Food

తాటితేగ నిండా పుష్కలమైన పోషకాలు

Taati Tega Dietary Benefits-Telugu food and dietary news

తాటి చెట్టులో వాడని భాగం లేదు. తాటి కర్రకు చెదలు, పిప్పి పట్టే అవకాశం తక్కువు. అందుకే ఇంటి నిర్మాణంలో వాసాలకు, ఎనగర్రకు దీన్ని విరివిగా వాడుతున్నారు. మంచాలకు, బల్లలకు వివిధ పనిముట్లకు తాటి కర్రలను వాడుతున్నారు. తా ఆకు ఇంటి పైకప్పుకు, బావి నుంచి నీరు చేదుకోవడానికి ఉపయోగించే ‘చేద’ను, బుట్టలు తయారుచేయడానికి, చాపలు వేయడానికి వాడుతున్నారు. తాటికల్లు తాగేవారి సంఖ్య అపరిమితం.ముంజలు తినగా మిగిలిన తాటికాయలతో పిల్లలు బండ్లు కట్టుకుని ఆడుకుంటారు. ముంజలు ముదిరితే వాటిని ఉడకబెట్టి ‘చెక్కరగళి’ చేసుకుంటున్నారు. తాటిపండ్లు వరుసగా నలభై రోజులు తింటే వంటికి మంచి రంగు వస్తుందని, ఆయుష్షు పెరుగుతుందనే నమ్మకం వుంది. తాటిపండ్ల పీసం (గుజ్జు)తో తాటి తాండ్ర చేస్తున్నారు. తాటి కల్లుతో తాటి బెల్లం తయారుచేసి బాలింతరాలికి పెడతారు. తాటి పండ్లను తిన్న తరువాత ఆ బుర్రలను మట్టిలో పాతిపెడితే తేగలు తయారవుతాయి. ఈ తేగలను కాల్చి తింటారు. సుబ్రహ్మణ్య షష్టికి తేగలనే నైవేద్యంగా పెడుతున్నారు. తేగని రెండుగా చీలిస్తే మధ్యలో చందమామని తినొద్దని, తింటే చదువురాదనీ చెప్పేవాళ్ళు. తేగను తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేగలను బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతోపాటు కాన్సర్ను దూరం చేస్తుంది. అలాగే తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. తేగల పిండిని గోధుమ పిండిలా చేసి రొట్టెలను చేసుకుని తినొచ్చు. ఇందులో పీచు, కాల్షియం, ఫాస్పరస్, ధాతువులు పుష్కలంగా వున్నాయి.
తేగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా మేలు చేస్తాయి. బ్లడ్ కాన్సర్కు తేగలు చెక్ పెడతాయి. కాన్సర్ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలకు ఉంది. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎములకు బలాన్నిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది.తాటి తేగల ఉత్పత్తిలో అసలు పురుగుమందుల వినియోగం అసలు వుండదు. ఒకరకంగా చెప్పాలంటే కల్తీలేని ఆహారంగా తేలను చెప్పవచ్చు. ఇవి తినడానికి చాలా రుచికరంగా వుంటాయి. ప్రస్తుతం తాటి తేగలతో రవ్వ బిస్కెట్లు, కేక్లు, నూడిల్స్ కూడా తయారుచేసి మార్కెట్లో అమ్ముతున్నారు. తేగల్లో 60 శాతం పిండి పదార్థంతోపాటు పీచు పదార్థం కూడా వుంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాహారంగా చెప్పవచ్చు.పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది. తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్గా వీటిని పెడితే మంచిది. ఫైబర్ సమృద్ధిగా వుండటంవలన రక్తంలో కొలెస్ట్రాల్ కూడా నిల్వ లేకుండా బయటకు పోతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే. తాటి తేగలను మధుమేహం వున్నవారుకూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం కంట్రోల్గా ఉండేలా చేస్తుంది. రక్త వృద్ధి జరుగుతుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్నవారు రెగ్యుల్గా తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుంతుంది. చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తాటి తేగలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతుంటారు.
***తేగలలో విటమిన్స్!
తేగల్లో బి, బి1, బి3, సి విటమన్లు ఉంటాయి. అలాగే ప్రతిరోజూ శరీరానికి అవసరం అయ్యే పొటాషియం, ఒమేగా 3, కాల్షియం కూడా పుష్కలంగా వుంటాయి. కాలరీలు తక్కువగా వుంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు దీన్ని డైట్లో భాగం చేసుకోవచ్చు.
అయితే తేగలను అధికంగా తీసుకోకూడదు. రోజుకు రెండు తీసుకోవచ్చునని, వారానికి ఐదారు తీసుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేగాని ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధిక మోతాదులో తీసుకుంటే కడుపునొప్పి ఏర్పడే అవకాశం వుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణలులు.