DailyDose

₹10లకు మర్డర్లు చేస్తున్న సున్నిపెంట తాగుబోతులు-నేరవార్తలు-11/16

Srisailam Sunnipenta Youth Committing Murders For 10Rupees-Telugu Crime News-11/16

* కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట వద్ద కేవలం పది రూపాయల కోసం హత్య చేయడానికి కూడా వెనకాడని తాగుబోతులు. తాగిన మైకంలో ఏమి చేస్తున్నారో అర్థం కాక ప్రాణాలను సైతం తీసుకునే స్థాయికి దిగజారిన సంఘటన సున్నిపెంట లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే సున్నిపెంట గ్రామానికి చెందిన షేక్ మౌలాలి శ్రీశైలం కి చెందిన శివ ఇద్దరూ ప్రైవేటు వాహనాలకు డ్రైవర్లు గా పని చేస్తున్నారు .అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణంలో లో మద్యం సేవించారు.దుకాణం నుంచి బయటకు వచ్చి షేక్ మౌలాలి ని పది రూపాయలు ఇవ్వవలసిందిగా శివ కోరగా మౌలాలి నీకు ఎందుకు ఇవ్వాలి అని ఇద్దరి మధ్య వాగ్వివాదం తారస్థాయికి చేరడంతో తాగిన మైకంలో పరుషమైన అసభ్యకరమైన మాటలతో దూషించడం తో రెచ్చిపోయిన శివ అక్కడే ఉన్న మద్యం బాటిల్ ను పగులగొట్టి షేక్ మౌలాలి పై దాడి గొంతుపైతీవ్ర గాయమై రక్తస్రావం ఎక్కువ కావడంతో స్థానికులు 108 వారికి సమాచారం ఇచ్చారు. గాయపడిన షేక్ మౌలాలి ని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. సమాచారం తెలుసుకున్న శ్రీశైలం టూటౌన్ పోలీసులు శివను అదుపులోనికి తీసుకుని విచారించగా కేవలం 10 రూపాయల కోసమే జరిగినట్లుగా షేక్ మౌలాలి వాంగ్మూలం ఇవ్వడంతో కేసు నమోదు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్ఐ పీరయ్య యాదవ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన షేక్ మౌలాలి ని మెరుగైన వైద్యం కోసం శ్రీశైలం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు కర్నూలుకు తరలిస్తున్నట్లు తెలిపారు.
* కర్నూలు జిల్లా పత్తికొండలో ఎక్సైజ్ సిబ్బంది కొన్ని గ్రామాల్లో తాండాల్లో నాటుసారా , బెల్లము నాటుసారా కొన్ని లీటర్లు పట్టుకున్నామని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. అలాగే పత్తికొండ శివారులో బిల్లే కల్ .కైరుప్పల .గ్రామంలోబెల్ట్ షాప్ మద్యం సీసాలను పట్టుకున్నామని ఎక్సైజ్ ఆఫీసర్ జానకిరామ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మరిన్ని వివరాలు వెల్లడించారు.
* విజయనగరం జిల్లా శృంగవరపుకోట దేవిగుడి సింహద్వారం నుండి పుణ్యగిరి కొండ పైకీ వెల్లే రహదారికి ఇరువైపులా ఆక్రమణలకు గురయ్యయి . ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలకు గాని కొండ పైకి వెళ్లే భక్తులకు గాని అలాగే ఇదే మార్గం లొనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి కావటంతో ఎన్నో ఇబ్బందులకు గురవ్వుతున్నారు. ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా చిరువ్యాపారులు బడ్డీలు ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ వచ్చే పోయే వాహనాలకు అడ్డుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్నో ఇబ్బందులు గురవ్వుతున్నారు. దీని పై ఎంత మంది అధికారులు సమీక్షలు నిర్వహించి వీటి తొలగింపుపై చర్చలు జరిపిన ఫలితం లేఖ పోవటం తో గత పదిహేను రోజుల క్రితం శృంగవరపుకోట రెవిన్యూ కార్యాలయానికి ట్రైనీ జాయింట్ కలెక్టర్ గా వచ్చిన కేతన్ గార్గ్ ఇక్కడి పరిస్థితిని గమనించి తక్షణమే ఈ ఆక్రమణలు తొలగించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దృస్థి కు తీసుకువెళ్లి దీనికి సంబంధించి న అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ఆక్రమణ దారులకు ముందస్తు నోటీస్ లు ఇచ్చి గత వారం రోజులుగా వారిని సమన్వయ పరిచి ఎట్టకేలకు ఈ రోజు ఉదయం 5 గంటలకు ఆక్రమణలు తొలగించారు. ఎటువంటి సంఘటనలు జరుగకుండా పోలీస్ వారి భారీ బందోబస్తు నిర్వహించి ఆక్రమణలు అన్ని తొలగించి ఎన్నో ఏళ్లుగా ఉన్న పట్టణ ప్రధాన సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ స్థానిక తాసిల్దార్ రామారావు రెవిన్యూ సిబ్బంది సిబ్బంది ,సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠం మరియు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* ఆర్టీసీ జేఏసీ నేతలను కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు!! షాద్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలింపు!! నేడు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు ఆర్టీసీ బస్సులను అడ్డుకోవాలని జేఏసీ ఇచ్చినా పిలుపులో భాగంగా ఉదయం ఆర్టీసీ బస్టాండ్ కు సుమారు 50మంది కార్మికులు వచ్చారు. 144 సెక్షన్ ఉందని పోలీసులు వారిని అరెస్టు చేశారు.
* పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని వాడపల్లి మరియు ఔరంగాబాద్ ఇసుక ర్యాంపుల్లో రెవెన్యూ మరియు పోలీస్ శాఖ సంయుక్త తనిఖీల్లో భాగంగా అయిదు లారీలను సీజ్ చేశారు.నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించడంతో పట్టుకున్నట్టు కొవ్వూరు రూరల్ సిఐ మూర్తి తెలియజేశారు.
* ఈరోజు 10 గంటలకు వి ఎస్ టి లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో తలపెట్టిన ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహార దీక్ష నేపథ్యంలో బందోబస్తును ఏర్పాటు చేసి కార్మికులు ఎవరు కూడా రాకుండా ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు. ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారులను అష్టదిగ్బంధనం చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోకన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ పాల్గొనే ఈ సామూహిక దీక్ష ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని పోలీసులు ఉదయం నుండే ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయాన్ని, పరిసర ప్రాంతాలను అష్ట దిగ్బంధనం చేశారు.
* సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణాలలో రాత్రి పూట పలు దొంగ తనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ రామకృష్ణ అలియాస్ జంపయ్యను గజ్వెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూపెద్దపల్లి జిల్లా ఓదెలా మండలం రూపునారాయనపేట గ్రామానికి చెందిన రామకృష్ణ సినీ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ చేడు అలవాట్లకు బానిస అయ్యాడు త్రాగుడు ,జూదం,దొంగతనాలకు అలవాటు పడ్డాడ ని తెలిపారుగజ్వెల్ ,సిద్దిపేట ఏరియాలలో ఎవ్వరు లేని ఇళ్లని చూసి తాళం పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు…సుమారు 21 దొంగతనాలకు పాల్పడ్డాడు,గజ్వెల్ పట్టణం లో పెట్రోలింగ్ లో చేయుచుండగా అనుమానం తో రామకృష్ణ ను పట్టుకొని విచారించగా తాను చెసిన నేరాలను ఒప్పుకున్నాడురామకృష్ణ నుండి 31తులాల బంగారం,60తులాల వెండి,1లక్షా 20వేలు నగదు స్వాదినం చేసుకొని దొంగను రిమాండు కు తరలించామని సిపి తెలిపారు.అంతర్ జిల్లా రామకృష్ణ ని పట్టుకున్న పోలీసులను పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు.