DailyDose

నా మతం కులం గురించి మీకెందుకు?: జగన్-రాజకీయ-12/02

YS Jagan Says Comments On His Religion Are Hurtful-Telugu Politics-12/02

*ఇటీవల కాలంలో కొందరు తన మతం కులం గురిమ్చ్చి మాట్లాడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నరని వాటిని వింటుంటే బాధగా ఉంటోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గుంటూరులో వైఎసార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ప్రారంబించిన అనంతరం జగన్ ప్రసంగించారు. నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా నామతం మానవత్వం అని ఈవేదిక పై నుంచి చేపదలచుకున్నా నాకులం మాట నిలబెట్టుకునే కులం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పనిచేస్తున్న. అని జగన్ అన్నారు. ఓ గొప్ప కార్యక్రమానికి నేడు అంకురార్పణ జరిగిందని వైద్యం చేయించుకునేందుకు ఇకపై ఏ పేదవాడు ఇబ్బందులు పడబోదని హామీ ఇస్తున్నానని అన్నారు.
* షాద్ నగర్ రోడ్డుపై కాన్వాయ్ ఆపిన చంద్రబాబు
శంషాబాద్ లో ఇటీవల చోటుచేసుకున్న జస్టీస్ ఫర్ దిశ వ్యవహారం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని నేరస్తులను ప్రభుత్వం కటినంగా శిక్షించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శంషాబాద్ లో జరిగిన దారుణంతో పాటు షాద్ నగర్ లో దిశా మృతదేహాన్ని దహనం చేసిన విషయాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 44వ నెంబర్ జాతీయ బైపాస్ రహదారి పై మాజీ ముఖ్యమంరి చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్తూ కాసేపు కాన్వాయ్ ని రోడ్డుపై ఆపారు. ఈ సందర్భంగా ఆయనను కార్యకర్తలు కలుసుకున్నారు అక్కడ హాజరైన మీడియా ప్రతినిధులను చందబాబు మాట్లాడారు. శంషాబాద్ ఘటన దోషులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో జరుగుతున్నా లోటుపాట్లను గ్రహించి దోషులను త్వరగా శిక్షపడే విధంగా చూడాలన్నారు అయితే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని సూచించారు. ఏదీ ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. దోషులను కటినంగా శిక్షలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిలా షడ్ నగర్ తెదేపా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అనుమతి లేదని పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు. ఈ అరెస్టును తానూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేసారు.
*నలభై వేలకోట్లు మళ్లించిన ఫడ్నవిస్
మెజార్టీ లేకపోయినా మహారాష్ట్ర ముఖ్యమంరిగా దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజుల పాటు హైడ్రామా నడపడం పై భాజపా సీనియర్ నేత కర్ణాటక ఎంపీ అనంత కుమార్ హేద్దె సంచలన వ్యాఖ్యలు చేసారు. రూ. నలభై వేల కోట్ల కేంద్రం నిధులు వృధా కాకుండా కాపాడేందుకు పడ్నవిస్ ను ముఖ్యమంత్రిను చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ చివరి నిమిషంలో దేవేంద్ర ఫద్నవిస్ రంగంలోకి దిగకుండా ఉండినట్లే ఆ నిదులన్ను శివసేన కూటమి దుర్వినియోగం చేసేదేనని హెగ్డే ఆరోపించారు.
*రాహుల్ బజాజ్ అమిత్ శాగారు ప్రభుత్వాన్నివిమర్సించాలంటే భయపడుతున్నారు?
దేశంలో భయంతో కూడిన వాతావరణం ఉందని ప్రభుత్వాన్ని విమర్సించాలంటే ప్రజలు భయపడుతునారని ప్రభుత్వ విమర్శను స్వీకరిస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదని పారిశ్రామికవేత్త బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ కేంద్ర హోమ మంత్రి అమిత్ శాతో అన్నారు. ఎకనామిక్ టైమ్స్ అవార్డు ఫంక్షన్ కు హాజరైన రాహుల్ బజాజ్ కేంద్ర హోమ మంత్రి పియూష్ గోయాల్ ఉన్న ఒక ప్యానల్ ను ప్రభుత్వాన్ని ఎకనామిక్ టైమ్స్ తన యూ ట్యూబ్ చానల్ లో ఉంచిన ఓ కార్యక్రమ వీడియోలోనూ రాహుల్ బజాజ్ సంబందించిన ప్రసన వినచ్చు.
* కాంగ్రెస్ సభలో ప్రియాంక చోప్రాకు జిందాబాద్..
రాజకీయ నాయకులు కొన్నిసార్లు మతితప్పి మాట్లాడుతుంటారు. కొందరైతే ఏం మాట్లాడుతారో అర్థం కాదు. సందర్భం లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు.. ఇలాంటి నాయకుల మాటలు విని ప్రజలు పడిపడి నవ్వుకుంటారు. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్‌ నాయకుడొకరు.. ఒకరి పేరు స్థానంలో మరొకరి పేరు ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు.ఢిల్లీలో నిన్న కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సుభాష్‌ చోప్రా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్‌ నాయకుడు సురేంద్ర కుమార్‌ సభలో నినాదాలు చేశారు. సోనియా గాంధీ అనగానే జనాలు జిందాబాద్‌ అని నినదించారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావించగానే జనాలు మళ్లీ జిందాబాద్‌ అని నినాదాలు చేశారు. చివరకు ప్రియాంక గాంధీ పేరు స్థానంలో ప్రియాంక చోప్రా అని సురేంద్ర కుమార్‌ అన్నారు. ఇందుకు కూడా జనాలు జిందాబాద్‌ కొట్టారు. కాసేపటి తర్వాత జనాలు తేరుకుని నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.
*నాకు సంబంధం లేని వాటిని పెద్దవిగా చేసి చూపుతున్నారు: జగన్
జనవరి 1 నుంచి తలసేమియా రోగులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా కొత్త పథకం తీసుకు వస్తామన్నారు. 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీని విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని జగన్‌ వెల్లడించారు. ఏప్రిల్‌ నాటికి 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తామన్నారు.డిసెంబర్‌ 15 నాటికి 510 రకాల మందులు అందుబాటులోకి తెస్తామన్నారు. 3 నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని జగన్‌ పేర్కొన్నారు. మే నాటికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. తనకు సంబంధం లేని అంశాలను పెద్దవిగా చేసి చూపుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతానని జగన్‌ పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు తనకు ఉన్నాయన్నారు. మొదటి నుంచి ప్రజలను, దేవుడిని నమ్మానని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
*ఆ విషయంలో జగన్.. చంద్రబాబును మించిపోయాడు: తులసిరెడ్డి
రాష్ట్రంలో ఆత్మహత్యల పాలన ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలల్లో జగన్ రూ.28 వేల కోట్ల అప్పుచేశారని తెలిపారు. అప్పులు చేయడంలో జగన్.. చంద్రబాబును మించిపోయాడని విమర్శించారు. రాష్ట్రం రావణ కాష్టమైందని.. రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు కాస్తా గులకరాళ్లుగా మారిపోయాయని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
*విష సంస్కృతికి ఊతమిస్తోన్న తెరాస పాలన
తెరాస ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతోనే రాష్ట్రంలో విష సంస్కృతి పెరిగి మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెట్రేగిపోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ, శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పశువైద్యురాలు, మరికొందరు యువతులపై జరిగిన హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రజలను కలవరపాటుకు గురిచేయడంతో పాటు రాష్ట్ట్రం అట్టుడుకుతోందన్నారు. ప్రభుత్వ విధానాలతో బడులు మూతపడుతున్నాయి.. బార్లు తెరుచుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, హైదరాబాద్లో పబ్, క్లబ్ సంస్కృతి పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకంతో హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆరోపించారు.
*శాసనసభ ప్రతిపక్ష నేతగా ఫడణవీస్
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం నూతనంగా నియామకమైన శాసనసభా స్పీకర్ నానా పటోలే ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన అనంతరం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ఫడణవీస్కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పటోలే ఆదివారం నూతన శాసనసభా స్పీకర్గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన సకోలి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
*ఉద్ధవ్ కేబినెట్లో ఎన్సీపీకీ కీలక పదవులు?
మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి కీలక పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 43 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా.. అందులో ఆ పార్టీకి 16 స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేనకు 15 మంత్రి పదవులు దక్కనున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్కు 12 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన స్పీకర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించడంతో ఆ పార్టీకి పరిమిత సంఖ్యలో మాత్రమే మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
*హోదా’ అడిగే ధైర్యం వైకాపాకు లేదు: పవన్
రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేకహోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైకాపాకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో రైతులతో సమావేశమైన అనంతరం ఏర్పాటుచేసిన సభలో పవన్ మాట్లాడారు. భారతి సిమెంట్ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్రెడ్డి సీఎంలా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోదిస్తానని.. కొంతమందికే సీఎంలా ప్రవర్తిస్తే పేరు పెట్టే పిలుస్తానన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ సీమ కాదని.. చదువుల తల్లి సీమని అని ఆయన కొనియాడారు. సమస్యలతో పోరాడటానికి చదువులు ఉపయోగపడాలని.. ఆశయం కోసం పనిచేసే వారికి గెలుపోటములతో సంబంధం లేదని చెప్పారు.
*ఆగండి.. మళ్లీ వస్తా: ఫడణవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాజకీయ అంకగణితంలో ఓడిపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయామని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. తానే మళ్లీ వస్తానని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఎంపికైన సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ప్రజాభీష్టం మేరకు భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్టోబర్ 21న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 70 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. కానీ రాజకీయ అంకగణితం ముందు మేం ఓడిపోయాం. 40 శాతం మార్కులు సాధించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో మేం భాగస్వాములం కాబట్టి దాన్ని మేం అంగీకరిస్తున్నాం’’ అని దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.
*త్వరలో భాజపా జిల్లా అధ్యక్షుల ఎన్నిక!
రాష్ట్రంలో భాజపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కీలకదశకు చేరుకుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల ఎన్నికపై కమలదళం దృష్టి పెట్టింది. ఆ పార్టీ కీలకనేతలు శని, ఆదివారాల్లో రెండు దఫాలు చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) మంత్రి శ్రీనివాస్ శనివారం రాత్రి హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆదివారం ఆరెస్సెస్ నేతలతోనూ భేటీ అయ్యారు. 50 శాతం మండల కమిటీల ఎంపికను పూర్తిచేసి.. జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని నిర్ణయించారు.
*స్టాలిన్కు భాజపా నాయకుడి ప్రశంసలు!
అన్నాడీఎంకే కూటమిలో ఉన్న భాజపా నాయకుడు డీఎంకే నేతను పొగడ్తలతో ముంచెత్తడం చర్చకు దారితీస్తోంది. పుదుకోట్టైలో ఆదివారం జరిగిన ఓ వేడుకలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తోపాటు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరసకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అరసకుమార్ ‘కాలం కలిసొస్తుంది. కార్యాలు సఫలమవుతాయి. స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారు. దానిని అందరం చూస్తాం. ఎంజీఆర్ తర్వాత తన అభిమాన నాయకుడు స్టాలినే’ అంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యానికి గురిచేశారు.
*‘బిల్డ్ ఏపీ’ కాస్తా ‘సెల్ ఏపీ’గా మారుతోంది: అఖిలప్రియ
జగన్ను ముఖ్యమంత్రిని చేస్తే తమ కష్టాలు తీరుస్తారని ప్రజలు భావించి గెలిపిస్తే, అందుకు భిన్నంగా ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె నివాసంలో వైకాపా పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘బిల్ట్ ఏపీ’ అనే నినాదం కాస్తా ‘సెల్ ఏపీ’ గా మారుతోందన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మి అభివృద్ధి చేయాలని చూడడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు
*వైకాపా పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి: కళావెంకట్రావు
ఆరు నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పాలనతో రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను మంటగలిపారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు అన్నీ కష్టాలేనని.. రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆదివారం మాట్లాడారు. కూల్చివేతలు, కక్ష సాధింపు, మూసివేతలు, విధ్వంసమే లక్ష్యాలుగా ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.