Health

అరగడానికే కాదు అందానికి ఆరోగ్యానికి కూడా కిళ్లీ మంచిది

The power and health benefits of eating pan-telugu health news

తమలపాకు పేరు వినగానే కిళ్ళీ తినేవారి నోట్లో నీళ్లూరుతాయి. కిళ్ళీలు తినడం కూడా వ్యసనమేనని కొందరు అంటుంటారు. కిళ్ళీలు తినేవారు మాత్రం దానిని పొగడకుండా ఉండలేరు. హిందువులు శుభాకర్యలన్నింటిలో తమలపాకు వక్క, సున్నం తప్పనిసరిగా ఉండాల్సిసిందే. ఇది వైద్యానికి పనికొచ్చే ఓ వంట దినుసు కూడా ఈ తమలపాకుల మధ్య కొత్తిమీర పుదీనా నిల్వ ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
*తాంబూలం కిళ్ళీ ఒకటి కాదు తమలపాకులు, వక్క హిందువులు అన్ని శుభకార్యాలలోనూ తప్పనిసరిగా ఉపయోగించిబడతాయి. వాటిలో తోదిమతో కలిపే వాడతారు. అయితే తినేటప్పుడు తొడిమను ఈనెను తీసీ తింటారు.
*దక్షిణ భారత దేశంలో స్త్రీలు వరలక్ష్మి పూజరోజు దసరా నవరాత్రులలోను పసుపు, కుముమతో కలిపి ఆకు వక్కలను సౌభాగ్యానికి ప్రతిరూపంగా భావించి ముత్తయిదువులకు అందజేస్తారు. పెళ్ళిళ్ళలో పండగలలో ఇంకా అన్ని రకాల శుభకార్యాలలో తాంబూలాన్ని ఇతరులకు అందివ్వటమనేది వారిపట్ల మనకున్నటువంటి గౌరవానికి ఆత్మీయతకు చిహ్నంగా భావిస్తారు. రాజస్థాని వివాహాలలో పెళ్లి కొడుకు తరపువారు డబ్బులిస్తేనే కిళ్ళీ తింటారు. పెళ్లి కూతురు తరపు పెద్దవారు పెళ్ళికొడుకు తరపు వచ్చిన అతిరదులందరి నోటికి కిళ్ళీని అందిస్తారు.
*మొగల్ రాణి సూర్జహాన్ తాంబూలం సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసింది. ఆకాలంలో స్త్రీలు అందంగా కనిపించడానికి ప్రకృతి సిద్దంగా లభించే రకరకాల్ లేపనాలు మూలికలు వాడేవారు. నూర్జహాన్ తమలపాకులలో కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను కలపటం వల్ల దాన్ని తింటే పెదవులు ఎర్రగా ఉంది సహజ సిద్దంగా అందంగా కనిపిస్తాయని గ్రహించింది. అప్పట్నుంచి స్త్రీలు తాంబూలాన్ని రుచి కోసం ఉంచుకునేందుకు తినటం మొదలు పెట్టారు.
*హృదయాకారంలో ఉండే తమలపాకుల తీగె వాటిన మూడు నెలలకు పది నుంచి పదిహేను అడుగుల వరకు పెరుగుతుంది. ఒక మీటరు ఎత్తు పెరిగినప్పతి నుంచి పంట రావటం మొదలవుతుంది. తమలపాకులను తోడిమతో కలిపి తీగను తెంపి కట్టలు కడతారు. ఒకసారి పంట రావడం మొదలైతే ప్రతిరోజూ లేదా వారానికి ఒకసారి పంట కోసుకోవచ్చు. తీగ మరీ ఎక్కువగా పెరగటం వలన ఆకుల పరిమాణం చిన్నదైపోతుంది. దానివల్ల ఎప్పటికప్పుడు తీగ పొడవును మరీ ఎక్కువ రాకుండా కత్తిరించాలి.
*తమలపాకుల పంట దక్షిణాసియా, అగ్నేసియా ప్రాంతాలలో బాగా పండుతుంది. మన భారతదేశంలో శ్రీలంకా, వియత్నాం, మలేసియాలలో చాలా బాగా పండుతుంది. మంచి కిళ్ళీలు బీహారులో పాట్నా దగ్గర ఉన్న మగధ ప్రాంతంలో లభిస్తాయి. వాటిని మగై అని పిలుస్తారు.
*కిళ్ళీలో సున్నం, వక్క, లవంగాలు, ఎలాక్కాయలు, కదిరం ఉంటాయి. దీనిలో వాడె సున్నం మన నోటిలోని లాలాజలం ద్వారా నాలుక కింది నుంచి శోషణం చేయబడి రక్తప్రమనంలో కలుస్తుంది. వాక్క నోటిలో ఉండే లాలాజలాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. దాని ద్వారా మనల్ని ఉత్తేజపరుస్తుంది.
** కిళ్ళీ ద్వారా ఉపయోగమేమిటంటే …
ఇది మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. అరుగుదలకు సహాయం చేస్తుంది. శ్వాసకు తాజాగా ఉంచుతుంది. ఆయుర్వేదం కామోద్ది పన కోసం తాంబూలాన్ని వేసుకుంటుంది. సాధారణంగా వగరుగా చురుక్కు మనిపించేట్టుగా ఉండే తమలపాకుకి ఇతర సుగంధ ద్రవ్యలన్ని కలపటం వల్ల అద్భుతమైన రుచి ఏర్పడుతుంది. తాంబూల సేవనం మంచి అనుభూతినిస్తుంది. కిళ్ళీ ప్రియులకు ఇది ఎంతో ఆనందాన్నిస్తుంది.
*మనదేశంలో కొన్ని లక్షల మంది కిళ్ళీల తయారీలో జీవనం సాగిస్తున్నారు. ప్రతి వీధి మలుపులోనూ ఓ కిళ్ళీ షాపు కనిపిస్తూ ఉంటుంది. షాపువాడు మీకు సాదా పాన్ ఇస్తాడు. మిటాయి కిళ్లీలో కొబ్బరి తురుము, చక్కర, ఖర్జూరం ముక్కలు చెర్రీ ముక్కలు సొంప సొంపు ఉంటాయి. మనం చల్లని కిళ్ళీని కూడా తినచ్చు తాయారు చేసిన కిళ్ళీని మనం కోరుకున్నంత సేపు ఫ్రీజ్ లో పెట్టి ఇస్తారు. దానిని తినటం మాత్రం ఒక అందమైన అనుభూతి .
*కిళ్ళీ కట్టడానికి కలకత్తా అకులకుగాని, బెనారస్ ఆకులను గాని వాడుతుంటారు. కలకత్తా ఆకులు ముదురు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. బెనారస్ ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని రెండు రంగులలో ఉండి, వాటికంటే చిన్నవిగా ఉంటాయి. ఈ మూడింటిలో కలకత్తా ఆకులతో చేసిన కిళ్ళీలు ఎక్కువగా అమ్ముడుపోతాయి.