DailyDose

మంత్రులకు షాక్ ఇచ్చిన రోజా-రాజకీయ-12/03

YSRCP Roja Shocks AP Ministers-Telugu Political News-12/03

*వైకాపా ఎమ్మెల్యే ఏపీ ఐ ఐ సి చైర్ పర్సన్ రోజా తన ప్రసంగంలో ఏపీ మంత్రులకు షాక్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన డీఆర్సీ సమవేహంలో పాల్గొన్న చాలామంది వైకాపా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యల పై మంత్రులను నిలదీయడంతో రోజాకూడా తన నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో ప్రశ్నించారు. తన నియోజకవర్గమైన నగరి అభివృద్దికి నోచుకోవడం లేదని ఆమె సమావేశంలోనే ప్రసంగించారు. నగరిలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని రోజా అన్నట్టు తెలుస్తోంది దీంతో వేదికపై ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేకపాటి గౌతమ రెడ్డి అవాక్కయ్యారు. ప్రోటోకాల్ హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని సమావేశం అనంతరం వారిద్దరూ పరోక్షంగా రోజా తీరుపై అసంతృప్తి వ్యక్తంన్ చేసినట్టు తెలుస్తోంది.
*కర్నూలులో వైకాపా వర్గాల పోరు
ఏపీలో వైకాపా అధికారంలోకి అచ్చి ఆరు నెలలు అయింది ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయింది జిల్లాస్తాయ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతోంది ఈపదవుల పందేరం విషయంలో ఇప్పుడు కార్యకర్తల నుంచి నిరసన స్వరాలూ వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు పని చేసిన వారిని పక్కన పెట్టి మధ్యలో వచ్చినవారికి ముఖ్యంగా బ్రోకర్లకు పదవులు ఇస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఇటీవలే కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యాలయం పలక మండలి వర్గ సభ్యుడిగా నద్యలకు చెందిన పారిశ్రామిక వేత్త రామ్మోహన్ రెడ్డిని నియమించారు.
*గవర్నర్ ని కలిసిన టీడీపీ బృందం.
అమరావతి పర్యటన లో చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడిపై గవర్నర్ కి పిర్యాదు చేసిన టీడీపీ నేతలుఅచ్చెన్నాయుడు, టడీఎల్పీ ఉప నేతరాజధాని పై సీఎం, అతని మంత్రులు 6నెలలుగా అవాస్తవాలు చెప్తూ వచ్చారుప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందని చాటేందుకే అమరావతిలో చంద్రబాబు పర్యటించారుముందస్తు సమాచారం పోలీసులకు ఉన్నా వైసీపీ రౌడీలు దాడికి దిగారుపోలీసుల కుట్రతోనే చంద్రబాబు పై దాడి జరిగిందిబయట నుంచి తీసుకొచ్చిన రౌడీలతోనే వైసీపీ దాడి చేయించిందిపోలీసులు ఉసిగొలపటం వల్లే చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశాంకొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజధాని మహిళను అరెస్టు చేసి అన్ని పోలీస్ స్టేషన్ లు తిప్పుతున్నారుబాధ చెప్పుకున్న మహిళను అరెస్టు చేయడం దారుణంఅసభ్య పదజాలం వాడిన కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదుచంద్రబాబు పర్యటన లో వాడిన బస్సులను సీజ్ చేసి డ్రైవర్ కండక్టర్ లను అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెడుతున్నారుకక్ష సాధింపే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారుగవర్నర్ వాస్తలు గ్రహించారు, మా ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించారుపోలీసులకు తగు ఆదేశాలు ఇస్తానని స్పష్టం చేశారు
*
*కాంగ్రెస్ దాడులను హుందాగా తిప్పికొట్టండి: రాజ్‌నాథ్
పార్టీ అగ్రనాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి పెంచుతుండటంతో వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధపడుతోంది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని, అయితే పార్లమెంటరీ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
* ఆర్జేడీ అధ్యక్షుడిగా లాలు ఏకగ్రీవ ఎన్నిక
రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పార్టీని స్థాపించి 22ఏండ్లు పూర్తై0ది. పార్టీ అధ్యక్షుడిగా లాలూ ఎన్నికవడం ఇది 11వసారి కావడం విశేషం. పార్టీ అధ్యక్ష పదవికి లాలూ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 1997లో ఆర్జేడీని స్థాపించినప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. 15ఏళ్ల పాటు బిహార్‌ను ఏలిన లాలూ రాజకీయ జీవితం 2005 నుంచి పతనం దిశగా సాగింది. దాణా కుంభకోణంలో లాలూకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీ బాధ్యతలు చేపడతారని ఊహాగానాలు బాగా వినిపించాయి.
* కొత్త ప్రభుత్వంపై విమర్శలు సరికాదు: మోపిదేవి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం రాజధానిలో ఎక్కడా శాశ్వత నిర్మాణాలు కట్టకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదని మంత్రి మండిపడ్డారు.
*అఘాయిత్యాలు ఆగడం లేదు: సుచరిత
గుంటూరు జిల్లా నగరంపాలెం మహిళా పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి సుచరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ హోం మంత్రికి ఓ మహిళ అక్కడ పిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది ఉదాసీన వైఖరిపై హోంమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులను పట్టించుకోకపోతే ఎలా ప్రశ్నించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు.నిర్భయ, దిశ ఘటనలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వసరం ఉంది. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టె ఉంచే యోచనలో ఉన్నాం. మహిళా పోలీసు స్టేషన్లలో మహిళా అధికారులనే నియమిస్తాం’ అని సుచరిత అన్నారు.
పోలీసు వ్యవస్థలో మరింత మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆమె వెల్లడించారు
* నితిన్‌ గడ్కరీని కలిసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు, పలువురు తెరాస ఎంపీలు దిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెండింగ్‌ రహదారుల అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన రహదారులకు గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కోరామని, హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌రోడ్డు విషయాన్ని మరోసారి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని ఆయన మీడియాతో చెప్పారు.
* దివ్యాంగులను పట్టించుకోరా: చంద్రబాబు
హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో దిశ హత్యాచార ఘటన దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోతే చాలా ఇబ్బందులు పడతామని ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లాలో వరుసగా ఆయన రెండో రోజు పర్యటిస్తున్నారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు, వైకాపా బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. వైకాపా ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. వికలాంగులను విభిన్న ప్రతిభావంతులుగా తామే నామకరణం చేశామని తెలిపారు. వారికి అండగా ఉంటామని, ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
*రూ.40వేల కోట్లు వాపసు ఇచ్చేందుకే..
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సాక్షాత్తూ భాజపా సీనియర్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమయింది. కర్ణాటకకు చెందిన భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఫడణవీస్ 80 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి చేతిలో రూ.40వేల కోట్లు ఉన్నాయి. శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి వస్తే ఈ నిధులు దుర్వినియోగమవుతాయని భావించి కేంద్రం వాటిని వాపసు తీసుకోవాలని అనుకొంది. అందుకే ఫడణవీస్ను ముఖ్యమంత్రిగా నియమించి, ప్రమాణ స్వీకారం చేసిన 15 గంటల్లోనే ఆ పనిని పూర్తి చేసింది’’ అని చెప్పారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు.. మహారాష్ట్రకు ఇచ్చిన నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసుకోవడమేమిటంటూ మండిపడ్డాయి.
*ఎన్ఆర్సీ డెడ్లైన్ 2024: అమిత్షా
దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) అమలు చేస్తామని చెబుతూ వస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా తాజాగా డెడ్లైన్ ప్రకటించారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేసి చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపిస్తామని వెల్లడించారు. ఎన్ఆర్సీ కారణంగానే పశ్చిమబెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశామని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న వేళ.. ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని షా ప్రకటించడం గమనార్హం.
*అధిర్ క్షమాపణలు చెప్పాల్సిందే: భాజపా
ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వలసదారులంటూ కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై భాజపా దీటుగా స్పందించింది. అవమానకరంగా మాట్లాడినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని లోక్సభలో కమలనాథులు డిమాండ్ చేశారు. ‘‘భారత్ అందరిది. ఎవరి జాగీరు కాదు. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అమిత్ షా, నరేంద్ర మోదీలే చొరబాటుదారులు. వారి ఇళ్లు గుజరాత్లో ఉన్నాయి. కానీ వారు దిల్లీలో ఉంటున్నారు. వారే వలసదారులు’’ అంటూ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అధిర్ చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఇదే అంశంపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారం ట్వీటర్లో మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశాలకు చెందినవారు. గుజరాత్కు చెందిన వారు చొరబాటుదారులవుతారా? లేకా ఇటాలియనా?’’ ఆయన సూటిగా అని ప్రశ్నించారు.
*మోదీ ఆహ్వానాన్ని తిరస్కరించా: పవార్
కలిసి పనిచేద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఇద్దరి మధ్యా వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నప్పటికీ కలిసి పనిచేసే అవకాశాలు లేవని చెప్పానని వివరించారు. తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అయితే తన కుమార్తె సుప్రియ సూలేకు కేబినెట్ పదవి ఇస్తామని ప్రతిపాదించారని తెలిపారు.
*సీఎం స్పందన ఇంత ఆలస్యమా: విజయశాంతి
‘దిశ’ హత్యోదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ 72 గంటల తర్వాత స్పందించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే హుటాహుటిన ప్రెస్మీట్ పెట్టిన సీఎం.. మానవ మృగాల చేతిలో ఆడబిడ్డ అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోతే స్పందించడానికి 3 రోజుల సమయం తీసుకున్నారని విమర్శించారు.
*భాజపా నుంచి ఆశిష్గౌడ్ బహిష్కరణ
పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ కుమారుడు, భాజపా నాయకుడు అశిష్గౌడ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మద్యం మత్తులో పబ్లో యువతి (సినీ నటి)పై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆశిష్గౌడ్పై మాదాపూర్ ఠాణాలో నిర్భయ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను భాజపా నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి సోమవారం ప్రకటించారు. మహిళల సంక్షేమానికి, వారి రక్షణకు భాజపా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
*వైకాపాది రంగులరాజ్యం-జనసేన అధినేత పవన్కల్యాణ్
వైకాపాది కేవలం రంగుల రాజ్యమని, అన్నింటికీ రంగులు మారుస్తున్నారని.. ఇక ఏడుకొండలు మాత్రమే మిగిలాయని జనసేన అధినేత పవన్కల్యాణ్ విమర్శించారు. సమాజం, తరాలు, యువత ఆలోచనలు మారినా వైకాపా రంగుల ఆలోచన మారడం లేదని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం తిరుపతి, చిత్తూరు లోక్సభ నియోజకవర్గాల నేతలతో ఆయన తిరుపతిలో సమావేశమయ్యారు. మానవత్వమే తన మతమని జగన్రెడ్డి అంటున్నారని.. మతం మారినప్పుడు కుల ప్రస్తావన ఎందుకని సమావేశంలో పవన్ ప్రశ్నించారు. కులం, మతం, ఓట్లు, డబ్బు మాత్రమే వారికి ముఖ్యమని విమర్శించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు హిందూ నేతలే ప్రజలను విభజిస్తున్నారు.
*చంద్రబాబుపై దాడికి ఉద్దేశపూర్వక అనుమతి
రాష్ట్రంలో పోలీసులు వైకాపా కనుసన్నల్లో పనిచేస్తున్నారని, తమ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్నారని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ఫిర్యాదు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వైకాపా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని సోమవారం రాసిన లేఖలో ఆయన ఆరోపించారు. ‘చంద్రబాబు గత నెల 28న రాజధానిలో పర్యటించినప్పుడు ఆయన వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. పర్యటన గురించి ముందే సమాచారం ఇచ్చినా… వైకాపా కార్యకర్తలు దాడి చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అనుమతిచ్చినట్టుగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.
*5న రాజధానిపై అఖిలపక్షం-చంద్రబాబు అధ్యక్షతన నిర్వహణ
రాజధాని అమరావతి విషయమై ఈ నెల 5న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడలో తెదేపా నేతలు సమావేశమై అఖిలపక్షం ఏర్పాటు అంశాన్ని చర్చించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… విజయవాడలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, నిపుణులను ఆహ్వానిస్తామని తెలిపారు. రాజధాని విషయమై ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు
*పథకాల అమలులో ఇబ్బందులు తెలపాలి-శాసనసభ స్పీకర్ సీతారాం
సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను కమిటీలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలపాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శాసనసభ సమావేశ మందిరంలో సోమవారం శాసనసభ నూతన కమిటీ ఛైర్మన్ల, సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకునేందుకు కమిటీలు సిఫార్సు చేయవచ్చని సూచించారు. ఈ సమావేశానికి వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఛైర్మన్ హోదాలో తమ్మినేని సీతారాం, వివిధ కమిటీల ఛైర్మన్లు జి.బాబూరావు, టి.బాలారాజు, మహమ్మద్ ముస్తాఫా, వి.కళావతి, జి.కృష్ణమూర్తి, పి.శమంతకమణి, ఎ.రమమోహన్, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు హాజరయ్యారు.