DailyDose

తెలంగాణలో నేటి నుండి బస్సు చార్జీల బాదుడు-తాజావార్తలు-12/02

Bus Fare Hikes In Telangana-Telugu Breaking News-12/02

* ఈ ఆర్థరాత్రి నుంచి పెరిగిన బస్‌ ఛార్జీలు అమలు.పల్లె వెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.5నుంచి రూ.10కి పెంపు.సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస్‌ ఛార్జీ రూ.10గా నిర్థారణ.ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు.డీలక్స్‌ కనీస ఛార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు.సూపర్‌ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25.రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస ఛార్జీ రూ.35.గరుడ ఏసీ, గరుడ ప్లస్‌ ఏసీలో కనీస ఛార్జీ రూ.35.వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ.75.అన్ని రకాలు బస్‌పాసుల ఛార్జీలు పెంచిన ప్రభుత్వం.సిటీ ఆర్డీనరీ పాస్‌ ఛార్జీ రూ.770 నుంచి రూ.950కి పెంపు.మెట్రోపాస్‌ ఛార్జీ రూ 880 నుంచి రూ.1070కి పెంపు.మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంపు.స్టూడెంట్‌ బస్‌పాస్‌ రూ.130 నుంచి రూ.165 కి పెంపు.
* గన్నవరం గ్రామం లో గల వి.కె.ఆర్ వి.ఎన్.బి. కళాశాల నుండి కళాశాల, స్థానిక పాఠశాలల విద్యార్థులు,విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న ఆడపిల్లల మీద హత్యాచారాలు,పర్యావరణ పరిరక్షణ,ప్లాస్టిక్ నియంత్రణ గురించి స్థానిక గన్నవరం లో విద్యార్థులు నిరసన తెలుపుతూ భారీగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొన్న జరిగిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య విషయం లో నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
* దిశ హత్యాచార ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. లోక్‌సభలో దిశ ఘటనపై ఆయన మాట్లాడారు. ‘ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది. ప్రతి ఒక్కరినీ బాధించింది. దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. చట్టాల్లో మార్పులు చేసే విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో పాటు పలువురు ఎంపీలు దిశ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు.
* జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలుక ఇటిక్యాల మండలం బీచుపల్లి కృష్ణానదీ లో జస్టిస్ ఫర్ దిశ (ప్రియాంక రెడ్డి) అస్తికలను కలిపిన తండ్రి మరియు కుటుంబ సభ్యులు… ముందుగా తుంగభద్రా నది ఒడ్డుకు సాంప్రదయ పరంగా ప్రేత్యేక పూజల నిర్వహించిన అనంతరం కుమార్తె ఆస్తికలను తుంగభద్రా నదిలో కలిపారు.. ఈ కార్యక్రమంలో తండ్రి తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు.
*దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆమె భర్త మురుగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గత నెల 27న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్‌కి నళిని లేఖ రాశారు.
*ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ పోసే బంక్ ల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు శంషాబాద్ డీసీపీ.. జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులను జారీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఖాళీ బాటిళ్లతో వచ్చే వారి పేరు, ఫోన్ నంబరు, వాహనం నంబర్లు పెట్రోలు బంక్ సిబ్బంది సేకరించుకోవాలన్నారు.
*సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా అన్నవరంలో వేకువజాము నుండే భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.
*తమిళనాడు రాష్ట్రంలో సోమవారం భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
*ఇకపై భారత్‌లో మొబైల్‌ కాల్స్, డేటా ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రముఖ టెలికాం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ఈ సేవలపై 50 శాతం వరకు పెంచుతూ వొడాఫోన్‌ ఐడియా తొలుత ప్రకటించింది.
*బడుగు, బలహీనవర్గాల న్యాయమైన హక్కుల సాధనకు కోసం రాజీలేని పోరాటం చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు.
*కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాల్లో సవరణలు తీసుకొస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్)లో మార్పులు చేస్తున్నామని.. ఇందుకు ముసాయిదా సైతం సిద్ధమైందన్నారు. ఆదివారం హైదరాబాద్లోని షేక్పేటలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
*మానవ హక్కుల వేదిక మహాసభ ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నిర్వహించనున్నట్లు వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ తెలిపారు.
*ప్రముఖ విద్యావేత్త, మిసెస్ ఏవీఎన్ కళాశాల ఛైర్పర్సన్ అంకితం ఇంద్రాణి జగ్గారావు(85) విశాఖలోని ఆమె స్వగృహంలో ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విద్యార్థులను అందించిన మిసెస్ ఏవీఎన్ కళాశాలకు 25 ఏళ్లపాటు ఈమె కరస్పాండెంట్గా వ్యవహరించారు.
*రాష్ట్రవ్యాప్తంగా 10 మందికి తాత్కాలిక ఎంపీడీవోలుగా పదోన్నతి లభించింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలను అనుసరించి మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో), సూపరింటెండెంట్లకు పదోన్నతులు కల్పిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు.
*బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతం నుంచి తెలంగాణ వైపు తేమగాలులు వీస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. తుపాను వ్యతిరేక సుడిగాలులు వీస్తున్నందున మేఘాలేర్పడి వర్షాలు పడుతున్నట్లు ఆయన తెలిపారు. వర్షాల కారణంగా చలి తీవ్రత తగ్గే అవకాశముందన్నారు.
*సిద్దిపేటలో రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన వేలాడే వంతెనను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆదివారం హరీశ్రావు ప్రారంభించారు.
*ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న లబ్ధిదారులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వారు ఇంటి వద్ద ఉండి విశ్రాంతి తీసుకునే సమయంలో రోజువారీ భత్యం అందించి వారికి భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం గుంటూరులో లాంఛనంగా ప్రారంభిస్తారు.
*డ్రోన్ సంబంధిత పరిశోధనల విస్తరణకు రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్..‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది
*బెంగళూరు నుంచి విశాఖకు ఆదివారం రావాల్సిన ఇండిగో విమానం అనివార్య కారణాలతో రద్దయ్యింది. ఈ సర్వీసు మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ వచ్చి, 2.00 గంటలకు తిరిగి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరారు. బెంగళూరు నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ రావాల్సిన ఇండిగో సంస్థకు చెందిన సర్వీసు కూడా రద్దయ్యింది. శనివారం రాత్రి 9.10 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో విశాఖలో నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ఆదివారం ఉదయం 10గంటలకు విశాఖలో బయలుదేరి విజయవాడ వెళ్లింది.
*మానవ హక్కుల వేదిక మహాసభ ఈ నెల 14, 15 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నిర్వహించనున్నట్లు వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మానవ హక్కుల వేదిక 7వ మహాసభను ఆదివారం నిర్వహించారు