DailyDose

కొత్తగూడెం జిల్లాలో తాబేళ్ల అక్రమ రవాణా-నేరవార్తలు-11/24

Turtle Illegal Smuggling In Bhadradri Kothagudem District-Telugu Crime News-11/24

* గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డు పక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు తాబేళ్లను వదిలివెళ్లారు. ఆ ప్రాంతంలో తాబేళ్లు ఉన్నాయని గమనించిన కొంత మంది వ్యక్తులు మిగతావారికి సమాచారం అందించారు. దీంతో ఆ తాబేళ్లను చూడాడానికి జనాలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అంతే కాక కొంత కూలీ పనులకు వచ్చిన వారు అందిన కాడికి ఆ తాబేళ్లను వారి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ సంఘటనపై ములకలపల్లి సురేష్ మాట్లాడుతూ తాబేళ్లను వ్యాపార నిమిత్తం పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో వేరే లారీలో ఎక్కించే ప్రయత్నం చేసే సమయంలో కిందపడి ఉంటాయా, లేదా పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారా అని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఆ ప్రాంతం మాత్రం కోలాహలంగా మారింది.

* మండల కేంద్రమైన ఉలవపాడులో ఒక డ్వాక్రా గ్రూపుకు చెందిన లీడరు సుమారు రూ.3 లక్షలు స్వాహాచేసినట్లు ఆ గ్రూపు సభ్యులందరూ శనివారం రాత్రి ఉలవపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. స్త్రీనిధి డబ్బులకు క్రింద రూ.3 లక్షలు మరియు తాము చెల్లించే డబ్బులు కూడా బ్యాంకులో కట్టలేదని సభ్యులు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉలవపాడు ఎస్సై శ్రీకాంత్‌ ఒంగోలు మీటింగ్‌లో ఉండడంతో కేసును నమోదుచేయలేదు

* రహదారిపై వెళ్తున్న వాహనదారులను ఆపి హెల్మెట్ల క్వాలిటీ ని పరిక్షిస్తున్న పోలీసులు.

* గుణదలలో పోలీసుల కార్డాన్ సెర్చ్ డీసీపీ హర్ష వర్ధన్ ఆధ్వర్యంలో తనికీలు నిర్వహిస్తున్న 200 మంది పోలీసులు.. డీసీపీ హర్షవర్ధన్ రాజు గుణదల గంగిరేద్దుల దిబ్బలో తెల్లవారుజామున నుండి కార్డాన్ సెర్చ్ నిర్వహించాం 200 మంది పోలీసులు ఈ సెర్చ్ లో పాల్గొన్నారు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో తనికీలు చేసాం కాలానివాసులకు భద్రత కల్పించడం ముఖ్య లక్ష్యం సెర్చ్ లో సరైన పత్రాలు లేని 21 వాహనాలు స్వాధీనం చేసుకున్నాం ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం ఇక్కడ 12 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు వారిని కూడా విచారించాం ఈ కాలనీలో గంజాయి ఉందనే సమాచారం ఉంది. ఆ ఇళ్లలో తనికీ చేసాం..ప్రస్తుతానికి గంజాయి దొరకలేదు..గంజాయి సరఫరా ని అరికట్టేందుకు నిఘా పెడతాం

* జిల్లాలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసుపై ఎస్పీ ప్రత్యేక దృష్టిసారించారు. డ్రగ్స్ తయారీదారుడు షాజీ కాల్‌డేటాను పోలీసులు పరిశీలించారు. దీని ఆధారంగా మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఐటీసీ సమీపంలోని ఓ హోటల్‌ నిర్వాహకుడి కుమారుడు, ఫిరంగిపురానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా షాజీతో పరిచయం ఉన్న వ్యక్తులను పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డ్రగ్స్ విక్రయదారుడు షాజీ బైక్‌పై జగన్ ఫోటోలతో స్టిక్కర్లు ఉన్న విషయం తెలిసిందే.

* ఓ ఏడేళ్ల బాలిక సూరాడ దీప్తిశ్రీ తాను చదువుకునే స్కూల్‌ నుంచి శుక్రవారం కిడ్నాప్‌కు గురైంది. ఈ నేపథ్యంలో బాలిక తండ్రి సత్యశ్యామ్‌కుమార్‌ కాకినాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాకినాడ -యానాం రోడ్డులో పగడాల పేటకు చెందిన శ్యామ్‌కుమార్‌ భార్య, దీప్తిశ్రీ తల్లి సత్యవేణి కొంతకాలం క్రితం చనిపోయింది. అయితే దీప్తి అనంతరం కొంతకాలానికి సత్యశ్యామ్‌కుమార్‌ శాంతి కుమారిని రెండోపెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం దీప్తిశ్రీ స్థానిక నేతాజీ పార్కు వద్దఉన్న నగర పాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక శుక్రవారం స్కూల్‌కు వెళ్లింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ మహిళ వచ్చి దీప్తిశ్రీని పాఠశాల నుంచి బయటకు తీసుకువచ్చి వేరే వ్యక్తి బండి మీద ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు సత్యశ్యామ్‌కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శాంతికుమారికి తన కుమార్తె అంటే ఇష్టం లేదని ఆమె తీసుకుపోయి తన పాపను ఏమైనాచేసి ఉంటుందని సత్యశ్యామ్‌కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కిడ్నాప్‌ చేసిన వ్యక్తులు బాలికను చంపివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ వ్యవహారంలో కొనసాగుతోన్న ఉత్కంఠ. శుక్రవారం మధ్యాహ్నం జగన్నాధపురం స్కూల్ నుంచి కిడ్నాప్ కు గురైన దీప్తిశ్రీ. సవతి తల్లి కిడ్నాప్ చేసి హత్య చేసిందని ఆరోపిస్తోన్న దీప్తిశ్రీ నాయనమ్మ బేబి. సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న పోలీసులు. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్యచేసి ఉప్పుటేరు కాల్వలో పడవేసానని పోలీసుల విచారణలో శాంతికుమారి అంగీకరించినట్టు సమాచారం. పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న శాంతికుమారి.. నిన్న ఉదయం నుంచి గాలింపు కొనసాగుతున్నా లభించని దీప్తిశ్రీ జాడ. దీప్తిశ్రీ ఆచూకీ కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తోన్న నాయనమ్మ, బేబి, మేనత్త చిన్ని.

* సమయం…1:19 నిమిషాలు..రోడ్డు పై వాహనదారులు… జనం… రెప్పపాటులో బీభత్సం.. ఈ ఘటనలో ఒకరికి అదృష్టం కలిసొచ్చింది.. మరొక్కరిని దురదృష్టం వెంటాడింది. సేమ్ స్పాట్.. సేమ్ టైమింగ్ బయోడైవర్సిటీ సంఘటనలో ఫొటోలు చెప్పుతున్న నిజం… ఈ సమయానికి బయోడైవర్సిటీ ైఫ్లె ఓవర్ పైనుంచి ఓ ఎరుపు రంగు కారు అదుపు తప్పి గాల్లో ఎగిరి కింది పడింది. ఆ సమయంలో ఆటో కోసం నిలబడిన సత్యవేణి మీద పడి ప్రాణం తీసింది. అదే సమయంలో అదే ఎత్తు నుంచి ఇనుప రాడ్ సూచిక బోర్డు వేగంగా కింద పడింది. అప్పటికే కారు పడిన శబ్దంతో ఏదో జరుగుతుందని గందరగోళంలో వెనక్కిమళ్లింది యువతి. ఆ సెకన్‌లో తీసుకున్న నిర్ణయం రెప్పపాటులో తేరుకున్న యువతి ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలను నిలబెట్టుకున్నది.

* లింగాల ఘనపురం మండలం చిటూరు గ్రామం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లో బులెట్ ప్రూఫ్ కారు అధుపు తప్పి బోల్తాపడింది. బుల్లెట్ ప్రూఫ్ కార్ డ్రైవర్ పార్ధ సారధి, సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతి. మగ్గురికి తీవ్ర గాయాలు జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు.

* మంగళగిరి మండలం నవులూరు పుట్టరోడ్ లో మురుగేష్ అనే యువకుని హత్య. మృతుడు ఆటో నగర్ లో ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని విచారిస్తున్నారు.

* గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొయ్యవారిపాలెం కోల్డ్ స్టోరేజ్ వద్ద లారీ బైకు డీ ఇద్దరకు తీవ్ర గాయాలు 108 లో గుంటూరు తరలింపు. వాహన దారులు రాకూరి.నాగరాజు కిష్టయ్య (యానాదులు) పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామఒ నుండి గుంటూరు వెళుతుండగా గుంటూరు నుండి ప్రత్తిపాడు వస్తున్నా లారీ డీ.

* మాదక ద్రవ్యాలకు బానిసైన ఓ మృగాడు డబ్బు కోసం ప్రేమించిన యువతినే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న మరో ఉదంతం విశాఖ పోలీసు ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఇద్దరూ ప్రేమించుకుని కొంతకాలం బాగానే ఉన్నారు. నిందితుడైన ఆ యువకుడు మాదకద్రవ్యాలకు బానిసగా మారాడు. వాటి కోసం తన డబ్బునంతా ఖర్చుపెట్టేసేవాడు. మాదకద్రవ్యాలు కొనుగోలు చేయడానికి డబ్బు లేకపోవడంతో మృగాడిగా మారాడు. ప్రేమించిన యువతి అభ్యంతరకర చిత్రాలు తీసి డబ్బుకోసం ఆమెనే బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో కన్నీరుమున్నీరైన బాధితురాలు విశాఖ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. బ్లాక్‌మెయిల్‌ చేయడానికి కారణమేమిటన్న విషయంపై ఆరా తీయగా నిందితుడి అసలు రూపం వెలుగుచూసింది. అతడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని, వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన నగదు కోసం ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి దిగజారాడని గుర్తించారు. దీంతో అతనికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపైనా నిఘా పెట్టి మొత్తం నలుగురు యువకుల్ని గుర్తించారు. ఆ నలుగురికి మరో ఇద్దరు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. వారు ముంబయి, బెంగళూరుల నుంచి విశాఖ నగరానికి ఆయా మాదకద్రవ్యాలను తెచ్చి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వాటిల్లో ఖరీదైన ఎల్‌.ఎస్‌.డి.లు, హైబ్రిడ్‌ మాదకద్రవ్యాలు ఉన్నాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నవారు, విక్రయిస్తున్నవారు నగరంలోని వివిధ కళాశాలకు చెందిన యువకులు కావడం గమనార్హం. మొత్తం ఉదంతంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

* కొత్తగా మరో కాల్‌సెంటర్‌ రేపటి నుంచి ప్రారంభం రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు మరో కాల్‌సెంటర్‌ రాబోతుంది. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వద్ద 1064 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ ఉంది. కొన్నేళ్లు గా ఇది పనిచేస్తోంది. దీనికి అదనంగా 1100 కాల్‌సెంటర్‌కూ అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా జగన్‌ ప్రభుత్వం మరో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. సోమవారం ఉదయం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుం చి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పౌరసేవల్లో అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ విశేషంగా కృషిచేస్తోంది. 1064 అనే టోల్‌ఫ్రీ నంబరుతోపాటు 8333995858 అనే నంబరుకు వాట్సప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1100 కాల్‌సెంటర్‌కూ అవినీతిపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలావుండగా, అవినీతిపై యుద్ధం అంటున్న జగన్‌ ప్రభుత్వం కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకొస్తోంది. ఫిర్యాదులు స్వయంగా ఇంటలిజెన్స్, ఐఏస్, ఏసీబీ అధికారి పర్యవేక్షణలో కొనసాగుతోంది. అవినీతిపై ఫిర్యాదులు రుజువు ఐతే ఇంకా ఇంటికే.

* పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని చాగల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మానూరి చిరంజీవి(26) అనే భవన కార్మికుడు ఆత్మహత్య.గడిచిన 5నెలలుగా భవన నిర్మాణ పనులు లేకపోవడంతో తనకు చెందిన కాలనీ ఇల్లు, భార్య నగలను తాకట్టు పెట్టి కుటుంబపోషణ చేస్తున్నాడు.తనకు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్ దారులు తీసుకెళ్లడంతో తీవ్ర మనస్తాపం చెందిన చిరంజీవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడు.మృతునికి తల్లి, భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

* కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి హాబీబ్ నగర్ లో మాదాపూర్ డీసీపీ అద్వర్యం లో 15 మంది సీ ఐ లు,8 మంది ఎస్ ఐ లు మొత్తం156 మంది తో కార్డెన్ సెర్చ్.