WorldWonders

ఆన్‌లైన్ గేమ్ ద్వారా కలిసి…విమానంలో పెళ్లి

Couple mets via online game.Gets married in Plane.

ఓ ఆన్‌లైన్‌ గేమ్‌ ద్వారా కలిసిన ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమకు కారణమైన విమానంలోనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. దానికి విమానయాన సంస్థ నుంచి అనుమతులు కూడా పొందారు. సముద్ర మట్టానికి దాదాపు 34 వేల అడుగుల ఎత్తులో పెళ్లి చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ వాలియంట్‌, న్యూజిలాండ్‌కు చెందిన క్యాతీలు ‘ఎయిర్‌పోర్ట్‌ సిటీ’అనే ఆన్‌లైన్‌ గేమ్‌ ద్వారా 2011లో కలుసుకున్నారు. 2013లో ఒకరినొకరు చూసుకున్నారు. ప్రేమ విషయాన్ని వ్యక్తం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. తమ ఇద్దరినీ కలిపింది విమానానికి సంబంధించి గేమ్‌ కావడంతో విమానంలోనే వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇందుకు అనుమతులు కోరగా.. జెట్‌స్టార్‌ అనే విమానయాన సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. క్యాతీ, డేవిడ్‌లు తమ ఇరు దేశాలకు మధ్యలో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు ముందుగానే తెలపడంతో ఆ విమానయాన సంస్థ అందుకు ఏర్పాట్లు చేసింది. విమానం సముద్ర మట్టానికి సరిగ్గా 34 వేల అడుగుల ఎత్తులో, ఇరు దేశాలకు మధ్యకు రాగానే వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియోను విమానయాన సంస్థ అధికారులు సోషల్‌ మీడియోలో పెట్టడంతో కొద్ది గంటల్లోనే 67 వేల మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు సూపర్‌, ఇది చాలా అద్భుతమైన ఘట్టమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.