Fashion

పాదాల మీద మృతకణాలు పోయేదెలా?

How to cleanse my feet for smoothness and health-telugu fashion and beauty tips

ఈ కాలంలో వేడినీటిలో కాళ్లు పెట్టుకోవడం చాలామంది చేసేదే. ఆ నీటిలో ఈ పదార్థాలు వేసుకుని చూడండి. పాదాలు మృదువుగా, కోమలంగా మారతాయి.

* పాదాలు అలసిపోయాయా… టబ్బు నీటిలో ఒకటిన్నర చెంచా కొబ్బరినూనె, నాలుగు చుక్కల పిప్పర్‌మెంట్‌ నూనె, రెండు నిమ్మకాయ ముక్కలు… వేయండి. అందులో మీ పాదాల్ని కనీసం పావుగంట ఉంచితే పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* కొందరి పాదాలపై మృతకణాలు పేరుకుపోతుంటాయి. అలాంటివారు వేడినీటిలో అరకప్పు చొప్పున తేనె, ఉప్పు, రెండుకప్పుల కాఫీపొడి వేసి అందులో పాదాల్ని ఉంచాలి. ఆ తరువాత కొబ్బరినూనె రాయాలి.
* తరచూ సాక్సులు, బూట్లు వేసుకోవడం వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటప్పుడు… వేడినీటిలో అరకప్పు బియ్యం ఉడికించిన నీరు, రెండు పెద్ద చెంచాల వంటసోడా, కొద్దిగా ఆలివ్‌నూనె వేసుకుని అందులో పాదాల్ని ఉంచాలి. పావుగంటయ్యాక తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. పాదాలు మృదువుగానూ ఉంటాయి.