DailyDose

సుజనా చౌదరికి షాక్-వాణిజ్యం-12/04

Sujana Chowdary Gets DRT Notices-Telugu Business News-12/04

*ఏపీ భాజపా ఎంపీ సుజనాచౌదరికి డీఆర్తీ నోటీసులు అందించింది. ఐడీబీఐ రూ.169 కోట్లు ఎగ్గోత్తారని ఐడీబీఐ బ్యాంకు చెన్నై డీఆర్టీకి ఫిర్యాదు చేసింది.దీంతో సుజనా కంపెనీలకు డీఆర్టీ నోటీసులు అందించింది.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా తొలిసారి బీఎస్‌6 ఇంజిన్‌ వాహనాన్ని విడుదల చేసింది. సబ్‌ కాంప్టాక్ట్‌ ఎస్‌యూవీ ఎక్స్‌ యూవీ 300లో బీఎస్‌-6 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. మహీంద్రా ఎక్స్‌యూవీ బీఎస్‌6 ధర రూ.8.30లక్షల నుంచి మొదలై రూ.11.84 లక్షల మధ్య ఉంటుంది. బీఎస్‌ 4 వెర్షన్‌తో పోలిస్తే దీని ధర రూ.20,000 వరకు పెరిగింది.
*మౌలిక రంగానికి చెందిన జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గాయత్రి ప్రాజెక్ట్స్ సహా 8 కంపెనీలపై నిఘా పెట్టాలని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిర్ణయించింది. ప్రమోటర్ల వాటా షేర్లలో అత్యధిక శాతం తాకట్టులో ఉన్నందున ఈ కంపెనీలను అదనపు నిఘా కోసం ఎంచుకుంది.
*పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సరళతర విధానం (టీఎస్-ఐపాస్) ద్వారా గడిచిన ఐదేళ్లలో 11,620 పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అనుమతించింది. దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు దా దాపు రూ.1,73,635 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పనున్న యూనిట్లతో 13,02,802 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.
*చిన్న పట్టణాల్లో డయాలిసిస్ సదుపాయాల కొరత బాగా ఉందని.. మూత్రపిండ రోగుల డయాలిసిస్ కేంద్రాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని నెఫ్రోప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ విక్రమ్ ఉప్పల అన్నారు.
*పేస్ హాస్పిటల్ పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఓఎంఆర్వీ హాస్పిటల్స్లో నాట్కో వాటా పెంచుకుంది. కంప్లసరీ కన్వర్టబుల్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా ఓఎంఆర్వీలో హాస్పిటల్స్లో రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టామని, వాటా 12.81 శాతానికి చేరనుందని తెలిపింది.
*వచ్చే రెండు, మూడేళ్లలో నికర లాభంలో సగటున ఏడాదికి 25 శాతం వృద్ధిని నమోదు చేయాలని గ్రాన్యూల్స్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఆదాయం కూడా 20 శాతం చొప్పున పెరగగలదని కంపెనీ వెల్లడించింది.
*ప్రపంచంలోనే అతి తక్కువ డోస్ పరిమాణం కలిగిన కొత్త రోటావైరస్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రోటావ్యాక్ 5డీ’ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
*ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకానికి ఉద్యోగుల నుంచి మంచి స్పందనే లభించింది.