DailyDose

ఉరికంభానికి దగ్గరలో “దిశా” నిందితులు-నేరవార్తలు-12/04

Disha Rapist Murderers To Be Prosecuted On Fast Track-Telugu Crime News-12/04-ఉరికంభానికి దగ్గరలో

*శంషాబాద్‌ దగ్గర అత్యాచారానికి గురైన దిశ కేసులో ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహబూబ్‌నగర్‌ మొదటి అదనపు సెషన్స్‌, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుగా ప్రకటించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు.

*ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేతకు భారీ ఊరట లభించింది. ఇదే విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. సాక్ష్యాల్ని ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పాల్పడొద్దని ఆదేశించింది. మీడియా సంస్థలకు ముఖాముఖిలుగానీ, బహిరంగ ప్రకటనలుగానీ చేయొద్దని సూచించింది. రూ.రెండు లక్షల పూచీకత్తు, ఇద్దరు జమానతుపై బెయిల్‌ మంజూరు చేశారు. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశించారు. జస్టిస్‌ ఆర్‌ భానుమతి, ఏఎస్‌ బోపన్న, హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పుని వెలువరించింది.

* పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికపై ఓ క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇప్పటికే ఆ అమ్మాయిపై అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్లు సమాచారం. నిందితుడికి ఇప్పటికే పెళ్లి అయి, పిల్లలున్నట్లు స్థానికులు తెలిపారు.

* చత్తీష్ ఘడ్ లోని నారాయణ పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇండో టిబెటిన్ బోర్డర్ మధ్య ఇవాళ ఉదయం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈకల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందినట్లు నారాయణపూర్ ఎస్పీ మొహిత్ గార్గ్ వెల్లడించారు. మరో ఇద్దరు తీవ్రగా గాయపడినట్లు ఆయన తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎప్సీ చెప్పారు. నక్సల్స్ ఆపరేషన్స్ కోసం ఐటీబీపీ పోలీసులు చత్తీష్ ఘడ్ కు వచ్చారు.

* పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ చోరీ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు.. త్వరగానే ఛేదించారు. దొంగ నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఓ పల్సర్ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. దొంగకు సెక్షన్ 420 ప్రకారం కఠిన శిక్ష విధిస్తామని ఆయన మీడియా ముఖంగా తెలిపారు.

* ఢిల్లీలో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. ఇద్ద‌రు డాక్ట‌ర్లు ఓ కారులో శ‌వ‌మై క‌నిపించారు. ఆ ఇద్ద‌రి శ‌రీరాల్లో బుల్లెట్లు దిగి ఉన్నాయి. రోహిణి ప్రాంతంలోని సెక్ట‌ర్ 13లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చ‌నిపోయిన ఇద్ద‌ర్నీ ఓం ప్ర‌కాశ్ కుక్రేజా, సుదీప్త ముఖర్జీగా గుర్తించారు.

* దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న రాష్ట్రంలోని 10 రైల్వే స్టేషన్లలో వాటర్ ప్లాంట్లను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) అధికారులు సీజ్‌‌ చేశారు.

*అనంతపురం జిల్లాలో సంఘ విద్రోహ శక్తులపై పొలేసూ ఉక్కుపాదం మోపుతున్నారు ప్రజల్లో అలజడులను దాడులకు కారణమవుతున్న వారిపై కటినంగా వ్యవహరిస్తున్నారు.

*దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగి కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న వేల ఉల్లిపాయల కోసం దొంగతనాలు పెరిగిపోయాయి మార్కెట్ల నుంచి ఉల్లి దొంగతనం కేసులు ఇంతవరకు నమోదు కాగా ఇప్పుడు ఏకంగా ఉల్లి పంటను వేసుకునికూడా దొంగతనాలకు పల్పడుతున్న్నారు.

*దిశ హత్యోదంతంతో యావత్ దేశం అట్టుడుకుతున్న ప్పటికి మృగల్లలో ఎలాంటి మార్పు రావడంలేదు ఎలాంటి భయం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు తాజాగా ఏపీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఒంగోలు సమీపంలో తల్లికుతుల్లను రాళ్ళతో కొట్టి ఆ తరువాత పెట్రోలు పోసి తగులబెట్టారు.

*పూరి జిల్లాలో ఓ యువతి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో మాజీ పోలీసు కానిస్టేబుల్ జితేంద్ర శెట్టిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. కానిస్టేబుల్ తో పాటు మరో నిందితుడు కూడా అరెస్టు చేసినట్లు సెంట్రల్ రేంజ్ డీఐజీ ఆశీష్ సింగ్ తెలిపారు.

* సనత్ నగర్ పీఎస్ పరిధిలో వివాహిత దారుణ హత్య… తల్లిదండ్రుల ను ఎదిరించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టడంతో భార్య అక్కడిక్కడే మృతి.. ఘటన మంగళవారం చోటుచేసుకుంది…

* ఐజ మండలంలోని ఉప్పల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఉదయం వరి పొలానికి మందు కొట్టేందుకు రైతు జయన్న(30) పొలం వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగిపడడంతో.. కరెంట్‌ షాక్‌ తగిలి జయన్న మృతి చెందాడు. పొలం వద్దకు చేరుకున్న జయన్న కుటుంబ సభ్యులు మృతదేహన్ని చూసి బోరున విలపించారు.

*సూడాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 130మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

*ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత నారాయణ్‌పూర్‌ జిల్లాలో ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) దళం జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

*సూడాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 130మంది తీవ్రంగా గాయపడ్డారు

*20 రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన సనత్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణ.. దాసరి కార్తీక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిన్న సాయంత్రం రామారావునగర్‌లోని ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరుకు సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*యువతిపై కాల్పులు జరిపి ఓ యువకుడు తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తానూ తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

*ఓ సీరియల్ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాలికకు హెచ్ఐవీ పాజిటివ్ అని పరీక్షలో తేలిన దారుణ ఘటనరాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో వెలుగుచూసింది. జైపూర్ నగరానికి చెందిన ఓ కరడుకట్టిన కామాంధుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.

*’దిశ’పై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్, ఇతర మహిళా కార్యకర్తలను హైదరాబాద్ పోలీసులు బుధవారంనాడు నిర్బంధంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాసం వద్ద ఆందోళనకు చేపట్టేందుకు తృప్తిదేశాయ్, కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అయితేవారు వెనక్కి తగ్గకపోడంతో పోలీసులు అదుపులోనికి తీసుకుని అక్కడ్నించి తరలించారు.

*ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఐటీబీపీ జవాను ఒకరు తన సహచరులపై కాల్పులకు దిగడంతో ఆరుగురు ఇండో-టిబిటెన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది మృతిచెందారు.

*విశాఖనగరంలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయాడు. వాలంటీర్ పై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు.. మధురవాడలోని కే-1 కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వచ్చి సర్వే చేయలేదని ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ప్రాణపాయ స్థితిలో ఉన్న వాలంటీర్‌ లాల్ బహదూర్ రాయ్‎కి కేజీహెచ్‌కి తరలించారు.

*గుర్తు తెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం.. రుద్రారం వద్ద జాతీయ రహదారిపైబైక్‌పై వెళుతున్న జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు(21) అనే విద్యార్హి మృతి చెందగా… మరొకరికి గాయాలయ్యాయి.

*యువతిపై కాల్పులు జరిపి ఓ యువకుడు తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తానూ తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

*సోదరి పెళ్లి కోసం వచ్చి మరో రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లాల్సిన అన్నదమ్ములు విస్లావత్ ప్రవీణ్ (27) సంజయ్ (23) ప్రమాదవశాత్తు కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ పెద్దవాగులో పడి మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో చోటు చేసుకుంది.

*కారు బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం గేటు సమీపంలో చోటు చేసుకుంది.

*ఫలక్నుమా, బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన జరిగింది.

*ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో సస్పెండైన ఏపీలోని కర్నూలు జిల్లా, సంజామల తాసిల్దార్ గోవింద్సింగ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అతని ఇంట్లో గతంలోనే ఆకస్మిక తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు విలువైన స్థిర, చరాస్తులను గుర్తించగా, అతన్ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.

*సూడాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సూడాన్ దేశంలోని బహ్రీ పట్టణంలోని కోబర్ నైబర్హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 23 మంది మరణించగా, మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 130 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ ట్యాంకర్ పేలుడు వల్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించిందని సూడాన్ దేశ మంత్రులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంపై కారణాలపై సూడాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

*వ్యాపారంలో నష్టాలు, చుట్టుముట్టిన అప్పులు, బాకీ చెల్లించాల్సిన వ్యక్తి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడం వంటి పలు ప్రతికూల పరిస్థితులతో ఓ కుటుంబం బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మంగళవారం తెల్లవారుజామున దిల్లీ శివారుల్లోని ఇందిరాపురంలో ఈ పెను విషాదం చోటు చేసుకుంది.

*మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను దేశమంతా ముక్తకంఠంతో గర్హిస్తున్నా..వారిపై పాశవిక చర్యలకు అంతుండటంలేదు. తాజాగా ఓ మహిళను దారుణంగా రాయితో కొట్టి చంపి.. ఆమె ఏడాది వయసు కుమార్తెను గొంతుకోసి చంపి మృతదేహాలను పెట్రోల్ పోసి కాల్చివేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

*మహిళలు, యువతులపై ఆగడాలు ఆగడం లేదు. స్నానాల గదిలో స్నానం చేస్తున్న ఓ మహిళను పక్క ఇంటిలో నివసించే యువకుడు వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.

*హయత్నగర్ పోలీస్స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వరుస దొంగతనాలతో స్థానికులు హడలిపోతున్నారు. తాళం వేసి వేరే ప్రాంతాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చెడ్డీగ్యాంగ్ సంచరిస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుండటంతో వారికి కంటి మీద కునుకు కరవవుతోంది! రోజులు గడుస్తున్నా ఒక్క కేసులోనూ పోలీసులు నిందితులను గుర్తించలేదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

*మగ సంతానం కాకుండా కేవలం ఆడ బిడ్డలకే జన్మనిచ్చిందన్న నెపంతో కట్టుకున్న భార్యను, పిల్లల్నీ ఇంట్లోనుంచి గెంటేశాడో భర్త. ఈ ఉదంతం ఉత్తర్ప్రదేశ్లోని బాందా జిల్లాలోని కొర్రహి గ్రామంలో చోటుచేసుకుంది.

*మహారాష్ట్రలోని ముంబయి మాహిం బీచ్లో సోమవారం సాయంత్రం ఓ సూట్కేస్ కలకలం రేపింది. వ్యక్తి శరీర విడి భాగాలతో ఉన్న ఆ సూట్కేస్ బీచ్ ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని మాహిం బీచ్ సమీపంలోని కొందరు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు ఒక సూట్కేసును గమనించారు.

*వై.ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన నలుగురు అనుమానితులను సిట్ అధికారులు కడపలో విచారిస్తున్నారు

*ప్రేమను నిరాకరించిన పాపానికి 16ఏళ్ల బాలికను యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. 30 సార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లా కుడ్వారీ గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

*రంగారెడ్డి జిల్లా మంచాల ఏఎస్సై నరసింహ ఆత్మహత్యకు కారణమైన నలుగురు పోలీసు అధికారులపై మంగళవారం కేసు నమోదు చేశారు. నరసింహ బాలాపూర్ ఠాణా వద్ద ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు కారకులుగా… ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్సై వెంకట్రెడ్డి, కానిస్టేబుళ్లు దశరథ్, పెట్రోల్ మొబైల్ సిబ్బంది జలంధర్, శ్రీశైలంపై బాలాపూర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

*వ్యాపారంలో నష్టాలు, చుట్టుముట్టిన అప్పులు, బాకీ చెల్లించాల్సిన వ్యక్తి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడం వంటి పలు ప్రతికూల పరిస్థితులతో ఓ కుటుంబం బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మంగళవారం తెల్లవారుజామున దిల్లీ శివారుల్లోని ఇందిరాపురంలో ఈ పెను విషాదం చోటు చేసుకుంది.

* ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను.. ఏడాది వయసు కుమార్తెను చంపి మృతదేహాలను పెట్రోల్‌ పోసి కాల్చివేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.