ScienceAndTech

బాలల లైంగిక అశ్లీలతపై ఉక్కుపాదం మోపనున్న భారత ప్రభుత్వం

India to crush child porn related content on the Internet

అంతర్జాలంలో చైల్డ్​ పోర్న్​ను అరికట్టే దిశగా చర్యలు ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

బాలలపై లైంగిక దాడుల నివారణ/దర్యాప్తు విభాగం-ఓసీఎస్​ఏఈ పేరిట దిల్లీలోని ప్రధాన కార్యాలయలంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది.

సీబీఐ ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగంలో పరిధిలో ఓసీఎస్​ఏఈ ఉండనుంది.

చైల్డ్​పోర్న్​ను సృష్టించి, అంతర్జాలంలో వ్యాప్తి చేస్తున్న వారితో పాటు ఆ దృశ్యాల కోసం వెతుకుతున్న, డౌన్​లోడ్​ చేస్తున్న వారి వివరాలను సేకరించనుంది.

చైల్డ్​పోర్న్​ సృష్టికర్తలు, వీక్షకులపై ఐపీసీ, పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనుంది సీబీఐ.