Health

గుండెపోటు వారాంతం రాకుండా చూసుకోండి

If Heart Attack Is On Weekend-Your Chances Of Dying Are More

ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. చాలా మంది మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు నిలుపుకోగలిగినా.. జీవితాంతం మళ్లీ ఆ సమస్య రాకుండా చూసుకోవడం అనివార్యమైంది. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజులోనైనా సరే.. గుండెపోటు వచ్చిన వారితో పోలిస్తే శని, ఆది వారాల్లో గుండె పోటు వచ్చిన వారు బతికే అవకాశాలు చాలా తక్కువని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఫిలడెల్ఫియాలో ఇటీవల జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ సైన్స్ సింపోజియం 2019 సదస్సులో యూకేకు చెందిన పలువురు పరిశోధకులు సర్వైవల్-టు-హాస్పిటల్ అడ్మిషన్ అనే అంశంపై చేపట్టిన పరిశోధనకు చెందిన వివరాలను వెల్లడించారు. అందుకుగాను వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3వేల మందికి చెందిన డేటాను సేకరించి విశ్లేషించారు. ఈ క్రమంలో వచ్చిన ఫలితాలను బట్టి సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. ఇతర రోజుల్లో కన్నా శనివారం రాత్రి 12 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల మధ్య గుండె పోటు వచ్చిన వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే బతికారని వెల్లడైంది. ఇక వయస్సు పెరిగే కొద్దీ ఈ శాతం మరింత తగ్గుతుందని వారు తెలిపారు.