Health

చలికాలం దగ్గు తగ్గించే చిట్కా ఇది

Banana Flower Juice For Winter Cough Relief-Telugu Health News

అరటి పండ్లలోనే కాదు.. అరటిపువ్వులోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళలకు అరటిపువ్వు ఎంతో మేలు చేస్తుంది.మధుమేహంతో బాధపడేవారు అరటిపువ్వును శుభ్రం చేసుకుని, సన్నగా తరిగి.. చిన్న ఉల్లి, వెల్లుల్లి, మిరియాలు చేర్చి వేపుడులా తయారుచేసి, తీసుకుంటే చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అరటిపువ్వు శరీరంలో ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది. తద్వారా డయాబెటిస్ను నియంత్రించవచ్చు. వారానికి రెండుసార్లు అరటిపువ్వును పెసరపప్పుతో కలిపి కూర చేసుకుని, తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంటుంది.అజీర్తి సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు.. అరటిపువ్వును వారంలో రెండుసార్లు డైట్లో చేర్చుకోవాలి.నెలసరి సమస్యలు, అధిక రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కొనే మహిళలు అరటిపువ్వు వంటకాలను తీసుకోవాలి. వైట్ డిశ్ఛార్జి (తెల్లబట్ట) ఇబ్బందులనూ ఇది తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు అరటిపువ్వు మంచి ఔషధంగా పనిచేస్తుంది.వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గుకు అరటిపువ్వు జ్యూస్ ఉపశమనాన్ని ఇస్తుంది. అరటిపువ్వు రసాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే.. దగ్గు తగ్గిపోతుంది. జలుబు మాయమవుతుందని నిపుణులు చెప్తున్నారు.