DailyDose

నైట్‌క్లబ్‌పై పోలీసుల దాడి-నేరవార్తలు-12/02

Police Arrest 67 Club Dancers In India-Telugu Crime News-12/02

*ఓ నైట్ క్లబ్ బార్ పై పోలీసులు జిల్లా అధికారులతో కలిసి దాడులు చేసి 67 మంది బార్ డాన్సర్ లకు విముక్తి కల్పించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగు చూసింది.
*దిశ హత్యకేసులో నిందితుల వీడియోను చిత్రీకరించి దాన్ని బయటకు పంపిన కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ హెసరు.
* స్వల్ప వివాదం ఓ యువకుడిని కత్తితో దాడికి దిగేలా దారి తీసింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
* అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టి(26)గా గుర్తించారు. టెనస్సీ స్టేట్ యూనివర్సిటీలో వైభవ్ ఫుడ్ సైన్సె్సలో పీహెచ్డీ చేస్తున్నారు. అక్కడే ఎమ్మెస్ చేస్తున్న జూడీ స్టాన్లీ పినీరియో(23)తో కలసి గురువారం రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడినుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీ కొట్టింది.ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ డేవిడ్ టోర్రెస్ వాహనం అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, తమ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతిచెందడం పట్ల టీఎ్సయూ తీవ్ర సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ఘటన దురదృష్టకరమని, అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేస్తోందని అధికారులు పేర్కొన్నారు.
* మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. పుర్సల్‌గొండి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నక్సల్స్‌ కాల్చిచంపారు.
* రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రేమ జంటలు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాయి. వివరాల్లోకెళ్తే.. షాబాద్ మండలం, లింగారెడ్డి గూడకు చెందిన ప్రేమికులు ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
* హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ బస్సు(ఎపీ 36 ఎక్స్ 3654)లో ఆదివారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్.. ప్రయాణీకులను అప్రమత్తం చేసి, త్వరగా బస్సు దిగమన్నాడు.
* మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడు మొహం చాటేశాడు. దీంతో మైనర్‌ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
* తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మూడు భవనాలు కూలి 15 మంది మృతి చెందారు.
*మెక్సికోలో భద్రతా బలగాలు, డ్రగ్స్ ముఠాకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మొత్తం 19 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని విల్లా యూనియన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఓ భవనంలోకి దుండగులు ప్రవేశించినట్టు తెలుసుకున్న భద్రతా దళాలు భవనాన్ని చుట్టుముట్టాయి. దీంతో డ్రగ్స్ ముఠా కాల్పులు ప్రారంభించింది.
*రంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరుచోట్ల రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి.
*మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. పుర్సల్‌గొండి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నక్సల్స్‌ కాల్చిచంపారు. వారిద్దరూ పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే కారణంతో నక్సల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పుర్సల్‌గొండికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
*బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఏఎస్‌ఐ నర్సింహ మృతి చెందారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా బదిలీ చేయడంతో నర్సింహ కుంగిపోయారు. సీఐ అక్రమంగా తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయనఆరోపించిన విషయం తెలిసిందే.
*నల్గొండ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (ఏపీ 36 ఎక్స్ 3654) మంటల్లో దగ్ధమైంది. గత రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు, నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై ప్రయాణిస్తుండగా, చర్లపల్లి వద్ద ఇంజన్ లో మంటలు చెలరేగాయి.
*వుయ్యూరు బైపాస్ లో రోడ్డు ప్రమాదం -కారు బోల్తా విజయవాడ నుండి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారు ఉయ్యూరు బైపాస్ రోడ్డులో గల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం బోల్తా కొట్టింది. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద కల ఫ్లైఓవర్ దిగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ నీ కారు బోల్తా పడిన విధానం చూస్తే భయభ్రాంతులకు గురి అవుతారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారులో వారిని బయటకు లాగి సహాయక చర్యలు అందించారు.
*గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడి గుంట సమీపంలో కాలువలోకి దూసుకుపోయిన హెరిటేజ్ పాల వ్యాన్. ఈ ప్రమాదం ఉదయం 5.45నిముషాలకు జరిగింది డ్రైవర్ (ప్రత్తిపాడు గ్రామస్తుడు) sk బాజీ కి తీవ్ర గాయాలు గుంటూరు GGH కి 108లో తరలింపు.
*విజయవాడ రూరల్ మండలం నిడమానూరు బెస్ట్ ప్రైస్ వద్ద రోడ్డు ప్రమాదం. చైన్నై కలకత్తా జాతీయ రహదారిపై లారీ , పల్సర్ బైక్ ఢీ.. సంతోష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి.
*ప్రేమించిన బావను కాదని, మరో వ్యక్తికిచ్చి తన తల్లిదండ్రులు పెండ్లి చేసేందుకు నిశ్చయించడంతో కలత చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
*కడప జిల్లా చిట్వేలి మండల పరిధిలోని దేవుడు నాగవరం గ్రామంలో వైకాపా నాయకుల దాడిలో మహిళ తీవ్ర గాయాలపాలైంది.
*భార్యపై కోపంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలోని అజిత్సింగ్నగర్ వాంబే కాలనీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*శంషాబాద్కు చెందిన యువ వైద్యురాలు హత్య ఘటనలో నిందితుల దృశ్యాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి.
*చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం కోగిలేరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
*గుంటూరులో డ్రగ్స్ తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు.
*బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వోల్వో బస్సు అనంతపురం వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15మంది గాయపడ్డారు.
*మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ట్రాఫిక్ అధికారులు ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం ఉండడంలేదు. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ ఓ మహిళను ఢీకొట్టి ఆమె ప్రాణాలు బలిగొన్నాడు.
*వరంగల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఒకరు అదృశ్యమయ్యారు. మామునూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన విద్యార్థిని(20) బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
*చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం కోగిలేరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
*భార్యపై కోపంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలోని అజిత్సింగ్నగర్ వాంబే కాలనీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*శంషాబాద్కు చెందిన యువ వైద్యురాలు హత్య ఘటనలో నిందితుల దృశ్యాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి.
*విశాఖలో నకిలీ కరెన్సీ మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను ఆదివారం నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితలను విశాఖ హెచ్బీ కాలనీకి చెందిన కేఎన్వీ సత్యనారాయణ, ఆర్.జయరాం, బి.పద్మారావుగా గుర్తించారు. వారి నుంచి రూ.2,96,000 విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*విశాఖలో నకిలీ కరెన్సీ మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను ఆదివారం నగర పోలీసులు అరెస్టు చేశారు.
*చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టులో అమ్మాయిలను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడ్ని పోలీసులు విచారిస్తున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లున్న ఓ విద్యార్థినిని వేధించాడనే కారణంగా యువకుడ్ని కొట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
*అనంతపురం జిల్లా కేంద్రంలోని జాతీయ ఉద్యానవనం సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
*ఆ పెళ్లింట ఇంకా సందడి ఆగనేలేదు. అంతలోనే అత్తారింటికి వెళ్లాల్సిన నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాదం శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని గరుడఖండిలో చోటుచేసుకుంది.
*రేపు షాక్ ఇస్తానంటూ సహచర విద్యార్థులకు చెప్పిన ఓ విద్యార్థి ఇదే క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ నగర పరిధిలోని ఓ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి (16) శనివారం కళాశాల భవనంపై నుంచి దూకి తనువు చాలించాడు.
*శంషాబాద్ శివారులో అనుమానాస్పద స్థితిలో దహనమైన మహిళ ఎవరో శంషాబాద్ పోలీసులు గుర్తించారు.
*బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఓల్వో బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మరణించారు. ఈ సంఘటన అనంతపురం తపోవనం కూడలిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
*శంషాబాద్లో యువతి అదృశ్యంపై ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.
*శనివారం కనిపించకుండా పోయిన చిన్నారి ఆదివారం విగతజీవై కనిపించింది. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి స్కూలు బెల్ట్‌తో గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణం ఆదివారం ఉదయం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. చిన్నారి మృతదేశం ఖేతడి గ్రామ సమీపంలోని పొదల్లో లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో స్నాక్స్మద్యం సీసాలు ఉన్నట్లు పేర్కొన్నారు.