Movies

జయలలితగా రమ్యకృష్ణ

Ramya Krishna As Jayalalitha In Gautam Menon Web Series

తమిళనాడు జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కతున్న ‘క్వీన్‌’ టీజర్‌ వచ్చేసింది. గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలితగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘క్వీన్‌’ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ‘క్వీన్‌’ టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘స్కూల్‌ డేస్‌లో స్టేట్‌ టాపర్‌, 18 ఏళ్ల వయసుకే స్టార్‌ హీరోయిన్‌, పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రి, మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే ‘క్వీన్‌’ మీకోసం ఎదురుచూస్తుంది. #QueenIsComing’ అని ‘క్వీన్‌’ బృందం పేర్కొంది. ఈ నెల 5వ తేదీన ట్రైలర్‌ విడుదల కానుంది.