WorldWonders

లండన్‌లో చౌక గృహాల కోసం భారతీయుల బారులు

Indians In Queue For Cheap Homes In London-Telugu Business News

భారత సంపన్నులు లండన్ బాట పడుతున్నారు. అక్కడ ఇళ్లను కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపుతున్నారు. 2019 జూన్తో ముగిసిన పన్నెండు నెలల కాలంలో లండన్లో స్థిరాస్తులు కొనుగోలు చేసిన భారతీయుల సంఖ్య అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 11 శాతం పెరిగిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. తక్కువ ధరలకు ఇళ్లు లభిస్తుండటంతో కొనుగోళ్లకు భారత సంపన్నులు ఆసక్తి చూపుతున్నారని ‘లండన్ సూపర్-ప్రైమ్ సేల్స్ మార్కెట్ ఇన్సైట్-వింటర్ 2019’ నివేదికలో పేర్కొంది. మేఫెయిర్, బెల్ గ్రావియా, హైడ్పార్క్, మేరీలెబోన్, సెయింట్ జాన్స్వుడ్ వంటి ప్రాంతాల్లో భారతీయులు ఎక్కువగా ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈయూ ప్రజాభిప్రాయం, 2019 అక్టోబరు మధ్యకాలంలో కరెన్సీ, ఽప్రైమ్ సెంట్రల్ లండన్లో ధరల్లో కదలికలు వంటి వాటిని పరిశీలిస్తే 20 శాతం వరకు డిస్కౌంట్కు అవకాశం ఏర్పడిందని, ఇలాంటి పరిణామాలు భారతీయ కొనుగోలుదారులకు ప్రయోజనం కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.ఇంతకు ముందు ఎక్కువ వయసున్న వారు లండన్లో స్థిరాస్తుల కొనుగోళ్లకు ఆసక్తి చూపే వారు. కానీ ఇప్పుడు ఇళ్లను కొనుగోలు చేస్తున్న వారి వయసు తక్కువగా ఉంటోంది. లండన్లో ఇళ్లను కొనుగోలు చేస్తున్న వారి సగటు వయసు 50 ఏళ్లకన్నా తక్కువగా ఉంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన నైట్ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2019 ప్రకారం.. 21 శాతం మంది భారత సంపన్నులు ఇతర దేశాల్లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్టు వెల్లడైంది. వీరిలో 79 శాతం మంది యూకేకు ప్రాధాన్యం ఇచ్చారు.‘‘ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యం నేపథ్యంలో భారత ఇన్వెస్టర్లకు లండన్ హాట్స్పాట్గా మారుతోంది. ఇటీవలి రాజకీయ, ఆర్థిక పరిణామాలు పక్కనబెడితే ఈ మార్కెట్కు సంబంధించిన దీర్ఘకాలిక ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే భారతీయులు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు.భారత మార్కెట్లలో పెట్టే పెట్టుబడులతో పోల్చితే మూలధనం, అద్దెలపై మంచి రిటర్నులు వస్తున్నాయని చెప్పారు. బ్రిటన్ చరిత్ర, సంస్కృతి, జీవన శైలిని ఇష్టపడే భారతీయులు లండన్తో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇక భారతీయుల్లో చాలా మంది తమ పిల్లలను ఉన్నత విద్య కోసం, ప్రాపర్టీలో పెట్టుబడుల కోసం పంపుతున్నారు.