DailyDose

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం-రాజకీయ-11/18

2019 Nov Parliament Sessions Begin-Telugu Political News-11/18-పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం-రాజకీయ-11/18

*పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కశ్మీర్‌లో పరిస్థితులపై లోక్‌సభలో కాంగ్రెస్‌, మహారాష్ట్రలో వర్షాలకు నష్టపోయిన పంటపై శివసేన, కశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా నిర్బంధంపై టీఎంసీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. దివంగత నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు పార్లమెంట్ ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి.
*తెలంగాణ తెదేపా కమిటీలు ఇవే (కింద పీడీఎఫ్ )
*అంబాపురం రైతులకు అండగా ఉంటా : వల్లభనేని వంశీ
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాపురం గ్రామంలో యస్సి ,ఎస్టీ,బిసి చిన్న సన్నకారు రైతుల భూముల్లో రెవిన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టి , స్వాధీనం చేసుకోవడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. .విజయవాడ ప్రెస్ క్లబ్ లో అంబాపురం రైతులు మీడియాతో మాట్లాదిన విషయాన్ని తెలుసుకుని, రైతులను ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు రావాలని పిలిపించారు. వారి నుండి వివరాలు సేకరించి, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తో మాట్లాడారు. వెంటనే రైతుల భూములను వెనక్కి ఇవ్వాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మీ భూములకు తాము భరోసా అని, దిగులు పడవద్దని హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని తెలిపారు.
*పార్లమెంటులో ప్రతిపక్షంల ఒకూర్చున్న శివసేన
పార్లమెంటు ఉభయ సభల్లోనూ శివసేన పార్టీకి ప్రతిపక్ష పార్టీల వైపు సీట్లను కేటాయించారు. గత ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేసి ఎన్డీఏ కూటమిలో కొనసాగిన శివసేన మహారాష్ట్ర ఎన్నికల అనంతరం పర్నిమాల్లో భాజపాకి మద్దతు ఉపసంహరించుకుంది. ఎన్డీఏ నుంచి వైదొలిగింది శివసేన నుంచి మంత్రిగా పదవిచేపట్టిన అరవింద్ సావంత్ గత సోమవరం నాడు తన పదవికి రాజీనామా చేసారు.
*అయోధ్య తీర్పు పై యశ్వంత్ సంచలన వ్యాఖ్యలు
అయోధ్య ర్తమభూమి బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తప్పుపట్టారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై లిటరేచర్ పేస్ట్ లో ఆయన మాట్లాడుతూ ఇది కచ్చితంగా తప్పుడు తీర్పే. ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. అయితే ముస్లీం వర్గ ఈ తీర్పును ఆమోదించ్నాలని కోరుతున్నా జరిగిందేదో జరిగిపోయింది ముందుకు సాగాల్సిందే తప్పదు.
*జగన్ తప్పు తెలుసుకున్నారు: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై విరుచుకుపడుతున్నారు. డిల్లి పర్యటనకు వెళ్ళిన రోజు నుంచి ఏపీ ముఖ్యమత్రిపై ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు. ఇసుక కొరత జగన్ పాలనతో పాటూ మరికొన్ని అంశాలపై వరుసగా మూడు రోజుల నుంచి వరుస ట్విత్తర్తో జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాఘా ఇసుక కొరత పై మళ్ళీ స్పందించిన ప[అవన్ మీడియాతో పాటూ అన్ని విపక్ష పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ముఖ్యమత్రి ఇసుక పాలసీ విషయంలో జరిగిన తప్పుల్ని గుర్తించారని చెప్పుకొచ్చారు. జనసేనాని తన త్విట్ లో యాభై మంది భావన నిర్మాణ కార్మికుల చావుకు కారణమైంది.
* శివసేనకు ఎన్సీపీ షాక్‌..!
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన వీడినట్లు కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. ఉత్కఠ పరిణామాలకు దారి తీస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించినా.. మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకటన మాత్రం చేయలేదు. ఇదిలావుండగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా గాంధీతో చర్చించేందుకు పవార్‌ సోమవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి భేటీకి ముందు జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి పవార్‌ సమాధానం చెబుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేశాయి. వాళ్ల రాజకీయాలు వాళ్లు చూసుకుంటారు. శివసేన దారి ఎటు వైపో వారే తేల్చుకోవాలి’ అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని
*ఏపీలో యథేచ్చగా మత మార్పిడులు: కన్నా
ఏపీలో యథేచ్చగా మత మార్పిడులు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. దేవాలయాలను కూలగొట్టి.. విగ్రహాలు తొలగిస్తున్నారన్నారు. ‘గత ప్రభుత్వం ఇదే విధంగా చేసి అడ్రస్ లేకుండా పోయింది. క్షుద్ర పూజలు‌ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంగ్లీషు మీడియానికి మేము వ్యతిరేకం కాదు. తెలుగు మీడియాన్ని కూడా కొనసాగించాలి. ప్రత్యేకంగా ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు పెట్టండి. ఇసుక కొరతపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం తీరు దున్నపోతుపై వాన పడినట్టుగానే ఉంది’ అని కన్నా వ్యాఖ్యానించారు.
*డిసెంబర్-20న ఎమ్మెల్యే గంటా ఆస్తుల వేలం!
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన ఆస్తులను విశాఖలోని ఇండియన్ బ్యాంకు అప్పట్లో స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. గంటా శ్రీనివాసరావు హామీగా ఉన్న కంపెనీ కోట్లల్లో రుణం తీసుకుని చెల్లించకపోవడంతో ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ఆస్తుల వేలానికి బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. డిసెంబర్‌ 20న వేలం వేస్తామని ఇండియన్‌ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా.. భారీగా రుణం తీసుకుని ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా తిరిగి చెల్లించలేదని గంటా మంత్రి పదవి హోదాలో ఉన్నప్పట్నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. రుణగ్రహితల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ ఉన్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం రుణం బకాయిలు రూ. 209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 35.35 కోట్లు అని బ్యాంక్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈ నోటీసులకు గంటా ఇంతవరకూ రియాక్ట్ కాలేదు.
*వారికి సెక్షన్ 30 వర్తించదా?: చినరాజప్ప
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్‌గా పెట్టుకున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి చినరాజప్ప విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వారిపై సెక్షన్ 30 ప్రకారం కేసులు పెడతారని, వైసీపీ నేతలు మాత్రం ర్యాలీలు, ప్రారంభోత్సవాలు, సభలు పెట్టుకోవచ్చునని, వారికి సెక్షన్ 30 వర్తించదా? అని ప్రశ్నించారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు, రాజధాని రాకూడదని జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. జగన్‌కు అంతర్జాతీయంగా పేరు వచ్చిందని ఆ పార్టీ నేతలుచెబుతున్నారని, అంతపేరు వస్తే, జనం ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
*ప్రాంతీయ భాషలను రక్షించాలి : కేశినేని నాని
ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని లోక్‌సభలో కేంద్రాన్ని తెదేపా ప్రశ్నించింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని.. అలాంటి రాష్ట్రంలో మాట్లాడే తెలుగు భాషా పరిరక్షణ కోసం కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉందని.. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసిందని వివరించారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేశినేని కోరారు.
*ఎన్డీఏలో సమన్వయకమిటీ అవసరం
ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మధ్య ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు భాజపా చొరవ చూపాలని దిల్లీలో ఆదివారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో జనతాదళ్(యు), లోక్జనశక్తిపార్టీ(ఎల్జేపీ)లు కోరాయి. ఎన్డీఏ నుంచి శివసేన వైదొలగడంతో ప్రభుత్వంపై దాడి చేయడానికి ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లైందని ఆ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు సమన్వయ కమిటీ అవసరమని స్పష్టం చేశాయి. సమన్వయానికి ఒక కన్వీనర్ ఉంటే బాగుంటుందని ఎల్జేపీ సారథి చిరాగ్పాస్వాన్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే నుంచి శివసేన వైదొలగిన నేపథ్యంలో ఈ సూచన రావడం గమనార్హం. జాతీయ పౌర పట్టిక అమలుపై ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏడు పార్టీలు ఈ సమావేశంలో తమ సందేహాలను వ్యక్తం చేశాయి.
*బిల్డ్ ఏపీ పేరిట స్థలాల అమ్మకం దారుణం
ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల విమర్శలు, అభ్యంతరాల్ని పెడచెవిన పెట్టి.. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ స్థలాల విక్రయానికి పూనుకోవడం వైకాపా దుర్బుద్ధికి నిదర్శనమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, నవరత్నాల అమలుకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వ స్థలాలు తెగనమ్మాలని సర్కారు నిర్ణయించడం దారుణమన్నారు.
*ప్రతిపక్ష ‘స్థానాల్లో’ శివసేన సభ్యులు
పార్లమెంటు ఉభయసభల్లోనూ శివసేన సభ్యులకు ప్రతిపక్షాలు కూర్చొనే వైపు సీట్లు కేటాయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆదివారం తెలిపారు. శివసేన నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ రాజీనామా చేయడం, మహారాష్ట్రలో ఆ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టేందుకు సిద్ధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
*యానాం అభివృద్ధిని అడ్డుకుంటున్న కిరణ్బేడీ
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ యానాం అభివృద్ధిని అన్నివిధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి వి.నారాయణసామి ఆరోపించారు. యానాం పర్యటనకు వచ్చిన సీఎం ఆదివారం స్థానిక పరిపాలనాధికారి కార్యాలయంలో అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏ గవర్నరైనా ఆ రాష్ట్రహక్కులు, ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తారని, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ మాత్రం యానాంకు చెందిన పర్యాటక దీవిని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆస్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
*ఐదు నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిన సర్కారు
అయిదేళ్ల తెదేపా పాలనలో విసిగి పోయిన ప్రజలు వైకాపాకు పట్టం కడితే.. అయిదు నెలల్లోనే ఆ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అనంతపురం జిల్లా గోరంట్లలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం చేసిన తప్పులను చూపుతూ అధికారంలోకి వచ్చిన వైకాపా అంతకంటే ఎక్కువగా తప్పులు చేస్తోందని దుయ్యబట్టారు.
*ఏపీలో పరిస్థితులపై చర్చ లేవనెత్తుతాం:గల్లా
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైనా చర్చ జరపాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చెందిన చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. దేశ ఆర్థికపరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని.. కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించామని గల్లా జయదేవ్ చెప్పారు.
* ఎవరి ప్రోద్బలంతో అఫిడవిట్ వేశారు?:ఉత్తమ్
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఎలాంటి ఆలోచనా చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్శర్మ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. గాంధీభవన్లో సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాలతో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సునీల్ శర్మ సమర్పించిన తప్పుడు అఫిడవిట్ను సుమోటాగా స్వీకరించి న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
*కొడాలి నానిని ఎందుకు మందలించలేదు?:కళా
తిరుమల శ్రీవారి ఆలయంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. సీఎం జగన్ మెప్పు కోసం తిరుమల సంప్రదాయాలను ఉల్లంఘించేలా నాని వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వడం తితిదేలో అమలులో ఉన్న నిబంధన అని కళా గుర్తు చేశారు. అన్య మతస్తులు ఏ ప్రాంతం వారైనా అక్కడ సంతకం చేయడం తప్పనిసరి అని చెప్పారు.తితిదే సంప్రదాయాలపై మంత్రి చులకనగా మాట్లాడితే సీఎం జగన్ ఎందుకు ఆయన్ను మందలించలేదని కళా ప్రశ్నించారు. జరిగిన అన్యాయంపై పోరాడలేక చేతులెత్తేయడం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేతకానితనానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వంశీ.. ఇతరులను దుర్భాషలాడారని ఆక్షేపించారు. తన స్వార్థం, ఆర్థిక ప్రయోజనాల కోసం పార్టీ మారి గన్నవరం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై చేసిన అనుచిత విమర్శలకు మంత్రి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
*శివసేన ఎంపీలు ఇక ప్రతిపక్షం వైపు
పార్లమెంట్ ఉభయ సభల్లో శివసేన ఎంపీల సీట్లను ప్రతిపక్షం వైపు మారుస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడంతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
*కేసీఆర్ విజ్ఞప్తులపైనా స్పందనలేదు: నామా
పార్లమెంట్ సమావేశాల్లో విభజన సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరినట్లు తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సమావేశాల్లో 27 బిల్లులు ప్రవేశపెడతామని ప్రభుత్వం తరఫున జాబితా ఇచ్చారని నామా తెలిపారు. బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా దేశంలోని ప్రజాసమస్యలపైనా చర్చ జరగాలని కోరామన్నారు. వారానికి ఒక్కరోజైనా 193వ నిబంధన కింద ప్రజా సమస్యలపై చర్చించాలని కోరినట్లు నామా తెలిపారు. కాలుష్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై చర్చ జరగాలన్నారు.
*ఆ హామీ నిలుపుకోవాలని కోరాం:విజయసాయి
పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో విపక్షాల వైఖరిని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను సైతం భేటీలో లేవనెత్తినట్లు చెప్పారు.
*సీబీఐ చిటికేస్తే వైకాపా గతేంటి?: దేవినేని
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చిటికేస్తే.. తెదేపాను స్టోర్రూంలో పెడతారని మంత్రులు అంటున్నారని, సీబీఐ చిటికేస్తే వైకాపా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ‘ఇసుక దీక్ష’పై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై దేవినేని ఘాటుగా స్పందించారు. సన్నబియ్యంపై జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ గురించి ప్రజల పక్షాన అడుగుతుంటే.. మంత్రులు అసభ్యకర పదజాలంతో తెదేపా నాయకులను దూషిస్తున్నారని ఆక్షేపించారు.
*కేసీఆరే అఫిడవిట్ వేయించారు: పొన్నాల
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దని, కృష్ణా మీద తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే సీఎంకేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, జాతీయ హోదాకు ఉండాల్సిన ఒక్క నిబంధన కూడా పాటించలేదని కేసీఆర్కు తెలుసని.. అందుకే ఏపీ సర్కారు చేత ‘సుప్రీం’లో అఫిడవిట్ దాఖలు చేయించారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో పొన్నాల మాట్లాడారు. ప్రజల కోసం కాకుండా కేసీఆర్ తన కోసమే ప్రాజెక్టుల పునరాకృతులు చేశారని విమర్శించారు.