Sports

ధోనీపై FIR

FIR Filed On Dhoni In Amrapali Scam-Telugu Sports News

క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిపై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆమ్రపాలి స్కామ్‌లో భాగంగా బాధితులు.. దానికి అంబాసిడర్‌గా ధోని పనిచేశాడని, ఆయనపై నమ్మకంతోనే తాము ప్లాట్లు కొనుగోలు చేశామని ఫిర్యాదు చేశారు. స్కాంలో ధోనికి కూడా భాగం ఉందని తెలిపారు. అయితే ఆమ్రపాలి గ్రూప్ సకాలంలో ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలం కావడంతో హోమ్ బయ్యర్స్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. కంపెనీ డైరక్టర్లు, ఆమ్రపాలీ గ్రూపునకు చెందిన ఇతర అనుబంధ సంస్థలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కంపెనీకి చెందిన సీఎండీ అనిల్ శర్మ, కంపెనీ డైరక్టర్లు శివ ప్రియ, అజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ధోని కూడా తనకు రావాల్సిన రూ.40కోట్ల బాకీని అమ్రపాలీ గ్రూప్ ఎగ్గొట్టిందని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. 2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించానని, అయితే అందుకు తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా కంపెనీ మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వహిస్తోందని మహీ కోర్టుకు తెలిపారు