Movies

ముందు మనం సౌకర్యంగా ఉంటే

Puja Hegde Speaks Of Fairness Creams And Bikinis

రంగులో, బరువులో ఏముంది? ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయడంలోనే అసలైన అందం దాగుందని పూజా హెగ్డే అంటున్నారు. కాంతివంతమైన చర్మం కోసం, వైట్ స్కిన్ టోన్ కోసం ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉపయోగించే మహిళలు, పురుషులు చాలామంది ఉన్నారు. ఫెయిర్నెస్ క్రీమ్స్ యాడ్స్లో నటించే నటీనటులను విమర్శించేవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘నేను విదేశాలు వెళ్లినప్పుడు ‘వావ్! ఆమె స్కిన్ టోన్ చాలా బావుంది’ అనేవాళ్లను చూశా. మన వయసు పెరిగే కొలదీ ఎలా ఆలోచించాలనేది ప్రజలు చెబుతారు. అదే ప్రపంచమంతా తిరిగితే… మనం ఎలా కనిపించినా యాక్సెప్ట్ చేసే ప్రజలు పెరుగుతారు.విదేశాల్లో లావుగా ఉన్నప్పటికీ బికినీలు వేసుకున్న మహిళలను నేను చూశా. చాలా క్యాజువల్గా, కంఫర్టబుల్గా తిరుగుతారు. వాళ్లు ఆత్మనూన్యతా భావంతో లేరు. లావుగా ఉన్నామని కుంగిపోవడం లేదు. కాన్ఫిడెంట్గా ఉంటారు. అటువంటప్పుడు మనకూ వాళ్లను చూస్తే ఇబ్బందిగా ఉండదు. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే… మన స్కిన్ టోన్ ఎలా ఉన్నా మనం కంఫర్టబుల్గా ఉంటే, ప్రజలు మనల్ని చూసే విధానం మారుతుంది. అంతా మనలోనే ఉంటుంది. చర్మంపై ఏదైనా రాసుకుంటే మంచిగా ఉంటామని భావిస్తే… రాసుకోండి’’ అన్నారు.