Food

బెల్లంపాలు ఎప్పుడైనా తాగారా?

Jaggery Milk Health Benefits-Telugu Food And Diet News

రోజూ పాలు తాగడం మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. అయితే పాలలో బెల్లం కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలకు, కీళ్ల నొప్పులకు, రక్త శుద్ధికి, మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి ఈ పాలు బాగా పని చేస్తాయి. అలాగే రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడానికి కూడా పాలు, బెల్లం ద్రావణం బాగా పని చేస్తుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇక చలికాలంలో మనం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో పాలు + బెల్లం కలిపిన పాలు తాగితే మీ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. పాలు, బెల్లం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇక పాలలో బెల్లం కలిపితే ఆ పోషకాలు మరింత ఎక్కువ అవుతాయి. శీతాకాలంలో బ్యాక్టీరియాతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇలాంటి పాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. 2. అజీర్ణం సమస్య పోతుంది చాలామంది అజీర్ణం సమస్యతో బాధపడుతుంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లేదా మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా ఇలాంటి సమస్య తలెత్తుతుంది. మీరు అజీర్ణం, మలబద్ధకం తదితర సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకు పాలు బెల్లం కలిపిన పానీయం మీకు బాగా పని చేస్తుంది. దీన్ని తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి. మీకు చాలా సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.