Devotional

రాజాధిరాజులేలిన నగరం అయోధ్య

The Kings Who Ruled Ayodhya-Telugu Devotional News

1. రాజాధిరాజులేలిన నగరం ‘అయోధ్య’. – ఆద్యాత్మిక వార్తలు – 11/15
మాంధాత నుంచి రఘువంశోత్తముడైన రాముడి వరకు అందరూ అతిరథమహారథులే…
* మాంధాత
రాజు అంటే ఇలా ఉండాలి అన్నంత గొప్పగా పరిపాలించాడు. షట్చక్రవర్తుల్లో ఒకడిగా పేరు పొందాడు.
* త్రిశంకు మహారాజు
ఇతడి పేరు మీదుగానే త్రిశంకు స్వర్గం ఏర్పడింది.
* హరిశ్చంద్ర మహారాజు
సత్యానికి ప్రతిరూపం. విశ్వామిత్రుడికిచ్చిన మాట కోసం కుటుంబాన్ని త్యాగం చేశాడు.
* సగర చక్రవర్తి
లోకంలో ధర్మాన్ని నెలకొల్పాడు. సగరుడు చేసిన అశ్వమేథ యాగంలో భాగంగా అశ్వాన్ని వెతుకుతూ అతని కుమారులు భూమినంతా తవ్వేశారు. అలా ఏర్పడినవే సముద్రాలు. అందుకే వాటికి సాగరాలని పేరు.
* దిలీపుడు :*
ప్రజలను తన కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకున్నాడు. కామధేనువు కుమార్తె నందినీ ధేనువు అనుగ్రహం పొందాడు. గోసేవ అంటే దిలీపుడులా చేయాలనేంతగా ప్రసిద్ధి పొందాడు.
* భగీరథుడు
స్వర్గం నుంచి గంగను తీసుకువచ్చిన ఘనత పొందాడు.
* అంబరీషుడు
పరమ భాగవతోత్తముడు. విష్ణుభక్తితో జీవిత పర్యంతం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
* రఘు మహారాజు :అత్యంత తేజోవంతుడైన రాజు. ఇతని పేరు మీదే రాముడి వంశానికి రఘువంశమనే పేరు వచ్చింది.
* దశరథుడు
పది దిక్కుల్లో రథాన్ని నడిపే శక్తి ఉన్నవాడు. దేవదానవ యుద్ధంలో దేవతలకు సాయంగా నిలబడ్డాడు. శ్రీరామచంద్రుడి తండ్రి.
* శ్రీరాముడురఘుకులోత్తముడిగా పేరొందాడు. రాజ్యపాలన అంటే రాముడిదే అన్నంత కీర్తి గడించాడు. నరుడిగా అవతరించిన నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు
2. కడలిపై కదం తొక్కండి..
ఒడిశాలోని కోణార్క్ తీరం భారీ పండగకు ముస్తాబవుతోంది. ఈ ఆధ్యాత్మిక నగరి ఆటపాటలకు వేదికవుతోంది. ‘మరైన్ డ్రైవ్ ఎకో రీట్రీట్’ పేరుతో ఒడిశా ప్రభుత్వం కోణార్క్ తీరంలో నెల రోజుల వేడుకకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. పర్యాటకులకు ఆసక్తి కలిగించేలా సాహస క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. కడలిపై విన్యాసాలకు జలక్రీడలు అందుబాటులోకి తెస్తున్నారు. అతిథుల కోసం కోణార్క్ తీరంలో ప్రత్యేక బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు?:డిసెంబరు 14 – జనవరి 14ఎక్కడ?: కోణార్క్చేరుకునేదిలా: విజయవాడ, విశాఖపట్టణం నుంచి పూరీకి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కోణార్క్ (35 కి.మీ.)కు చేరుకోవచ్ఛు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి కోణార్క్కు (72 కి.మీ.) బస్సులో, ట్యాక్సీల్లో వెళ్లొచ్ఛు.
3. సొరంగంలో శివయ్య
చెంతనే కృష్ణానది పరవళ్లు..ఆ పక్కనే ఓ సొరంగం..గుండెల నిండా భక్తి.. బండల మధ్య ప్రయాణం..లోనికి వెళ్లే కొద్ధీ. ఏదో అనిర్వచనీయమైన అనుభూతి..ఎవరో పిలుస్తున్న భావన..300 మీటర్లు అలా లోపలికి వెళ్తే.. అపురూప శివలింగం దర్శనమిస్తుంది.అదే గుంటూరు జిల్లా గురజాల మండలం దైదలోని అమరలింగేశ్వర గుహాలయం.పల్నాడు సీమలో శివకేశవ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది దైద గుహాలయం. ఈ బిళంలో పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని కథనం. యుగాల చరిత్ర ఉందని విశ్వసించే గుహాలయాన్ని కనుగొన్నది మాత్రం అరవై ఏళ్ల కిందటే. ఒకసారి సమీప గ్రామం పులిపాడుకు చెందిన గొర్రెల కాపరులు ఓసారి ఈ గుహ ప్రాంతానికి వచ్చారట. బిళం నుంచి ఓంకార నాదాన్ని విన్నారట. గ్రామ పెద్దలను తీసుకువచ్చారట. అందరూ కలిసి దీపాలు చేతబూని గుహలోకి వెళ్లారట. ఓ చోట వంగుతూ, ఇంకోచోట పాకుతూ కొంత దూరం వెళ్లాక.. దేదీప్యమానంగా వెలుగొందుతూ మహాలింగం సాక్షాత్కారమైందట. ఆనాటి నుంచి దైద ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతోంది. చాలాకాలం పాటు భక్తులు వ్యయప్రయాసలకోర్చి స్వామిని దర్శించుకునేవారు. ఇటీవల సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేశారు. విద్యుద్దీపాలతో పాటు ఏసీ ఏర్పాటు చేశారు. కృష్ణాతీరంలో పుష్కరఘాట్లు నిర్మించారు.దైద వచ్చిన యాత్రికులు కృష్ణానదిలో స్నానమాచరించి.. తడి దుస్తులతోనే గుహలోకి వెళ్లి స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. భక్తి భావంతో స్వామిని కొలిస్తే.. కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సోమవారాలు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఆలయ పరిసరాల్లో సత్రాలు ఉన్నాయి. కృష్ణానది సోయగాలు, తీరంలోని ప్రశాంత వాతావరణం దైద సందర్శనకు వచ్చిన యాత్రికులకు మరచిపోలేని అనుభూతినిస్తాయి.
**చేరుకునేదిలా: దైద క్షేత్రం.. గురజాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు నుంచి మాచర్ల వెళ్లే బస్సులో గురజాలకు చేరుకోవచ్ఛు అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో దైద ఆలయానికి వెళ్లొచ్ఛు హైదరాబాద్ నుంచి దాచేపల్లి గానీ, మాచర్ల గానీ చేరుకుంటే.. అక్కడి నుంచి గురజాల మీదుగా దైద వెళ్లొచ్ఛు.
4. శ్రీవారి లడ్డూలో దారం.. వెంట్రుక
భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో సుతిలిదారం, వెంట్రుక వచ్చాయి. హైదరాబాద్ మల్కాజిగిరి విష్ణుపురి కాలనీకి చెందిన ఐ.వెంకట సత్యనారాయణమూర్తి కుటుంబ సభ్యులతో ఈనెల 6, 7 తేదీల్లో తిరుమల వెళ్లారు. స్వామి దర్శనానంతరం లడ్డూ ప్రసాదం తీసుకున్నారు. ఇంటికి వచ్చాక ఇరుగుపొరుగుకు పంచేందుకు ప్రసాదాన్ని తెరిచి చూడగా.. దారం, వెంట్రుక కనిపించాయని, అంతేకాక లడ్డూ వాసన వచ్చిందని వాపోయారు.
5. వేయిస్తంభాల ఆలయంలో అతిరుద్ర యాగం
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో డిసెంబర్ 15 నుంచి 21 వరకు శృంగేరీపీఠం ఆధ్వర్యంలో అతిరుద్ర యాగం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. హన్మకొండ వేయిస్తంభాల దేవాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. లోకకల్యాణార్థం సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ యాగం నిర్వహిస్తుండటం సంతోషకరమన్నారు. భవితశ్రీ చిట్ఫండ్స్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, తాటిపెల్లి శ్రీనివాస్, ధర్మప్రచార పరిషత్ ప్రధాన కార్యదర్శి టీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. యాగంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరంగల్ అర్బన్ నగర మేయర్ గుండా ప్రకాశ్రావు మాట్లాడుతూ.. మానవాళి సుఖసంతోషాలతో ఉండేందుకు అతిరుద్ర యాగం.. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం వరంగల్ ప్రజల అదృష్టమన్నారు.
6. భద్రాచలం రామయ్య హుండీ ఆదాయం రూ.75.89 లక్షలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఆలయ సిబ్బంది రామాలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. చిత్రకూట మండపంలో జరిగిన ఈ లెక్కింపులో 57 రోజులకు గాను రూ.75.89 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో తాళ్లూరి రమేశ్బాబు తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 1.8 కిలోల వెండి ఆభరణాలు లభించాయన్నారు. ఇవేకాక యూఎస్, సౌదీ, శ్రీలంక, ఒమన్, కువైట్, యూఏఈ కరెన్సీ కొంత లభించిందన్నారు.
7. శుభమస్తు
తేది : 15, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : తదియ
(నిన్న రాత్రి 7 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 43 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న రాత్రి 10 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 10 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 4 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 50 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 20 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 7 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 0 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 15 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 20 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : వృషభము
విశేషం
15. సంకష్టహరచతుర్థి 8. చరిత్రలో ఈ రోజు/నవంబర్ 15
1630 : జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ మరణం (జ.1571).
1738 : యురేనస్‌ గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ జననం (మ.1822).
1898 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరి చంద్రమౌళి జననం (మ.1992).
1902 : భారతీయ నాస్తికవాద నేత గోరా జననం (మ.1975).
1935 : తెలుగు నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం (మ.1997).
1949 : గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు నాథూరామ్ గాడ్సే మరణం (జ.1910).
1982 : భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే మరణం (జ.1895).
1986 : భారతదేశ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం.
2000 : బీహారు రాష్ట్రం నుండి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా యేర్పడింది.
9. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు శుక్రవారం,
15.11.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-24℃°
• నిన్న 60,618 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 10
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
10 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 18,115 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.42 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
#ఈనెల 26న వృద్ధులు /
దివ్యాంగులకు ప్రత్యేక
ఉచిత దర్శనం,
(భక్తులు రద్దీ సమయాల్లో
ఇబ్బంది పడకుండా ఈ
అవకాశం సద్వినియోగం
చేసుకోగలరు)
#ఈనెల 27 న చంటిపిల్లల
తల్లిదండ్రులకు శ్రీవారి
ప్రత్యేక ప్రవేశ దర్శనం
(ఉ: 9 నుండి మ:1.30
వ‌ర‌కు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి
అనుమతిస్తారు,
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు
మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
10. మందిర నిర్మాణానికి షియా బోర్డు భారీ విరాళం
అయోధ్య వివాదం ముగిసి పోయిన నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి సర్వం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి తామూ చేయూతనిస్తామని ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ముందుకొచ్చింది. మందిర నిర్మాణం కొరకు రూ.51000 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియా సెంట్రల్‌ బోర్డు చీఫ్‌ వసీం రిజ్వీ శుక్రవారం తెలిపారు. రామ మందిర నిర్మాణానికి తాము అనుకూలమని అన్నారు.కాగా వివాదాస్పద రామ మందిర- బాబ్రీ మసీదు భూమిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమిని మందిర నిర్మాణానికి కేటాయించి, మసీదుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దశాబ్దాలుగా హిందూ సంఘాలు చేస్తున్న మందిర నిర్మాణ ప్రయత్నానికి ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. దీంతో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. త్వరలోకే కేంద్ర ప్రభుత్వ అయోధ్య ట్రస్ట్‌నూ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే చర్యలు, సంప్రదింపులను ప్రారంభించింది.