DailyDose

జగన్‌కు కాంట్రాక్టర్ల అల్టీమేటం-తాజావార్తలు-11/18

Jagan Gets Heat From Contractors-Telugu Breaking News-11/18

* హోటల్ ఇంద్ర ప్రస్త హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశం.ప్రభుత్వ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు ప్రభుత్వం తక్షనమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని సమావేశంలో తీర్మానం.
* మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా నేషనలిస్ట్‌ పార్టీ అధినేత శరద్ పవార్‌ చేసిన వ్యాఖ్య పలు సందేహాలకు తావిస్తోంది. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌-ఎన్సీపీలతో శివసేన పొత్తు కోరుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పవార్‌ని అడగ్గా ఆయన చెప్పిన సమాధానం అక్కడున్న వారిని ఆశ్యర్యానికి గురి చేసింది.
*ఇసుక అక్రమ రవాణా నిల్వ అధిక ధరల విక్రయ నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంన్ పటిస్త చర్యలు చేపటినది. ఇందులో భాగంగా ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500ట్రోల్ ఫ్రీ నంబర్ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.
*భారత్ లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో భారత్ నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్ లో కిలో ఉల్లిపాయల ధర రూ220 కు చేరింది.
* ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధికధరల విక్రయం నిరోధానికి ప్రభుత్వం చర్యలు 14500 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌
* తాడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూల రగడ…!ఉదయం నుంచి వచ్చిన అభ్యర్థులను పక్కనబెట్టి తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి సంబంధించిన వారిని మాత్రం ముందుగానే ఇంటర్వ్యూ కు అనుమతిస్తున్న వైనం.ఇంటర్వ్యూ జరిగే తీరుపై పలువురు వాలంటీర్ అభ్యర్థుల ఆగ్రహం.ముందుగా వచ్చిన అభ్యర్థులను ముందుగానే ఇంటర్వ్యూ కు అనుమతించాలని వేడుకోలు.
* ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతూ.. కోల్‌కతాలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నుస్రత్‌ అస్తమాతో బాధ పడుతోందని.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైన కారణంగా.. ఆమెను ఆదివారం ఉదయం ఆస్పత్రితో చేరారని ఈ మేరకు నుస్రత్‌ జహాన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.
*యువతీయువకులు ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం సహజం. అయితే కొన్ని ప్రేమలు పెద్దల అంగీకారంతో సంతోషాన్ని నింపితే..మరికొందరి ప్రేమలు విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ప్రేమతో ఒక్కటి కాలేని ఓ యువతీ యువకులు మరణంతో ఒక్కటయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ లో జరిగింది.
*ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(ఝ్ణూ) దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు. హాస్టల్‌ ఫీజులు పెంచుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకోవడంతో ఝ్ణూ స్టూడెంట్స్ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ(సోమవారం) పార్లమెంట్‌ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు.
*నిబంధనలను ఉల్లంఘించిపోలీసు విధులకు ఆటంకం కల్పించారనే అభియోగాలతో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌మరికొందరిపై ఏలూరుత్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ 18 కేసుల్లో బెయిల్‌ పొంది ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం విడుదలయ్యారు. అనంతరం జిల్లా జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. జిల్లాలో పోలీసు యాక్ట్‌ 30 అమల్లో ఉండడంతో త్రీ టౌన్‌ సీఐ ఎంఆర్‌ఎల్‌ ఎస్‌ఎస్‌ మూర్తి తన సిబ్బందితో శనివారపు పేటలో గస్తీ నిర్వహిస్తున్నారు.
*మాతృభాషలో విద్యాబోధన చేస్తే విద్యార్థికి పాఠ్యాంశం సమగ్రంగా అవగాహన కావడంతో పాటు.. నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్ అభిప్రాయపడ్డారు.
*ఆర్టీసీ కార్మికులకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రభుత్వ ఉపాధ్యాయులు బాసటగా నిలిచారు. ఆదివారం 83 మంది ఆర్టీసీ కార్మికులకు రూ.లక్ష విలువైన నిత్యావసర సరకులను పంపిణీ చేసి ఉదారతను చాటారు. ప్రతి కార్మిక కుటుంబానికి 25 కిలోల బియ్యం, పప్పు, నూనె, వంటి నిత్యావసర సరకులను అందజేశామని ఉపాధ్యాయ ఐకాస నాయకులు శామ్యూల్, ఆడె ప్రకాశ్లు చెప్పారు.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సికింద్రాబాద్లోని ఆయుష్ భవనాన్ని తెలంగాణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అబిడ్స్లో అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని ఇందులోకి మార్చేందుకు ఆదివారం పూజలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పని చేసిన వారంతా రెండు రాష్ట్రాల శాఖలుగా విడిపోయారు.
*జనాభా లెక్కల ప్రకారం దేశంలో రెండో స్థానంలో ఉన్న పద్మశాలీలకు అదే నిష్పత్తిలో రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పద్మశాలి సంఘం అధ్యక్షులు బూర మల్లేశం, కె.ఏ.ఎన్.మూర్తి డిమాండ్ చేశారు.
*పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి పూర్తిగా నిలిపివేస్తామని రాష్ట్ర పత్తి మిల్లులు, వ్యాపారుల సంక్షేమ సంఘం తెలిపింది. జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం రాయితీలు చెల్లించకపోవడంతో పాటు తమ ఇతర డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు బి.రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
*అందాల కశ్మీరంగా పిలిచే ఆదిలాబాద్ జిల్లాలో అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చలికాలం ప్రారంభం కావడంతో అప్పుడే పొగమంచు గిరిపల్లెలను ముంచెత్తుతోంది. ఉదయం నుంచి మంచు కమ్మేస్తోంది. ఈ పొగమంచుతో జనం గజగజ వణుకుతున్నారు. పొలం పనులకు, తాగునీటి బావుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
*మనం ఇప్పటి వరకు ప్లాస్టిక్, పలు రకాల వ్యాధులపై అవగాహన కల్పించేందుకు పరుగు(రన్) చేపట్టడం చూశాం. అయితే వినూత్నంగా తాగు నీటి కోసం జనం రోడ్డెక్కారు.
*విదేశాల నుంచి వచ్చిన నిధులకు వార్షిక రిటర్నులు దాఖలుచేయని పలు స్వచ్ఛందసంస్థల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రద్దుచేసింది.
*గుంటూరులో తొలిసారిగా బహుభాషా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అభినయ థియేటర్ ట్రస్టు అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్ చెప్పారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఉత్సవాల వివరాలను ప్రకటించారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
*ఆర్టీసీ కో ఆపరేటివ్ సొసైటీ నిధుల నుంచి సంస్థ వాడుకున్న రూ.350 కోట్ల డబ్బును వెంటనే వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీరావు, పలిశెట్టి దామోదరరావు సంస్థ యాజమాన్యాన్ని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు నెలలుగా కార్మికులు విద్యారుణాలు, వివాహరుణాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
*స్విస్టెక్ కంపెనీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో నిర్మించిన ఆర్వో ప్లాంట్లకు సంబంధించిన వివరాల సేకరణలో సీబీఐ నిమగ్నమైంది. ఈ కంపెనీ 2013-14లో జిల్లావ్యాప్తంగా నీటిశుద్ధి జలయంత్రాలను నిర్మించింది. రుణాలకు సంబంధించి కంపెనీపై 2018 మే 31న సీబీఐ హైదరాబాద్లో కేసు నమోదు చేసింది. ఇదే క్రమంలో విశాఖ నుంచి వచ్చిన సీబీఐ బృందం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆర్వోప్లాంట్ల వద్దకు వెళ్లి పరిశీలిస్తోంది.
*ప్రభుత్వ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న రూ.500 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే డిసెంబరు 1 నుంచి 6 నెలలపాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏ టెండర్లోనూ పాల్గొనబోమని స్టేట్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఏబీసీఏ) అధ్యక్షుడు పి.పి.రాజు ప్రకటించారు.
* భారతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి పోఖ్రియాల్‌ అన్నారు. ప్రాంతీయ భాషల పరిరక్షణపై కేంద్రం చేపడుతున్న చర్యలను వివరించాలని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని… అలాంటి ప్రజలు మాట్లాడే తెలుగు రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారని కేశినేని నాని ప్రశ్నించారు.
* ఎన్నికలలో ప్రజాభిప్రాయం మేరకు గెలిచి పదవులు అనుభవిస్తున్న మంత్రులు.. సంస్కృతి సంప్రదాయాలను సమంగా గౌరవించాలనే ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి గురించి ఆది నుంచి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.