస్థుడిపై పంజాగుట్ట పోలీసులు పీడీ చట్టం నమోదు చేశారు.
*నాగాలాండ్లో ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించి రూ.76 లక్షలు కాజేసిన ఓ వ్యక్తిని నగర సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
*నిర్లక్ష్యం కారణంగా నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పట్టాలపై కూర్చొని మద్యం తాగుతుండగా రైలు ఢీకొట్టడంతో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
*తినుబండారాల ప్యాకెట్లో వచ్చే ఆట బొమ్మ ఓ బాలుడి పాలిట శాపమైంది. పొరపాటున గొంతులో ఇరుక్కుని ఆ చిన్నారి మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది
*కుటుంబంలో కలహాలు రావడంతో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని అక్క, బావకు సూచించాడు ఓ వ్యక్తి. బావమరిది తనకు నీతులు చెప్పడం ఏంటని భావించిన బావ ఏడాది క్రితం జరిగిన సంఘటనను మనసులో పెట్టుకొని అదును చూసి బావమరిది గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన అదిలాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
*బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడికి చెందిన బీఎండబ్ల్యూ కారు ఆటోను ఢీకొట్టింది. ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని రోహిన్యా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమైంది.