Business

ఉల్లిఘాటు…రెస్టారెంట్లకు పోటు

Onion Crisis In India Makes Hotels Ban Onion Dosa

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో ఉల్లిపాయలు ధర రూ.వందకు పైగా పలుకుతోంది. అనేక మెట్రో నగరాల్లో ఈ ధరలు రూ.వంద నుంచి రూ.150 వరకు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని రెస్టారెంట్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా దేశంలో ఆకాశాన్ని అంటిన ఉల్లిధరలతో బెంబేలెత్తిపోయిన హోటల్ యాజమాన్యాలు ఉల్లిదోశను నిషేధించాయి. అంతేకాదు మిగతా ఆహార పదార్థాలతో ఉల్లి వాడకాన్ని తగ్గిస్తే చిన్న మధ్య స్థాయి హోటళ్లు మాత్రం ఏకంగా ఉల్లిదోశను మెనూ నుంచి తొలగించాయి. ఉల్లిధరల ఘాటును హోటళ్లు ఎలాగోలా తట్టుకుంటున్నప్పటికీ చిన్న హోటళ్లు మాత్రం లబోదిబో అంటున్నాయి. రేటు పెంచితే కస్టమర్లు దూరమయ్యే పరిస్థితి. రేటు పెంచకపోతే నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా చిన్న మధ్యస్థాయి హోటళ్ల పరిస్థితి తయారైంది. దోశను బ్యాన్ చేయడంతో పాటు ఉల్లి వాడకాన్ని తగ్గించడమే వారికి సరైన మార్గంగా తోచింది. లాభానష్టాల విషయం అలా ఉంచితే వినియోగదారుల ఈ నిర్ణయంతో షాకైపోతున్నారు. ఉల్లి వాడకం తగ్గడంతో ఆహార పదార్ధాలలో మునుపటి రుచి కనిపించడం లేదు.