Devotional

సత్యాన్ని పలికించే నాగేశ్వరుడు-సుబ్రమణ్య షష్టి ప్రత్యేకం

The story of nageswara-Subramanya shashthi special devotional news

‘వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం… వందే పన్నగ భూషణం మృగధరం వందేపశునాం పతిం’అంటూ భక్తులు ఈశ్వరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈశ్వరుడిని పూజిస్తే ఆయురారోగ్యాలూ అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇదే విశ్వాసంతో భక్తులు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కొలువైన నాగేశ్వరుడిని నిష్ఠతో కొలుస్తున్నారు. శివుడు లింగాకృతిలో కాకుండా నాగసర్ప రూపంలో దర్శనమివ్వడం, దుర్గ-పార్వతి లతో కొలువుదీరడం ఇక్కడ ప్రత్యేకత.
***స్థల పురాణం ప్రకారం… ప్రస్తుతం పెద్దకళ్లేపల్లి నాగేశ్వరస్వామి క్షేత్రం ఉన్న ప్రాంతంలో పూర్వం పెద్ద పాముల పుట్ట ఉండేది. ఆ ప్రాంతానికి ప్రతిరోజూ మేత కోసం వచ్చే ఓ ఆవు పుట్టకు ఉన్న కలుగులోకి పాలను ధారగా విడుస్తుండేది. దీన్ని గమనించిన కొందరు ఆ పుట్టలో ఏదో మహత్యముందని భావించి తవ్వారు. కొంతసేపటికి సర్ప రూపంలోఉన్న స్వామి పుట్టను చీల్చుకుని ఉద్భవించాడు. ఇక్కడ స్వామి లింగాకృతిలో కాకుండా నాగసర్ప రూపంలో దర్శనమిస్తుండటంతోనే నాగేశ్వరస్వామి అన్న పేరు వచ్చిందని పూర్వికులు చెబుతారు. దక్షిణదేశ యాత్రకు బయలుదేరిన అగస్త్య మహాముని పెదకళ్లేపల్లి సమీపంలో నాగేశ్వరస్వామి ఉన్నట్లు గుర్తించాడనీ, అక్కడ పార్వతీదేవి విగ్రహాన్ని అగస్త్యుడే ప్రతిష్ఠించాడనీ మరికొందరు చెబుతుంటారు.
***ఆలయ చరిత్ర
పెద్దకళ్లేపల్లిలో తొమ్మిది వందల ఏళ్లక్రితమే దుర్గాపార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. పూర్వికులు చెప్పే వివరాల ప్రకారం… 1762లో చల్లపల్లి రాజా వంశీయులు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతల్ని తీసుకున్నారు. చల్లపల్లి రాజా ఓ సారి కోర్టు వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదాన్ని పరిష్కరించేలా చూడాలంటూ రాజా వారు తమ ఇలవేల్పు అయిన విద్యాశంకరి అమ్మవారిని కోరాడు. స్పందించకపోవడంతో కలతచెందిన అతడు ఖడ్గంతో శిరచ్ఛేదన చేసుకున్నాడు. అమ్మవారు ఆయనకు పునర్జన్మ ప్రసాదించారు. తరవాత ఆమె సంకేతాల ప్రకారమే న్యాయమూర్తి… రాజా వారు నిర్దోషి అంటూ తీర్పు వెలువరించారని చెబుతుంటారు. అనంతరం అతడు… కృష్ణా నదిలోని వనదుర్గాదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి నాగేశ్వరస్వామికి ఎడమ వైపున ప్రతిష్ఠించాడు. ఇలా ఓ వైపు దుర్గ, మరోవైపు పార్వతీదేవితో కొలువై ఉన్న నాగేశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు.
***ప్రత్యేకతలు…
ఆలయ ప్రాంగణంలో కాలభైరవుడితోపాటు భద్రకాళీ సమేత వీరభద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలు ఉన్నాయి. పంచముఖ గణపతి ఇక్కడ సింహవాహనాధీశుడై దర్శనమిస్తాడు. ఇక్కడే అరవై అడుగుల ఎత్తైన సత్యస్తంభం ఉంది. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకాలని చెప్పడానికే ఆలయంలో దీన్ని ఏర్పాటు చేశారని పూర్వికులు చెబుతున్నారు. ఈ స్తంభం వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది… గ్రామంలోని ఇద్దరి మధ్య ఆస్తి తగాదా ఏర్పడింది. దాన్ని రాజావారు పరిష్కరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అసత్యం పలికాడు. వెంటనే ఆ స్తంభంలోని మూడో వంతు భాగం అబద్ధమాడిన వ్యక్తిపై పడిందనీ, దీంతో అతడు అక్కడే మృతిచెందాడనీ చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ముప్ఫై అడుగుల ఎత్తైన త్రినేత్రుడి విగ్రహం ప్రధానాకర్షణగా నిలుస్తోంది.
***ఉత్సవాలూ, విశేష పూజలూ…
కార్తిక మాసంలో ఈ ఆలయంలో నిత్యం భక్తుల సందడి నెలకొంటుంది. ఈ మాసంలో లక్ష బిళ్వార్చన నిర్వహించడంతోపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలూ, నాగుల చవితి వేడుకలూ, జన్మనక్షత్రం, శాకంబరి ఉత్సవాలూ వైభవంగా కొనసాగుతాయి.
***చేరుకోవడం ఇలా…
విజయవాడ నుంచి కరకట్ట రహదారి మీదుగా అవనిగడ్డ వెళ్లే బస్సుల ద్వారా చల్లపల్లిలో దిగాలి. అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రానికి ఆటోలూ, ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు. మచిలీపట్నం నుంచి వచ్చేవారు అవనిగడ్డ బస్సు ద్వారా చల్లపల్లిలో దిగి పెదకళ్లేపల్లిలోని ఆలయానికి చేరుకోవాలి.
2.అన్యమత నినాదంతో తితిదేకు సంబంధం లేదు: ఛైర్మన్
అన్యమత నినాదం ఉందంటున్న అంశంలో తితిదే వెబ్సైట్కు ఎటువంటి సంబంధం లేదని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తితిదే వెబ్సైట్, క్యాలెండర్లో ఎక్కడా ఆ పేరు లేదని వెల్లడించారు. ఆదివారం తిరుపతిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజకీయ స్వార్థంతో దేవుడి విషయాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెబ్సైట్లో ఆ పదం ఎలా వచ్చిందనే విషయమై ఇప్పటికే తితిదే విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారన్నారు. దీనిపై గూగుల్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
3.తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు..ఆనందసూర్య ధ్వజం
తిరుమల పవిత్రత, ఆగమశాస్త్ర విలువలను మంటగలిపేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య ధ్వజమెత్తారు. తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం మొదలు తితిదే వెబ్సైట్లో అన్యమత బోధనల పుస్తకాలు అప్లోడ్ చేయడం, అన్యమతస్థులు విధులు నిర్వహించడం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధుల తగ్గింపు తదితర చర్యలను ప్రస్తావించారు. తాజాగా తితిదే అధికారిక వెబ్సైట్ పంచాంగ సమాచారంలో కనిపించిన అన్యమత నినాదాలు వెంకన్న భక్తులను కలిచివేశాయని పేర్కొన్నారు
4. అన్నవరంఆకు మారలేదు!
అన్నవరం గుళ్లో వ్రతం కాగానేపురోహితులు ప్రసాదం చేతికందిస్తారు…అదీ సత్యదేవుడి ఆలయానికే గోధుమ నూక ప్రసాదం…అది ఉండేది **అడ్డాకులో…అదేనండీ విస్తరాకులో…చాలా ఆలయాల్లో లడ్డూ ప్రసాదం… అదీ ప్లాస్లిక్ పొట్లాల్లో ఇవ్వడం మనకు తెలుసు. కానీ అన్నవరంలో మాత్రం వందేళ్లుగా ఒకటే సంప్రదాయం. అప్పటికీ, ఇప్పటికీ అదే గోధుమనూక ప్రసాదం, అదే విస్తరాకు పొట్లాలు. ఎంత మందికి ఇవ్వాల్సున్నా సరే… అడ్డాకులు తప్పనిసరి. ఎందుకిలా అంటే… అందులో ప్రసాదం పవిత్రత, రుచిని దాచిన రహస్యం ఉంది లెండి…
**సత్యదేవుడి దివ్య ప్రసాదాన్ని గోధుమనూక, పంచదార, నెయ్యి, యాలకులు వేసి తయారు చేస్తారు. దీనికి గాలి తగులుతుండాలి. అలాగైతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సహజమైన విస్తరాకుల్లో మాత్రమే సూక్ష్మరంధ్రాల ద్వారా గాలి తగులుతుంటుంది. ఆకు వల్ల ప్రసాదంలో నెయ్యి కరిగి కారిపోయే అవకాశం ఉండదు. దీంతో ప్రసాదం నాణ్యంగా, మధురంగా ఉంటుంది. దీంతో అన్నవరం ప్రసాదానికి ప్రత్యేకంగా విస్తరాకులను ఎంచుకున్నారు. పైగా ఆకుల్లోని రసాన్ని పీల్చుకున్న ప్రసాదం మరింత రుచికరంగా మారుతుంది. ఇంత మహత్తరమైంది దీనికి ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల విభాగంలో ఐఎస్వో 22000 : 2005 గుర్తింపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
**అంత మందికి చేయూత…
దేవస్థానంలో ఏటా 2 కోట్ల ప్రసాదం పొట్లాలు విక్రయిస్తారు. దీనికోసం నెలకు 20 లక్షల వరకు సిద్ధమైన ఆకులు అవసరమవుతాయి. ఇవన్నీ విశాఖ జిల్లాలోని చింతపల్లి, పెదబయలు, పాడేరు, అరకు, ముంచిగపుట్ట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తారు. దీంతో ఏటా ఆరు నెలల పాటు ఈ ప్రాంతాల్లోని గిరిజనులకు మంచి ఉపాధి దొరుకుతోంది. సేకరించిన అడ్డాకులను పూచికపుల్లతో కుట్టి విస్తరాకుగా కుట్టడం ద్వారా మరికొన్ని గ్రామాల ప్రజలకు పని దొరుకుతోంది.
5.అన్యమత నినాదంతో తితిదేకు సంబంధం లేదు
అన్యమత నినాదం ఉందంటున్న అంశంతో తితిదే వెబ్సైట్కు ఎటువంటి సంబంధం లేదని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తితిదే వెబ్సైట్, క్యాలెండర్లో ఎక్కడా ఆ పేరు లేదని వెల్లడించారు. ఆదివారం తిరుపతిలో ఈవో అనిల్కుమార్ సింఘాల్, తిరుపతి జేఈవో బసంత్కుమార్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టితో కలిసి సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాజకీయ స్వార్థంతో దేవుడి విషయాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెబ్సైట్లో ఆ పదం ఎలా వచ్చిందనే విషయమై ఇప్పటికే తితిదే విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారన్నారు. అన్యమత ప్రచారం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. అన్ని మతాల వారు జగన్ను గుండెల్లో పెట్టుకుని పూజించినందునే సీఎం అయ్యారన్నారు. అన్య మతప్రచారం చేయాల్సిన అవసరం తితిదేకు లేదని.. ఇటువంటి సమస్య భవిష్యత్తులో రాకుండా ఎస్పీ స్థాయి అధికారితో సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి, డీజీపీకి ప్రతిపాదన పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు తెరుస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని ఛైర్మన్ పేర్కొన్నారు.
6. తిరుమలలో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘నాద నీరాజనం’ కళాకారుల గ్రేడ్లను తొలగించినట్లు ఆ ఛానల్ ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. ఎస్వీబీసీ ఛానల్ను ఏప్రిల్ నుంచి హెచ్డీగా మార్చుతున్నామన్నారు.
7. వైభవంగా పంచమితీర్థం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం పంచమితీర్థా(చక్రస్నానం)న్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన శ్రీవారు సారెను అమ్మవారికి సమర్పించారు. స్నపన తిరుమంజనం చేశాక కుంభలగ్నంలో చక్రాత్తాళ్వార్లను పుష్కరిణిలో మునక వేయించారు. ఆ సమయంలో దాదాపు లక్షన్నర మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ఆస్థానం అయ్యాక బంగారు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. చివరగా.. ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా.. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం నారాయణస్వామి పట్టువస్ర్తాలు సమర్పించారు. అలాగే సీఎం జగన్ తరఫున రూ.7లక్షల విలువైన 113 గ్రాముల అన్కట్ డైమండ్ నెక్లె్సను అమ్మవారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమర్పించారు.
8. రాశిఫలం – 02/12/2019
తిథి:
శుద్ధ తదియ రా.తె.4.27, కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
అనూరాధ రా.1.03
వర్జ్యం:
శేషవర్జ్యం: ఉ.7.06
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు తీవిశేషాలు: త్రిలోచన గౌరీవ్రతం
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమగును. కీళ్లనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగివుంటారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. సహనం వహించుట అన్ని విధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనవసర ధనవ్యయంతో ఋణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం వుంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యలనెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనంవల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంటుంది. అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
9. శుభమస్తు _ నేటి పంచాంగం
తేది : 2, డిసెంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరమాసం
ఋతువు : హేమంత ఋతువు
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(ఈరోజు రాత్రి 8 గం॥ 49 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(ఈరోజు ఉదయం 12 గం॥ 34 ని॥ వరకు)
యోగము : ధ్రువము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 6 గం॥ 38 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 4 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
10. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు సోమవారం,
02.12.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-23℃°
• నిన్న 85,511 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 16
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
14 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 31,914 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.18 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు
మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు/
ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథంప్రవేశం ద్వారా
స్వామి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
11. బతుకు విలువ
మాతంగ మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదికి ఒక యువకుడు ఎక్కి కళ్లు మూసుకుని, చేతులు జోడించి దైవప్రార్ధన చేయసాగాడు. అతడి వాలకం చూసిన మునికి అది భక్తి కాదు, విరక్తి అని క్షణంలో అర్థమైంది. బతుకు చాలించటం కోసమే చివరిసారిగా దేవుడిని తలుకుంటున్నాడని గ్రహించి, నదిలో దూకబోతున్న వాడిని చటుక్కున చేయిపట్టి, వెనక్కి గుంజాడు. కళ్ళు తెరచిన ఆయువకుడు ’నేనింకా చావలేదా?’ అని ఆశాభంగం చెంది, రుషివైపు నిరసనగా చూశాడు.‘‘ఎందుకు ఆపారు స్వామీ! ఈపాటికి ఈ తుచ్ఛమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని’’ అన్నాడు. మహర్షి తల అడ్డంగా ఊపి ‘‘తప్పునాయనా! దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధంతరంగా ముగించటం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు?’’ అన్నాడు ఆదరంగా.ఆ యువకుడు కాస్త ఊరడిల్లి, కళ్ళు తుడుచుకుంటూ ‘‘నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామీ! ఆమెపేరు మల్లిక. కానీ ఆమె నా ప్రేమని తిరస్కరించింది. ఎన్ని ప్రయత్నాలుచేసినా, ఎంతగా ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు. ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్ధం. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు.మాతంగ మహర్షి దీర్ఘంగా నిశ్వసించి ‘‘సరే నాయనా! నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరంపాటు వాయిదా వెయ్యి. ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఊరికే ఇవ్వటానికి సిద్ధ పడ్డావు కనుక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు. అంటే నేను చెప్పినట్టు నడుచుకో. తర్వాత నీ కోరిక నెరవేర్చుకో’’ అన్నాడు.‘‘అలాగే స్వామీ! నా లెక్క ప్రకారం నేనివాళే మరణించినట్టు. ఇక నుంచి జీవచ్ఛవంతో సమానం. మీ ఇష్టప్రకారం కానీయండి’’అన్నాడు. అతడి పేరూ ఊరూ వివరాలు తెలుసుకుని, అతడిని తన వెంట ఒక ఆటవిక గూడేనికి తీసుకు వెళ్ళాడు. మహర్షిని ఆటవికులు సాదరంగా ఆహ్వానించి, సకల సపర్యలూ చేశారు. వారిని దీవించిన ముని, ఆ యువకుడిని వారికి అప్పగించి, ‘‘ఇతడి పేరు ఆనందుడు. ఒక ఏడాదిపాటు మీతో కలిసి జీవిస్తాడు, నన్ను గౌరవించినట్టే ఇతడిని కూడా ఆదరించండి’’ అని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.మహర్షి ఆజ్ఞను శిరసావహించిన ఆటవికులు ఆనందుడిని కాలు కింద పెట్టనీకుండా, సకల సౌకర్యాలతో సేవించ సాగారు. కొన్ని రోజులు హాయిగా గడిచినా, రానురాను ఆనందుడికి తన నిష్క్రియాపరత్వం పట్ల అసంతృప్తి కలుగసాగింది. ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా పని చేయాలనిపించింది. గూడెం పరిసరాలను, వారి దైనందిన జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆటవికులు ఎక్కువగా వేటలోనూ, నిద్రలోనూ, అప్పుడప్పుడూ కొండదేవర పూజా, నాట్యాలలోనూ కాలం గడుపుతున్నారు. వారంతా అజ్ఞానంలోనూ, అభివృద్ధికి ఆమడ దూరంలోనూ ఉన్నారని గ్రహించాడు.
ఒకరాత్రి గూడెం వాసులను సమావేశపరచి ఆనందుడు ఇలా అన్నాడు: ‘‘మీ శక్తీ, సమయమూ చాలావరకు వృథాగా పోతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ గూడేన్ని, మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను’’ అన్నాడు. ఆటవికులు ముక్త కంఠంతో ‘‘మాకు మాతంగ మహర్షీ, మీరూ వేరు కాదు. మీ మాట చొప్పున చేస్తాము’’ అన్నారు. వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు.మొదటగా గూడెంలోని ఊహ తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేపచెట్టు కిందకి చేర్చి పాఠశాల ప్రారంభించాడు. వృద్ధులకి బుట్టలు, చాపలు అల్లే పని పురమాయించాడు. వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు పండించే సేద్యగాళ్లుగా మార్చాడు. స్త్రీలకు ఔషధ మూలికలు, తేనె, వెదురు బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు. వాటన్నింటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు. తన తండ్రి, అన్నల సహకారంతో అక్కడ ఆటవికుల చేత అంగళ్ళు తెరిపించాడు. ఇప్పుడు ఆనందుడు, ఆటవికులు క్షణం తీరికలేకుండా ముమ్మరమైన పనిలో తల మునకలైపోయారు.చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. మాతంగముని గూడేనికి వచ్చి ‘‘ఆనందా! నాకిచ్చిన మాట నిలబెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గడువు దాటింది గనుక నీకు నేను అడ్డు రాను. స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో’’ అన్నాడు. ఆనందుడు రుషి కాళ్ళ మీదపడి ‘‘నాకిçప్పుడు చావాలని లేదు స్వామీ! బతకాలని ఉంది’’ అని కన్నీరు కార్చాడు. మహర్షి అతడిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. ‘‘నాయనా! నీ చొక్కా నీకు బిగువైనపుడు దాన్ని చింపి పారేయటమో, కాల్చేయటమో చేసే బదులు, అది సరిపోయే వారికి ఇస్తే ఉపయోగపడుతుంది. నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇపుడు ఎంత అర్థవంతంగా మారిందో చూశావా ? ఈ సృష్టిలో నిరుపయోగమైనదేదీ లేదు’’ అన్నాడు.‘‘నిజమే స్వామీ! నాకు పనికిరాని నా జీవితం ఈ ఆటవికులకి ఉపయోగపడి నాగరికులుగా మార్చింది. ఈ అడవిలో ఇంకా అనేక గూడేలున్నాయి. నా అవసరం అక్కడ ఉంది. నాకోసం వారు ఎదురు చూస్తున్నారు. తమ సెలవైతే బయలుదేరుతాను’’అన్నాడు ఆనందుడు వినయంగా.‘‘అలాగే ఆనందా! వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం’’ అన్నాడు మునీశ్వరుడు మందహాసం చేస్తూ. ఆనందుడు తలవంచి ‘‘లేదు స్వామీ! భగ్నప్రేమికుడిని, జీవితాన్ని త్యజించాలను కున్న వాడిని, నాకే ఆశలూ లేవు’’ అన్నాడు. మాతంగముని సైగ చేయటంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు నిలబడింది. ఆనందుడు తలెత్తి చూసి ‘మల్లికా!’ అన్నాడు ఆనందాశ్చర్యాలతో.
**సౌజన్యమూర్తులు
ఈ సమాజం సకల జనుల సమాహారం. ఏ ఇద్దరి రూపు, చూపు, కంఠధ్వని ఒక్కలా ఉండవు. కవలల్లో కూడా హస్తరేఖలు, వేలిముద్రలు భిన్నంగా ఉంటాయి. ఇక మనస్తత్వాల సంగతి సరేసరి… ఎవరి భావాలు, వాదనలు, తీరుతెన్నులు వారివే! అరిషడ్వర్గాలకు లోనుకానివారు అరుదుగా ఉంటారు.మనిషి స్వాభావికంగా స్వార్థపరుడు. తన జీవితం, తన చదువు, ఉద్యోగం, కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. మాటల్లో మాత్రం ‘మనందరం ఒకటే’ అంటాడు. చేతల్లో తాను, తనవాళ్లంటూ తపన పడతాడు. తదనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఏ కొందరో సమాజం గురించి ఆలోచిస్తారు. రేపటి తరం గురించి పాటుపడతారు. చెడును కడిగి మంచి దారి చూపిస్తారు. వారు ఆచరిస్తారు. ఆదర్శప్రాయులు అవుతారు. వారి ప్రయాణంలో అనేక కష్టనష్టాలకు గురవుతారు. అసూయతో చేసే కువిమర్శలకు కుంగిపోరు. లక్ష్యసాధన దిశగా మొక్కవోని దీక్షతో సాగిపోతుంటారు. ఆర్థిక సంబంధాలు కాలానుగుణంగా హార్దిక సమస్యలు సృష్టించవచ్చు. డబ్బు పాపిష్టిది అంటారు. అన్నదమ్ములు, ఆప్తమిత్రులు సైతం శత్రువులుగా మారిపోతారు. న్యాయస్థానాలను ఆశ్రయించి విలువైన కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటారు. ఇందులో గెలుపు ఓటములుండవు. తార్కికంగా విశ్లేషిస్తే ఇద్దరూ ఓడిపోయినవారిగానే మిగులుతారు.చాలాచోట్ల స్వార్థం, అవకాశవాదం, అతిలౌక్యం, అయాచిత ధనం రాజ్యమేలుతున్నాయి. నేటి ప్రపంచంలో శ్రమ లేకుండా ఒక్క రోజులో కోటీశ్వరుడు కావాలన్న కాంక్ష ప్రబలిపోతోంది. కారుచీకటిలో కాంతిరేఖల్లాగా కొందరు సౌజన్యమూర్తులు లేకపోలేదు. వారు తమ జీవన శైలి ద్వారా పలువురికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. గత పురాణాలు, ఇతిహాసాల్లోని పాత్రల వైవిధ్యం, వైరుధ్యం నేటి సమాజంలోనూ కనిపిస్తాయి. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం వల్లనే పరిశీలన, పరిశోధనలు అబ్బుతాయి. స్త్రీవ్యామోహం ఎలాంటి పతనానికి దారితీస్తుందో ఒక గ్రంథం వివరిస్తే, జూద వ్యసనం వల్ల రాజ్యభ్రష్టులవుతారని మరో ఇతిహాసం బోధిస్తుంది. ఎన్ని కష్టనష్టాలెదురైనా, భార్యాబిడ్డలు దూరమైనా, రాజ్యం పోయినా సత్యమార్గం వీడనని భావించి ఆచరించిన వ్యక్తి నిజంగా దైవస్వరూపుడేనని నిరూపించిన చక్రవర్తి గాథ నేటికీ చెక్కుచెదరలేదు.కడుపున పుట్టిన బిడ్డలందరినీ అతి కిరాతకంగా, నిదురించే వేళ వధించిన దుర్మార్గుడు చేత చిక్కినా మరొక తల్లికి తనలాంటి గర్భశోకం కలిగించనన్న కారుణ్య స్త్రీమూర్తుల క్షమాగుణం ప్రశంసనీయం!ముళ్ల కిరీటం ధరింపజేసి సిలువను వీపుపై పెట్టి హింసిస్తున్న వ్యక్తులు అమాయకులని, క్షమార్హులని భావించిన కరుణామయుల జీవితాలు ఎందరికో శిరోధార్యాలు!పదిహేడో శతాబ్దంలో థామస్‌ హేవుడ్‌ రచించిన ‘కరుణ వల్ల కన్నుమూసిన యువతి’ (ఎ ఉమన్‌ కిల్డ్‌ విత్‌ కైండ్‌నెస్‌) అన్న నాటకం అప్పట్లో సంచలనం సృష్టించింది. వ్యసనాలకు బానిసైన ఒక భార్యను ఎలాంటి చిన్నచూపూ చూడకుండా సకల మర్యాదలతో ఆర్థికంగా భర్త ఆదుకుంటాడు. అతడి మంచితనాన్ని, త్యాగాన్ని తట్టుకోలేక గుండె పగిలి మరణించిన ఆ భార్య కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మంచి చెడుల కలయికే సమాజమని, అంతిమంగా దయ, కరుణ, త్యాగం, ప్రేమ వంటి లక్షణాలే విజయం సాధిస్తాయని చాటే సౌజన్యమూర్తులు ఎప్పటికీ చిరంజీవులే!
12. శ్రీరస్తు శుభమస్తు
?తేది : 2, డిసెంబర్ 2019
?సంవత్సరం : వికారినామ సంవత్సరం
?ఆయనం : దక్షిణాయణం
♦మాసం : మార్గశిరమాసం
?ఋతువు : హేమంత ఋతువు
?కాలము : శీతాకాలం ❄
?వారము : ఇందువాసరే (సోమవారం)
?పక్షం : శుక్లపక్షం
?తిథి : షష్టి
(నిన్న రాత్రి 7 గం॥ 13 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 0 ని॥ వరకు షష్ఠి తిధి తదుపరి సప్తమి తిధి)
⭐నక్షత్రం : శ్రవణం
(నిన్న ఉదయం 9 గం॥ 39 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 45 ని॥ వరకు శ్రవణం నక్షత్రం తదుపరి ధనిష్ట నక్షత్రం)

✋యోగము : (ధ్రువ ఈరోజు మధ్యాహ్నం 1 గం ll 37 ని ll వరకు తదుపరి వ్యాఘాతం రేపు మధ్యాహ్నం 2 గం ll 8 ని ll వరకు)
?కరణం : (కౌలువ ఈరోజు ఉదయం 8 గం ll 6 ని ll వరకు)
?అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 57 ని ll )
?వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 55 ని॥ వరకు)
?అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 35 ని॥ వరకు)
?దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 58 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 11 ని॥ వరకు)
?రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
⚫గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 44 ని॥ వరకు)
?యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 57 ని॥ వరకు)
?సూర్యోదయం : ఉదయం 6 గం॥ 31 ని॥ లకు
?సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
?సూర్యరా : వృచ్చికము ?
?చంద్రరాశి : మకరము ?
?సుబ్రహ్మణ్య షష్ఠి ?
13. శుభోదయం ?
మహనీయుని మాట
” ఏది తప్పో.. ఏది ఒప్పో….
మీ అంతరాత్మ చెబుతూనే
ఉంటుంది.
తెలియదనడం ఆత్మవంచన!
– చలం!
14. నేటి మంచిమాట ?♂
బొగ్గుని మండుతున్నప్పుడు
ముట్టుకుంటే చేయి
కాలుతుంది.
చల్లగా ఉన్నప్పుడు
ముట్టుకుంటే చేయి
నల్లబడుతుంది.
చెడ్డవానితో ఎలా ఉన్నా
ముప్పే….!!
15. నేటి సుభాషితం

అడుగు ముందుకు వేయగలిగితేనే దూరమన్నది ఏది లేదు చెమట చిందించగలిగితేనే సాధ్యం కానిదేమి లేదు
16. నేటి జాతీయం?
కోరలు పీకటం
అధికారాలను, ప్రభావాన్ని, పౌరుషాన్ని, గర్వాన్ని తగ్గించటం . అతనికి పదవి పోగానె కోరలు పీకినట్టయింది.
17. నేటి సామెత ?
పిండి కొద్దీ రొట్టె
ఎన్ని రొట్టెలు కావాలో వాటికి సరిపడా పిండిని కలుపు కోవాలి. తక్కువ పిండి కలిపి ఎక్కువ రొట్టెలు కావాలంటే అది అసాధ్యం. అలాగే కొంచెం పిండి కలిపి పెద్ద రొట్టె చేయాలంటే కూడా కుదరదు.
18. నేటి ఆణిముత్యం ?
మార్పు లేదైన సులువుగా మలచు కొనుట
సమయపాలన వలననే సాధ్యమగును;
సమయపాలన చేతనే సకల జనులు
కరము సంస్తుత్యమానులై పరగగలరు
భావము:
సమయపాలన వలన అవసరమైతే తగిన మార్పులు చేసుకోవటానికి సాధ్యమౌతుంది. సమయపాలన నియమంగా పాటించే వారే అందరిచేత
19. మన ఇతిహాసాలు వ్యాసుడు
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలో పెక్కు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి “నీ వర్ణాశ్రమధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకొంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనమo చేస్తూ ఉండు” అని పలికి అతనికి దివ్యత్వాన్నీ, మణి సువర్ణమయమైన దివ్యవిమానాన్నీ , ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సమర్ధమైన “వేణుయష్టినీ ఇచ్చాడు”. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది.వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా “శుక్తిమతి” అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న “కోలహలుడు” అనే పర్వతము “శుక్తిమతి” మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా, ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన “గిరిక” అనే కుమార్తె “వసుపదుడు” అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు.ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది.పూర్వం బ్రహ్మ శాపం వలన “అద్రిక” అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. పదినెలల తరువాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజు నకు ఇచ్చారు. అద్రిక అనే పేరుకల ఆ చేపరూపంలో ఉన్న అప్సర; మనుష్యులను కంటే తనకు శాపవిమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనిత గా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది.ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది.ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.నల్గొండ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (ఏపీ 36 ఎక్స్ 3654) మంటల్లో దగ్ధమైంది. గత రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు, నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై ప్రయాణిస్తుండగా, చర్లపల్లి వద్ద ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులను దించేశాడు. ఆపై నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దగ్ధమైన బస్సును గుంటూరుకు చెందిన గాయత్రీ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారుతమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని చెన్నై, కడలూరు కాంచీపురం సహా 8 జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వర్ష బీభత్సానికి కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూలాయి. ఈ ఘటనల్లో ఇళ్లలో నిద్రిస్తున్న 15 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాల వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.