DailyDose

రేపు పార్లమెంటుకు చిదంబరం-తాజావార్తలు-12/04

Chidambaram To Attend 2019 Winter Parliament Sessions-Telugu Breaking News-12/04

* ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌ లభించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్లమెంట్‌కు వస్తారని చిదంబరం కుమారుడు కార్తీ జాతీయ మీడియాకు తెలిపారు. 106 రోజుల తర్వాత ఆయన నేటి సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు. చిదంబరం ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు…
* స్టిస్ ఫర్ దిశ వ్యవహారంలో విచారణ వేగవంతం చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హైోర్టుకు లేఖ రాసిన ప్రభుత్వం.సానుకూలంగా స్పందించిన హైకోర్టు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ ప్రభుత్వానికి సమాచారం.కసరత్తు చేస్తున్న రాష్ట్ర న్యాయశాఖ.ఒక జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ మరికాసేపట్లో ఉత్తర్వులు
* టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఓ నూతన ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.1776కి ఆ ప్లాన్ వినియోగదారులకు ప్రస్తుతం లభిస్తున్నది.
* రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘ పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్‌ విలువను భారీగా పెంచినట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు.
* ఎర్రవెల్లి ఫాంహౌస్లో సీఎం కేసీఆర్ కొత్త ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ వారంలోనే గృహప్రవేశం ఉండొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం మంచి ముహూర్తం ఉందని, ఆ రోజున సీఎం కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి వెళతారని పార్టీలోని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. గృహప్రవేశం తర్వాత మూడు రోజుల పాటు సీఎం అక్కడే బస చేస్తారని సమాచారం. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.
*జాతీయ రహదారులుగా సూత్రప్రాయ ఆమోదం తెలిపిన వాటిని జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
*జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో గల్లంతైన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. అది చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొట్టి విచ్ఛిన్నమైంది
*చట్ట పరిధిలోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ రుణ వసూళ్ల ట్రైబ్యునల్-1 జడ్జి(ప్రిసైడింగ్ అధికారి)పై తగిన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్రానికి హైకోర్టు సూచించింది.
*ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) పథకంలో భాగంగా తెలంగాణలోని రెండు వైద్య కళాశాలలకు సంబంధించి రాష్ట్ర వాటా విడుదల చేయలేదని కేంద్రం పేర్కొంది. తెలంగాణలో పీఎంఎస్ఎస్వై పథకంలో నాలుగు ప్రాజెక్టులు చేపట్టామని తెలిపింది.
*తెలంగాణ ఎంసెట్ను మే నెల 5 లేదా 6వ తేదీ నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది. మే నెల 3వ తేదీన నీట్ జరగనుంది. ఆ పరీక్షకు, ఎంసెట్కు ఒకట్రెండు రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్న విద్యామండలి 5 లేదా 6న ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది.
*మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘112 యాప్’ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ పశ్చిమబెంగాల్ మినహా దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు.
*తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కాలపట్టికను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 1తో పూర్తవుతుండగా 2 నుంచి 6 వరకు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు జరగనున్నాయి. ఓరియంటల్ పరీక్షలకు వందల మంది మాత్రమే హాజరవుతారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు కొన్ని పరీక్షలను, మరికొన్నింటిని మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పేపర్ (పార్ట్-బి)ను చివరి అరగంటలో మాత్రమే ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్ తెలిపారు. ఈ సారి సుమారు 5.35 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారు
*రైల్వే సంస్థల్లో అప్రెంటిస్షిప్ చేస్తే ఉద్యోగం సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయి. రైల్వేశాఖ చేపట్టే గ్రూప్-డి నియామకాల్లో 20 శాతం పోస్టులు ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసిన వారికి లభిస్తాయి. ఇంత కీలకమైన అప్రెంటిస్షిప్ల ఎంపికలో ద.మ.రైల్వే అధికారులు అనుసరిస్తున్న విధానం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తోంది.
*రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రపంచ దివ్యాాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బేగంపేటలోని దేవనార్ ఫౌండేషన్కు రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. సంబంధిత చెక్కును ఆయన నిర్వాహకులకు అందజేశారు.