DailyDose

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్-తాజావార్తలు-11/15

Gram Panchayat Elections Gets Green Signal In AP-Telugu Breaking News Today-11/15

* ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నెల్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు స్టే నిరాకరించిన హై కోర్టు.
60 శాతం రిజర్వేషన్ లు ఎస్సీ, ఎస్టీ, బిసి లకు ఇవ్వాలన్న ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణహయాన్ని సవాలు చేస్తూ హై కోర్టులో పిటీషన్
విచారణ నాలుగు వారాలకు వాయిదా.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నిల్ t1
* ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ను దర్శించుకున్న నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
మేలతాళల మధ్య స్వాగతం పలికిన ఆలయం అధికారులుఅమ్మవారి చిత్రపటాన్ని,ప్రసాదాన్ని అందించిన ఈ.ఓ సురేష్ బాబు
* పోలవరం ప్రాజెక్ట్ స్థలంలోని నవయుగ కంపెనీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న నవయుగ కార్మికులు.బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు
* అవినీతికి పాల్పడుతున్న వ్యవసాయశాఖ ఏడీ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన పెద్దపల్లిలో చోటుచేసుకుంది. పెద్దపల్లి వ్యవసాయశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేశారు.
* గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలిశారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన సీపీకి ఫిర్యాదు చేశారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో కోరారు.
*ఏపీలో ఎన్నికలు ముగిసి ఆరునెలలు గడిచినా గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలు చల్లారడంలేదు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలంకసముద్రం మండలంతిమ్మారెడ్డి పాలెంలో ఓ మహిళా ఇంటికి అడ్డంగా అధికార పార్టీ కార్యకర్తలు గోడ నిర్మించారు. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళా కుటుంబం రెండు తరాలుగా అక్కడే నివాసం ఉంటోంది. 10 నెలల క్రితం ఇప్పుడున్న స్థలంలోనే నూతనంగా ఇళ్లు కట్టుకున్నారు. వైసీపీ నేత వెన్నపూస నరసింహంఆదిలక్ష్మి కుటుంబసభ్యులు ఇంటిలోపలకు వెళ్లకుండా గోడ కట్టారు.
*భారత-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కచ్‌లో  నాటి ఎదురు కాల్పుల్లో భారత జవాన్లు చూపించిన వీరత్వాన్ని చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు.
*మహారాష్ట్ర అజకీయ అనిశ్చితి నెలకొన్న నేపద్యంలో పలువురు కాంట్రాక్టర్ల పై ఐటీ దాడులు జరగడం ప్రాదాన్యత సంతరించుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ లోని సివిల్ కాంట్రాక్టు చేస్తున్న వ్యక్తులపైనే ఈ దాడులు జరగడం విశేషం.
*టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాజీ ఏపీ సురేష్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకూ రూ.  కోట్లు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.! కాగా.. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సురేష్ పనిచేస్తున్నాడు. చాలా కాలంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏగా ఆయన పనిచేశాడు. జేసీ పదవిలో ఉన్నా.. లేకపోయినా సురేష్ సేవలు అందించారు.
*మేడిపల్లి పీఎస్ పరిధిలోని యాభై ఆరు ఎకరాల్లో నిర్మించనున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి నేడు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ భూమి పూజ నిర్వహించారు.
*పోలవరం ప్రాజెక్ట్ స్థలంలోని నవయుగ కంపెనీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న నవయుగ కార్మికులు.బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు.నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వాహనాలను అడ్డుకుంటున్న కార్మికులు.ధర్నాలో పాల్గొన్న 70 మంది ఇంజనీర్లు ఏడునెలల బకాయి జీతాలు ఇవ్వాలని డిమాండ్
*3 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తింపు..పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి
చాలాకాలంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పనిచేసిన ఏఈఈ సురేష్ రెడ్డిజేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా, లేకపోయినా సేవలు అందిస్తున్న సురేష్ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏఈఈ సురేష్ రెడ్డి పై ఆరోపణలు
*సుప్రీం తీర్పు తరువాత అయోధ్యను దర్శించుకునే రామభక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. రామమందిర నిర్మాణం కోసం కరసేవకపురంలో నిర్వహిస్తున్న కార్యశాల ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది.
*బ్రెజిల్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అనంతరం భారత్కు బయల్దేరారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
పర్యటన చాలా ఫలవంతంగా సాగిందని అభిప్రాయపడ్డారు.
*వచ్చే ఏడాది నవంబరులో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది.
*ఇండోనేసియాలో గురువారం భారీ భూకంపం సంభవించింది! టెర్నేట్ నగరానికి 134 కిలోమీటర్ల దూరాన ఉన్న సముద్రతీరం వద్ద… 45 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు అధికారులు ప్రకటించారు. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.4గా నమోదైంది. ఆ వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు.
*తెలంగాణ నుంచి ఔషధ ఉత్పత్తులు సరఫరా చేయాలని దక్షిణ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ శాఖ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న వినోద్తో నీల్ గోనుగుంట్ల నేతృత్వంలోని పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధుల బృందం గురువారం డల్లాస్లో సమావేశమైంది.
*బాలబాలికలే భవిష్యత్తు తారలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు.
*విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అధికార బృందం సహకారంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
*కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వచ్చేనెల మొదటివారంలో శిక్షణ మొదలుకానుంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి 16వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
*ఐఐటీ, హైదరాబాద్లో సెంటర్ ఫర్ హెల్త్కేర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఎఫ్హెచ్ఈ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బయోమెడికల్ విభాగ అధిపతి ప్రొఫెసర్ రెనూజాన్ తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును http://bit.do/ cfhe-application2019-II వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
*కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల్లోని గాయత్రి పంప్హౌస్లో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం రాత్రి నుంచి ఆరు పంపులతో ఎత్తిపోతలు చేపట్టారు.
*కొల్లాపూర్ కోట ముందున్న స్థలం రూ.2 కోట్లకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అడిగారు. మేము ఇవ్వనందుకు మాపై కక్షగట్టి ఇబ్బందులు పెడుతున్నారు’ అని సురభి సంస్థానాధీశుడు రాజా ఎస్వీకేకేబీ ఆదిత్య లక్ష్మారావు ఆరోపణలు చేశారు. ప్రజల కోసం తాము ఎంతో చేశామని, తాను రాజకీయాలు చేయడం లేదని పేర్కొన్నారు.
*పల్ల్లెల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గత మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గురువారం 13 డిగ్రీలు నమోదైంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఉండి, చల్లని గాలులు వీస్తున్నాయి.
*తెలుగులో ప్రావీణ్యం రావాలంటే మాధ్యమం కన్నా కూడా భాషా సాహిత్యం ముఖ్యమని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. డిగ్రీ స్థాయి వరకూ ఇంజినీరింగ్, మెడిసన్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లోనూ తెలుగు నిర్బంధ బోధన చేపట్టాలని ట్విటర్లో డిమాండు చేశారు.
*రాష్ట్ర వ్యాప్తంగా నాన్-జ్యుడిషియల్ స్టాంపుల నిల్వలు తగ్గిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో ఈ స్టాంపుల కొరత తీవ్రంగా ఉండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
*ఏపీ దళిత మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు ఆత్మకథ ‘ఒక అస్పృశ్యుని యుద్ధగాధ’ పుస్తకావిష్కరణ సభ ఈనెల 24న విజయవాడలో జరగనుంది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో అంబేడ్కర్ వారసుడు ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు ఏపీ దళిత మహాసభ ప్రకటనలో తెలిపింది.
*సౌర, పవన ప్రాజెక్టులు ఉత్పత్తిచేసే విద్యుత్తును రాష్ట్రాల మధ్య వినియోగించడానికి వసూలుచేసే సరఫరా ఛార్జీలు, సాంకేతిక నష్టాలకు మినహాయింపు ఇస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ మరోసారి పొడిగించింది. దీని ప్రకారం 2022 డిసెంబరు 31 వరకు ఏర్పాటు చేసే సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులకు మినహాయింపులు వర్తించనున్నాయి.
*అత్యధిక గుండె శస్త్రచికిత్సలతో విజయవాడ రమేష్ ఆసుపత్రుల వైద్యబృందం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. 1996లో ఆసుపత్రిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ 20వేల గుండె శస్త్రచికిత్సలను పూర్తిచేసి ప్రపంచంలోనే అరుదైన ఘనతను సాధించింది.