DailyDose

చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు-నేరవార్తలు-12/03

Full Security At Charlapalli Jail-Telugu Crime News-12/03

* పెనుమాకలో విద్యుత్ ఘాతంతో కార్తీ నాగకుమార్ అనే వ్యక్తి (34)మృతిగోపి, సురేష్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలుసెంట్రింగ్ పని చేస్తుండగా ఇనుప రాడ్డు ప్రక్కనే ఉన్న విద్యుత్ తీగలను తకాటంతో జరిగిన ఘటన.
* గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రఫుల్ పటేల్ అనే వ్యక్తి స్కూటర్‌పై వెళ్తుండగా ఎమ్మెల్యే శైలేష్ కారు ఢీకొట్టగా తీవ్రగాయాలతో మృతి చెందాడు.
*తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఈ సంఘటన సోమవారం రాత్రి బంజారాహిల్స్ లో జరిగింది. సోమవారం రాత్రి ఓ మహిళా బంజారాహిల్స్ రోడ్ నెం-2పై నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు పోకిరీలు ఆమెపట్ల దురుసుగా ప్రవర్తించారు.
*కాజా టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు6 కేజీల 500 గ్రాముల గంజాయి స్వాధీనం, ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.
కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎక్సైజ్ సీఐ ప్రేమిలా రాణి.
* వరంగల్‌ జిల్లాలోని వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. చెరువులో యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులకు కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు.
* చర్లపల్లి జైలు వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిశ హత్య కేసు నిందితులు చర్లపల్లి జైలులో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైలు పరిసరాల్లో  సెక్షన్‌ విధించారు. నిరసనలుఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కస్టడీకి తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలనే దానిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించే అవకాశం ఉంది.
* నర్సంపేట మున్సిపల్ ఆఫీస్ లో రూ.5000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిపోయాడు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ రావు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ కిరణ్ ను కూడా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ల్యాండ్ డెవలప్ మెంట్ అనుమతుల విషయంలో ఓవ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు కమిషనర్. ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ప్లాన్ వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
* లారీని ఆటో వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ లోని తిమ్మాజీపేట వద్ద జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తిమ్మాజీపేట తుమ్మలకుంట తండాలో పెండ్లికి హాజరై తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో 15మందికి పైగా ఉన్నట్లు చెప్పారు.
* మద్యం మత్తులో ఓ కుమారుడు తన తల్లిపై రోకలిబండతో దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఫరూఖ్ నగర్ లోని కంసాన్ పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
* ప్రభుత్వ క్వార్టర్‌లోనే ఓ యువతిపై మాజీ పోలీస్‌ కానిస్టేబుల్‌ అతని సహచరులు సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది.
* వయోభేదం లేకుండా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అన్పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
* అతి వేగం కారణంగా ఓ కారు బోల్తా పడింది. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డులో ఓ కారు తెల్లవారుజామున అతి వేగంగా వచ్చి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
* కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. మహిళా రైతు యలమంచిలి పద్మపై పోలీసులకు వైసీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కంచికచర్ల పోలీసులు పద్మపై సీఆర్‌పీసీ  కింద నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
* బెంగుళూరు నగరంలో ఇద్దరు విద్యార్థులు మత్తు మందులు సేవించి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు సెంట్రల్‌ విభాగ పోలీసులుమందుల నియంత్రణ విభాగం అధికారులు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టారు.
* బెంగుళూరు నగరంలోని ఆర్‌టీ నగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చాముండినగర్‌లో శనివారం గంజాయి సేవించి గొడవలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకునే యత్నం చేశారు.
* షిర్డి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వే కోడూరు వద్దకు రాగానే షిర్డి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. దీంతో అధికారులు రైలును నిలిపివేశారు. షిర్డి ఎక్స్‌ప్రేస్ తిరుపతి నుంచి షిర్డి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వికలాంగుల బోగి మాత్రమే పట్టాలు తప్పడం.. ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
* నడిరోడ్డుపై ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా.. తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని నడిరోడ్డుపై తలపై రాడ్డుతో మోది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటన మరవక ముందే అలాంటి దారుణ ఘటనే ఏపీలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు
*తిమ్మాజీపేటలో లారీని ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్, జడ్చర్ల ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
*సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం గుంపుల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
* ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి వద్ద చోటుచేసుకుంది.
*రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడ్డ ప్రమాదంలో 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*ఇంటి నిర్మాణానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచం తీసుకొంటూ మున్సిపల్ అధికారులు అనిశాకు చిక్కారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జూనియర్ సహాయకుడు కిరణ్ బాధిత వ్యక్తి నుంచి రూ.5 వేల నగదు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు.
*హిమాయత్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ యువతి ట్యాంక్బండ్లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ వదిలి వెళ్లిన ఘటన నారాయణగూడ పోలీసులకు ఉరుకులు పరుగులు పెట్టించిన విషయం విదితమే. ఆ యువతిని, ఆమెతో పాటు ఓ అబ్బాయిని గుంటూరులో అదుపులో తీసుకుని సోమవారం హైదరాబాద్కు తీసుకొచ్చి విచారించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.
*రంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరుచోట్ల రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాయి.
*ప్రాణహిత నదిలో గల్లంతైన అటవీశాఖ అధికారుల మృతదేహాలను జాలర్లు గుర్తించారు. నదిలో చేపల వేటసాగిస్తున్న మత్స్యకారుల వలలకు ఇవాళ ఉదయం అధికారుల మృతదేహాలు చిక్కాయి. తలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నిదిలో ఆదివారం నాటు పడవ బోల్తా పడిన ఘటన తెలిసిందే. ఈ పడవలో ప్రయాణిస్తున్న నలుగురు అటవీ సిబ్బందిలో ఇద్దరు గల్లంతయ్యారు.
*ఓ పెంపుడు కుక్కను తీవ్రంగా హింసించి చంపినందుకు ఆగ్రా పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆగ్రాలోని జగదీశ్పుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ అధికారి రాజేశ్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. తమ పెంపుడు కుక్క(ట్వింకిల్)ను పలువురు గుర్తుతెలియని వ్యక్తులు తీవ్రంగా హింసించి హత్య చేశారని ఓ వ్యక్తి జంతువుల బాగోగులు చూసే పీఎఫ్ఏ సంస్థకు ఫిర్యాదు చేశాడు.
*అకారణంగా తన కుటుంబీకులపై కేసులు నమోదు చేసి తనను బదిలీ చేశారని ఆరోపిస్తూ ఒంటికి నిప్పంటించుకున్న రంగారెడ్డి జిల్లా మంచాల ఠాణా ఏఎస్సై నరసింహ(52) మరణించారు. డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయారు.
*గాఢనిద్రలో ఉన్న ఐదు కుటుంబాలకు చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఐదు ఇళ్లను ఆనుకుని ఉన్న వేరొకరి ఇంటి భారీ ప్రహరీ వర్షాలకు దెబ్బతిని కుప్పకూలడంతో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాల్లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.మేట్టుపాళెయం సమీపాన నడూర్లోని ఏటీ కాలనీలో అరుక్కాణి, ఆనందన్, శివకామి, గురుస్వామి, ఏబియమ్మాళ్ల నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ ఇళ్లను ఆనుకుని కొంత ఎత్తున టైక్స్టైల్స్ వ్యాపారికి చెందిన ఇంటి భారీ ప్రహరీ గోడ ఉంది. సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆ గోడ కూలి దానిని అనుకుని ఉన్న ఐదు ఇళ్లపై పడింది. దీంతో 17 మంది మరణించారు.
*రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో అత్యాచార ఘటనకు సంబంధించి ఓ ట్రక్కు డ్రైవర్ అరెస్టయ్యాడు. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన వ్యవహారంలో ట్రక్కు డ్రైవర్ మహేంద్ర అలియాస్ ధోలూను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడు శనివారం మిఠాయిల ఆశ చూపి చిన్నారిని పాఠశాల నుంచి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడని వివరించారు. అత్యాచారం సంగతి బయట పడుతుందన్న భయంతోనే చిన్నారిని హత్య చేశాడన్నారు
*కుమార్తె వరసయ్యే బాలిక(15)పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి సోమవారం తీర్పు చెప్పారు.
*చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె పొలాల వద్ద ఆదివారం రాత్రి గజరాజు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.
*పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారంటూ మహారాష్ట్రలో ఇద్దర్ని మావోయిస్టులు కాల్చిచంపారు. గడ్చిరోలి జిల్లాలోని ఏటపల్లి తాలూకా పరిసల్ గోంది గ్రామానికి చెందిన రుషి మెస్రమ్ (52), మాసు పుంగటి(55)లను సోమవారం వేకువజామున నిద్ర నుంచి లేపి కాల్చివేశారు. మృతదేహాలను అలొంగ అటవీ మార్గంలో రహదారిపై పడేశారు.
*ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడి గల్లంతైన ఇద్దరు అటవీ బీట్ అధికారుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కర్జెల్లి, కేతిని రేంజ్ల పరిధిలోని బీట్ అధికారులు బాదావత్ సురేష్ (35), ముంజం బాలకృష్ణ (34)లు పెట్రోలింగ్లో భాగంగా ఆదివారం ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని ఆహెరి వెళ్లారు.
* ఓ పెంపుడు కుక్కను తీవ్రంగా హింసించి చంపినందుకు ఆగ్రా పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆగ్రాలోని జగదీశ్‌పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.