Agriculture

తెలంగాణాలో వ్యవసాయ పథకాలు

Telugu agricultural news-telangana agricultural schemes list

స్వరాష్ట్ర సాధన తరువాత తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కుతున్నది. సాగుకు స్వర్ణయుగం తీసుకొచ్చే విధంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఫలితంగా అన్నదాతలు నూతన ఉత్తేజంతో సాగు చేపడుతున్నారు. పంట చేతికి వచ్చే వరకూ ప్రభుత్వం అండదండగా ఉండటం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర విద్యుత్ సరఫరాతో ఆటంకాలు తొలిగినట్లయింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పంటల పెట్టుబడి బారం సైతం ప్రభుత్వమే బరించి, దురదృష్టవశాత్తు చనిపోయిన రైతు కుటుంబాలకు సైతం ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలబడటంతో అన్నదాతలకు మరింత భరోసా కలిగినైట్లెంది. ఎవుసం అంటే దండుగ కాదు.. పండుగ.. అని చాటి చెప్పి రైతన్నల కలలను సాకారం చేసే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తూ అన్నదాతల మన్ననలను పొందుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్. ఆరేళ్లుగా సాగు రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం కేసీఆర్ దేశంలోనే తెలంగాణ వ్యవసాయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తరువాయి రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. సాగుకు అవసరమైన అన్ని వనరులను అందుబాటులోకి తీసుకొచ్చిన టీ సర్కార్ రైతు పక్షపాతిగా ప్రత్యేక ముద్ర వేసుకుంది. రాష్టాన్ని విత్తన బాండాగారంగా తయారు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. నీరు, విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించి, మిషన్‌కాకతీయ పథకంతో చెరువుల పూడికతీత, నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. పంట చేతికి వచ్చేవరకూ అవసరమైన సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వంగా ప్రత్యేకతను చాటుకుంది. ఓవైపు కల్తీ విత్తనాలను అరికడుతూనే మరో వైపు నాణ్యమైన విత్తనాలను సకాలంలో రైతులకు అందించి విత్తన, ఎరువుల కొరతకు చెక్ పెట్టింది. పంటల కొనుగోలుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు, కూలీల కొరత తీర్చేందుకు మూడేళ్లలో దాదాపు రూ. 20కోట్ల నిధులను వెచ్చించి యాంత్రపనిముట్లను రాయితీపై రైతులకు అందించింది. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5వేలు చెల్లించింది. ఇందుకు జిల్లాకు రూ. 267 కోట్లను వెచ్చించింది. చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం ద్వారా రూ. 5లక్షలు బీమా పరిహారం అందించి అన్నదాత కుటుంబానికి ఆర్థిక భరోసా అందించింది.

*** అప్పుల బాధలు తీర్చిన రైతుబంధు
సాగు సీజన్ వచ్చిందంటే చాలు రైతులు ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం షారామాములే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాలిబొట్టు సైతం తాకట్టుపెట్టి మరీ అప్పులు తెచ్చుకున్న సందర్భాలూ అనేకం. సీఎం కేసీఆర్ రైతుల ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రైతుబంధు పథకం ప్రవేశపెట్టగా, గతేడాది వానాకాలం సీజన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే వానాకాలంలో ఎకరానికి రూ.5వేల చొప్పున అందజేసింది. దీంతో పంట రుణాలు బ్యాంకులు ఇవ్వక పోయినా, ప్రభుత్వం అందిస్తున్న సహాయంతోనే అన్నదాతలు సాగు చేబడుతున్నారు. రైతుబంధు ద్వారా ఏటా జిల్లాలో దాదాపు 2.80 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

*** బాధిత కుటుంబాలకు బీమా భరోసా
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామూహిక రైతుబీమా బాధిత కుటుంబాలకు భరోసగా నిలిచింది. ఇంటకి పెద్ద దిక్కు అకాల మరణం తరువాత ఆ కుటంబం వీధిన పదొద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం నేడు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా నిపుతున్నది. ప్రతి ఏటా ఒక్కో రైతుకు బీమా ప్రీమియం రూ. 2వేల 771లను ప్రభుత్వమే చెల్లించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.67 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్లయింది. నేటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 450 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరిలో నేటి వరకు దాదాపు 400 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం ఒక్కో రైతు కుటుంబానికి రూ.5లక్షల చొప్పున నామినీ ఖాతాల్లో జమచేశారు.

*** సస్యశ్యామలమైన ఊర్లు..
ఒకప్పుడు తెలంగాణ అంటే బోర్లు, ఎడారి అంటూ ముద్రపడింది. తలాపునే జీవ నదులు ప్రవహించినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి ప్రతిఏట సాగు నీటి కష్టాలే ఉండేవి. అప్పటి పాలకుల నిర్లక్ష్య దోరణితో బీడు భూములుగా మారిపోయాయి. వర్షాధారం పైనే సాగు చేస్తూ ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు.. అనే రీతిలో సాగు చేశారు. ఈ ప్రాంతం నేడు పచ్చ మారడానికి తెలంగాణ సర్కార్ చేసిన కృషి అని చెప్పవచ్చు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గంలో భూగర్భజలాలు పెరిగాయి. మిషన్‌కాకతీయ ద్వారా నేడు వేలాది చెరువులకు కొత్తరూపం సంతరించుకుంది. చెరువుల పూడికతీతతో జలకళతో పాటు సమీప బోరు, ఓపెన్ బావుల్లో సైతం భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. నేడు రైతున్నలకు జీవనధారలుగా నీటిని అందిస్తున్నాయి.

*** అడుగడుగున అండగా..
అన్నదాత అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ గడిచిన ఆరేళ్లుగా జిల్లాలో ఏఒక్క రైతుకు విత్తన, ఎరువుల కొరత రాకుండా చూసింది. వానాకాలం, రబీ సీజన్‌కు ముందుగానే ఆరు నెలలకు సరిపడా ఎరువులను మార్క్‌ఫెడ్ అధికారులు గోడౌన్‌లో నిల్వచేయడంతో చిక్కులు తొలగాపోయాయి. చీడపీడల బెడదను శాస్త్రవేత్తలు ముందుగానే గమనించి, అందుకు అనుగుణంగా రైతులకు ఆత్మా ప్రాజెక్టు అధికారులు నిరంతరం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తరకం వంగడాలు అందుబాటులోకి రావడం, సాగులో సైతం నూతన పద్ధతులు తీసుకరావడంతో ఆధిక దిగుబడులు పొందేందుకు మార్గం సుగమమైంది.

*** రంది తీర్చిన నిరంతర విద్యుత్
తెలంగాణ జిల్లాల్లో ఎక్కువశాతం రైతులు విద్యుత్ మోటార్ల సాయంతోనే సాగు చేస్తారు. ఉమ్మడి పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురైన అన్నదాతలు ఎంతోమంది సాగుకు స్వస్తి పలికి పట్టణాలు, నగరాలకు వలసబాట పట్టిన సందర్భాలు కోకొల్లలు. ఎవుసానికి మూలాధారమైన విద్యుత్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకవచ్చేందకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారు. అవసరమైన విద్యుత్, అది 24గంటలు అందుబాటులో ఉండటంతో ఆ ప్రభావం పంటల దిగుబడులపై చూపింది.

*** మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలు
పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీజన్‌కు అనుగూణంగా కేంద్రాలను ప్రారంభం చేయడంతో ప్రైవేట్ వ్యాపారులు, మధ్య దళారుల బారినుంచి అన్నదాతలను కాపాడినైట్లెంది. పంటల కొనుగోళ్ల కోసం ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాలు, మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో పంటల కొనుగోళ్లు జరుగతున్నాయి. అసలు సిసలైన రైతులకు మాత్రమే మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి కొనుగోలు కోసం ఇప్పటికే జిల్లాలో భారత పత్తిసంస్థ కొనుగోళ్లు ప్రారంభించింది. వానాకాలం వరి పంటకు సంబంధించి సైతం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ప్రతి ఏటా మొక్కజొన్న, పెసర, కంది కొనుగోళ్లు సైతం జరుగుతున్నాయి.

*** ఊరూరా విస్తరణాధికారుల సేవలు
రైతులకు నిరంతరం అవసరమైన సలహాలు, సూచనలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏఈవోల నియామకం చేపట్టింది. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక విస్తరణ అధికారిని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం ప్రతీ రెవెన్యూ గ్రామ పంచాయతీకి ఒక విస్తరణ అధికారి అందుబాటులోకి వచ్చారు. రెండు విడతలుగా జిల్లాకు ఏఈవోలను కేటాయించింది. దీంతో మారుమూల ప్రాంతాల రైతులకు సైతం వ్యవసాయశాఖ అధికారుల సేవలు నిరంతరం అందుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా సాగులో నూతన పద్ధతలను అవలంభించేందుకు విస్తరణ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

*** ట్రాక్టర్లతో కూలీల కొరతకు చెక్
ఆధునిక పద్ధతిలో రైతులు సాగు చేపట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకానికి రూపకల్పన చేసింది. ప్రతీ 500 ఎకరాలకు ఒక ట్రాక్టర్‌ను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో నాలుగేళ్లుగా అన్నదాతలకు అవసరమైన మేర ట్రాక్టర్లు, రోటే వేటర్లు, కలుపుతీత మిషన్లు, వరికోత యంత్రాలను అందజేసింది. 2014 నుంచి 2016 వరకు ఆర్‌కేవీవై పథకం ద్వారా ట్రాక్టర్లు, రోటేవేటర్లు, టార్పాలిన్లు, వరికోత యంత్రాలను 50 నుంచి 90 శాతం రాయితీపై రైతులకు అందజేసింది. కోట్ల విలువైన యంత్రపనిముట్లను అన్నదాతలకు అందించిందది. చరిత్రలోఎన్నడూ లేని విధంగా ఒకేరోజు రాయితీపై రైతులకు అందజేసింది. దీంతో రైతులకు కూలీల కొరత తీరినట్లయింది. సకాలంలో వరి, ఇతర పంటలను సాగు చేసుకునేందకు మార్గం సుగమమైంది.