DailyDose

కేంద్రంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు-రాజకీయ-12/04

KTR Comments On Modi Govt-Telugu Political News Roundup-12/04

*తెలంగాణా మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రం తెలంగాణను పటించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సి ఐ ఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
* సనత్ నగర్ పీఎస్ పరిధిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సనత్ నగర్‌కు చెందిన పూర్ణిమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె 20 రోజుల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి దాసరి కార్తిక్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది.
* పౌరసత్వ బిల్లు సవరణకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం
పౌరసత్వ బిల్లు సవరణకు కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పౌరసత్వ బిల్లు సవరణపై హోంమంత్రి అమిత్‌ షా రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టారు. బిల్లుపై ఉన్న వివాదాలు, సందేహాలను చర్చించారు. ఈ సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగగా.. మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసత్వ బిల్లుతో పాటు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్న చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లకు పొడిగించే నిర్ణయానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈ క్రమంలోనే పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016కు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి ఆమోద ముద్ర లభించడంతో ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే హోంమంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
*పారిశ్రామికవేత్తలను వైకాపా బెదిరిస్తోంది: పవన్‌
కష్టపడితే గానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పారిశ్రామిక వేత్తలను వైకాపా ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల జనసేన నాయకులతో పవన్‌ సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలు, నిత్యావసరాల ధరల పెంపు, రాయలసీమ వెనకబాటుతనం, తెలుగు వైభవం, హిందూ ధర్మ పరిరక్షణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు.‘కియా వంటి పరిశ్రమ సీఈవోను బెదిరిస్తే రాష్ట్రానికి ఎవరు వస్తారు? 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారు.. అసలు పరిశ్రమలు వస్తున్నాయా? ఆంగ్ల మాధ్యమం విషయంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఆంగ్లమాధ్యమాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించలేదు.
*పార్టీలో నా ఎదుగుదల కొందరికి ఇష్టం లేదు
భాజపాలో తన ఎదుగుదల కొందరు నేతలకు ఇష్టం లేదని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.అసెంబ్లీ ఎన్నికల్లో నాకు టికెట్ రాకుండా కొందరు అడ్డుపడితే అమిత్షా కల్పించుకుని అవకాశమిచ్చారు.. కార్యకర్తల ఆశీర్వాదంతో గెలుపొందినట్లు తెలిపారు. తెలంగాణలో భాజపా బలోపేతానికి ఓ ప్రణాళిక రూపొందించి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు ఇచ్చానని చెప్పారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజాసింగ్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
*ఝార్ఖండ్ గురించి ఓ తండ్రిలా పనిచేస్తున్నా..
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దేశంలో కొత్తగా ఎలాంటి సమస్యలూ ఉత్పన్నంకాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ఆయన ఝార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం అక్కడ ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత పడిందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ ప్రజల అభ్యున్నతి కోసం జార్ఖండ్ ప్రజలు సహకరిస్తారన్న విశ్వాసాన్ని మోదీ ఈ సందర్భంగా వ్యక్తంచేశారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 7న జరగనున్న నేపథ్యంలో కుంతి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఝార్ఖండ్ ఎదుగుతున్న ఓ బిడ్డలాంటిదని వ్యాఖ్యానించారు. ఎదుగుతున్న బిడ్డ భవిష్యత్తు కోసం తండ్రి ఎలా ఆలోచిస్తాడో..అలాగే, ఝార్ఖండ్ అభివృద్ధి కోసం తానూ పనిచేస్తున్నానన్నారు.
*అందుకే భాజపాకు దూరమయ్యా: పవన్
ప్రత్యేకహోదా కోసం ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేక భాజపాకు దూరమయ్యానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెదేపాను అన్ని మాటలు అన్న తర్వాత కూడా వాళ్లతో ఎలా కలుస్తానని ప్రశ్నించారు. తిరుపతిలో కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో పవన్ మాట్లాడారు. ఆశయాల గురించి ఆలోచించకుండా తాను భాజపాతో కలిసి ఉంటే వైకాపా బయట ఉండేదా అని ప్రశ్నించారు. రూ.30వేల కోట్లు పంచి తెదేపా ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్కు అంత బలం ఉంటే.. విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్మార్చ్కి అంత జనం రారని చెప్పారు. తాను ఆశయాల కోసం ఆలోచించానని..అందుకే ఓడిపోయానన్నారు.
*కాంగ్రెస్ది ద్వంద్వవైఖరి: తెరాస
ఆర్టీసీపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని.. సమ్మె సమయంలో ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేసిన నేతలు ఇప్పుడు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని మండలి విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కోరుకంటి చందర్లు ధ్వజమెత్తారు. ధర్నాల పేరిట వారు చేస్తున్న నాటకాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ మానవతకు ప్రతిరూపం. దిశ హత్య కేసులో 24 గంటల్లో ప్రభుత్వం నిందితులను పట్టుకుంది. మిగతా వారిలా కేసీఆర్ కంటితుడుపు రాజకీయాలు చేయరు’’ అని అన్నారు.
*భాజపా వీడను.. ఫిరాయింపు నా రక్తంలో లేదు
రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన తదుపరి కార్యాచరణపై ఆలోచించుకోవాల్సి ఉందంటూ మహారాష్ట్ర మాజీ మంత్రి, భాజపా ముఖ్యనేత పంకజ ముండే ఇటీవల ఫేస్బుక్లో చేసిన పోస్ట్ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై ఆమె మంగళవారం మౌనం వీడారు. తాను భాజపాను వీడటంలేదని స్పష్టంచేశారు. భాజపా దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె అయిన పంకజ ముండే ఆ పార్టీను వీడతారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను భాజపాను వీడటంలేదు. ఫిరాయింపులకు పాల్పడటం నా రక్తంలోనే లేదు’’ అని విలేకర్లతో అన్నారు. తన ట్విటర్ ఖాతాలో ‘భాజపా’ అనే పదం తొలగించడంపై చెలరేగిన ఊహాగానాలనూ ఆమె ఖండించారు. ఆదివారం పంకజ ముండే ఫేస్బుక్ ఖాతాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీని వీడతారంటూ చెలరేగిన ఊహాగానాల నేపథ్యంలో భాజపా సీనియర్ నేతలు వినోద్ తవడే, రాం షిందే, ఎమ్మెల్యే బాబన్రావ్ లోనికర్ తదితరులు మంగళవారం ముంబయిలోని మలబార్ హిల్స్లో ఆమె నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు.
*మా నాయకులే ఓడించాలని చూశారు:రాజాసింగ్
భాజపా శాసనసభాపక్ష నేతగా పార్టీ తనను గుర్తించటం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘ నేను పార్టీలో ఎదగడం కొందరు నాయకులకు ఇష్టం లేదు. లక్ష్మణ్ ఓడిపోవడానికి అధ్యక్ష పదవి కూడా కారణం. పార్టీ పనుల్లో బిజీగా ఉండటం వల్లే నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టలేదు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రోటోకాల్ పాటించటం లేదు. నా నియోజకవర్గానికి వస్తే ..నాకే సమాచారం ఉండదు. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించేవారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్, ధర్మపురి అరవింద్తో పాటు డీకే అరుణ కూడా అర్హురాలే.
*ఆర్టీసీ మనుగడకే ప్రమాదం: రాఘవులు
ఆర్టీసీలో యూనియన్లు ఉండొద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం నియంతృత్వానికి నిదర్శనమని.. యూనియన్లు లేకపోతే ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. రెండురోజుల పాటు జరగనున్న సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు.
*రూ.170 కోట్ల ‘స్వీకరణ’పై కాంగ్రెస్కు ఐటీ నోటీసు
హైదరాబాద్కు చెందిన ఒక ఇన్ఫ్రా సంస్థ నుంచి రూ.170 కోట్ల నిధులను అందుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీకి ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసు జారీ అయినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. రూ.3,300 కోట్ల హవాలా కుంభకోణం కేసు దర్యాప్తులో వెల్లడయిన సమాచారం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ వివరణను ఐటీ విభాగం కోరినట్లు పేర్కొంది. ఈ కేసులో కొందరు కాంగ్రెస్ నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రాజకీయ పార్టీ ప్రమేయంపై కూడా ఆదాయపన్ను విభాగం దృష్టిపెట్టినట్లు వెల్లడించింది.
*తెదేపా మహిళా కార్యకర్త అరెస్టు హేయం: కళా వెంకట్రావు
ప్రతిపక్షనేత చంద్రబాబు కాన్వాయ్పై దాడిచేసిన వారిని వదిలిపెట్టి, తెదేపా శ్రేణులను వేధించడం హేయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెదేపా మహిళా కార్యకర్త పద్మజను అరెస్టు చేయడం అమానుషమని, మహిళ అని కూడా చూడకుండా అక్రమ కేసులతో వేధించడం సిగ్గుచేటని విమర్శించారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమరావతిపై మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు తట్టుకోలేక ఆ మహిళ నిరసన వ్యక్తం చేశారని, మహిళా హోం మంత్రి హయాంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని పేర్కొన్నారు.
* బీజేపీలో దుమారం రేపుతున్న రాజాసింగ్ వ్యాఖ్యలు
బీజేపీఎల్పీగా పార్టీ తనను గుర్తించట్లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాను ఎదగడం పార్టీలో కొందరికి ఇష్టం లేదన్నారు. తన ఓటమికి పార్టీలో కొందరు సీనియర్లు పనిచేస్తే కార్యకర్తలు తన గెలుపు కోసం కృషి చేశారన్నారు. లక్ష్మణ్ ఓడిపోవడానికి కారణం అధ్యక్ష పదవేనన్నారు. అధ్యక్షుడిగా బిజిగా ఉండడంతో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు తనకే సమాచారం ఇవ్వడం లేదన్నారు. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నపుడు ప్రోటోకాల్ పాటించేవారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి డీకే అరుణ, అర్వింద్, బండి సంజయ్ అర్హులేనన్నారు. అయితే తనకు అధ్యక్ష పదవిపై మోజులేదన్నారు రాజాసింగ్.తన రాజకీయ గురువు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు.