NRI-NRT

కెనడా క్యాబినెట్‌లో భారత సంతతి మహిళ

Indian Origin Lady Indira Anand Gets Into Justin Trudeau's Cabinet

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో బుధవారం తన కొత్త మంత్రి వర్గాన్ని వెల్లడించారు. ఈ మంత్రి వర్గంలో తొలిసారి అనితా ఇందిరా ఆనంద్‌ అనే హిందూ మహిళకు స్థానం దక్కింది. ఈ మంత్రి వర్గంలో మరో ముగ్గురు భారత్‌-కెనడా సంతతికి చెందిన మంత్రులు ఉన్నారు. వారంతా సిక్కులు. వీరు గత క్యాబినెట్‌లో కూడా సభ్యులుగా ఉన్నారు. అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో అంటారియోలోని ఓక్విల్లే స్వరీ నుంచి తొలిసారిగా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు అనితా ఎన్నికయ్యారు. మంత్రివర్గంలో ఆమెకు ప్రజా సేవల శాఖను కేటాయించారు. పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె టొరంటో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. ఆమె తల్లిది పంజాబ్‌ కాగా, తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి. అనిత కెనడియన్‌ మ్యూజియం ఆఫ్‌ హిందూ సివిలైజేషన్‌ మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఎయిర్‌ ఇండియా విమానం 182 మీద ఉగ్రవాద దాడిపై పరిశోధన చేశారు.