Movies

అక్కినేని ఆర్కియాలజీ

Akkineni Nagarjuna As Archaelogist In Brahmastra

భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. బాలీవుడ్‌ జంట ఆలియా భట్‌, రణబీర్‌ కపూర్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ నటుడు నాగార్జున కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతకొంతకాలం క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున పురాతత్వ శాస్ర్తవేత్తగా కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ చిత్రంలో ఆయన తన విద్యార్థులతో కలిసి గంగానది ఒడ్డున ఓ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంటారని తెలుస్తోంది. ఆయన ఎంట్రీ తర్వాత సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.