Politics

తెరాస కొంపముంచే ప్రణాళికలో గంపా గోవర్ధన్

Gampa Govardhan To Ignite Troubles For TRS

నిజమేనండోయ్ పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ సీనియర్ నేత ఆపార్టీ ఎమ్మెల్యే గంప గోవింద్ అలక వీడకుంటే మాత్రం కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ కొంప కోల్లెరవడం గ్యారెంటీ. జిల్లాలో ఉన్నదే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అందులో జిల్లా కేంద్రం కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున తీరు చూస్తుంటే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడటం ఖాయయమేనన్న విశేషణాలు సాగుతున్నాయి. అయినా వరుసగా రెండో పర్యాయం కూడా గంపకు విప్ పదవి ఇచ్చినా ఆయనలో ఇంకా అసంతృప్తి ఏమిటనేదిగా? మీ డౌటు? ఫస్ట్ టీం ఎమ్మెల్యేలేక్ దక్కిపోతున్న విప్ పదవి ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గంప గోవర్ధన్ కు దక్కితే అవమానమే కదా. ఇదే భావనతో విప్ పదవిని చేపట్టలేదని మొత్తంగా గోవర్ధన్ తీరుతో కీలకమైన మున్సిపల్ ఎన్నికల ముందు కామారెడ్డిలో టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పడుతున్నాయని చెప్పక తప్పదు. ఇక గంప గోవర్ధన్ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే టీడీపీకి రాజకీయ ప్రస్థానం మొదలైన గంప గోవర్ధన్ 2009లో ఆపార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినా గోవర్ధన ఆతరువాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆతరువాత 2014 -2018 ఎన్నికల్లోనూ కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యర్. గోవర్ధన్ ఎదో ఆషామాషీ నేతమీద గెలవలేదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీమంత్రి షబ్బీర్ అలీని ఓడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గోవర్ధన్ సత్తా కలిగిన నేత కిందే లెక్క కదా. అంటే కాకుండా తన జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలిచినా పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ తన తోలి టర్మ్లో ఏకంగా కీలక మంత్రి పదవి ఇచ్చారు.