Health

గోరింటాకు పొడి-చామంతి పూలతో తేనీరు

Flower tea with chamanthi and gorintaku

గ్రీన్ టీలే కాదు… పూల తేనీటి వాడకమూ పెరిగింది. వాటిల్లో ప్రధానంగా చామంతి టీని ఆరోగ్యానికే కాదు అందాన్ని మెరుగుపరుచుకోవడానికీ ఉపయోగించుకోవచ్చట. అదెలాగంటే…
చామంతితోచమక్కు!
* చామంతి టీని ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఇది చర్మాన్ని చాలా తక్కువ సమయంలో తాజాగా మారుస్తుంది. దీనిలోని పోషకాలు చర్మగ్రంథుల లోపలివరకూ చొచ్చుకునిపోయి శుభ్రం చేస్తాయి. కాలిన గాయాలు, దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లనూ ఈ టీ తగ్గిస్తుంది.
* చర్మంపై పేరుకున్న నలుపు… ముఖాన్ని కాంతివిహీనంగా మారుస్తుంది. అలాంటివారు రోజు విడిచి రోజు చామంతి టీని ముఖానికి రాసుకుని చూడండి. ఇది సహజ బ్లీచింగ్ ఏజెంట్లా ఉపయోగపడుతుంది. చర్మఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుంది. చర్మం బిగుతుగానూ మారుతుంది. ఫలితంగా నలుపే కాదు… ముఖంపై ఏర్పడే మచ్చలూ తగ్గుతాయి.
* నిద్రలేమి, పని ఒత్తిడి… ఇతరత్రా కారణాలతో కళ్లు వాస్తాయి. ఇలాంటప్పుడు చల్లని చామంతి టీలో దూదిని ముంచి… కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటి అలసటా తగ్గుతుంది. నల్లని వలయాలూ దూరమవుతాయి.
* నాలుగు చెంచాల గోరింటాకు పొడికి చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని నాలుగైదు గంటల తరువాత తలకు పట్టించి… గంటయ్యాక తలస్నానం చేయాలి. జుట్టుకి పోషణ అందుతుంది. పట్టులా మారుతుంది.