DailyDose

నందిగామ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి-తాజావార్తలు-12/05

4 Dead In Nandigama Road Accident-Telugu Breaking News-12/05

* కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రధాన రహదారిపై ఆగివున్న డీసీఎం వాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో కారులో ఉన్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నందిగామ విజయా టాకీస్‌ ప్రాంతానికి చెందిన అనిల్‌, సాయి మనోజ్‌, దుర్గా, అరవింద్‌గా గుర్తించారు. అతివేగం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ కారు నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
*కేరళలో రైతులకు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఐదు ఎకరాల నుంచి పదిహేను ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు కౌలుదారులకు ఈపధకం కింద తీసుకురానుంది. దీనికి సంబందించిన కేరళ ప్రభుత్వం రైతుల సమ్క్షెమ నిధి రూపొందించడానికి కేరళ అసెంబ్లీ కొత్త చట్టాన్ని ఆమోదించింది.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో కియా పరిశ్రమ ఏర్పాటు అభినందనీయమన్నారు. కియా పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. వేల మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా మరో  మందికి ఉపాధి లభిస్తుందని జగన్ పేర్కొన్నారు.
*అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 6న ఓయూలో 3కె రన్ నిర్వహిస్తున్నట్లు బండారు వీరబాబు, మంద సురేష్ తెలిపారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 3కె రన్కు సంబంధించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3కె రన్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రారంభిస్తారని తెలిపారు.
*సొంత సామాజికవర్గంతో పాటు ఇతర వర్గాల ప్రజలతోనూ మమేకమై, పట్టుదలతో పనిచేస్తే రాజకీయాల్లో రాణించవచ్చని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
*శ్రీచైతన్య విద్యాసంస్థలు బుధవారం రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో భాగంగా… ఏడు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు 214 వేదికలపై ఏకకాలంలో ఏడు నిమిషాల పాటు ‘స్పోర్ట్స్ డ్రిల్’ను నిర్వహించారు.
* ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాల్సిందిగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ అనంతరం వారితో సీఎం సమావేశమైన విషయం తెలిసిందే
*రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కీలకమైన నిఘా విభాగం అధిపతిగా 2000 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి మనీష్కుమార్ సిన్హాను నియమించింది
*బీబీ నగర్లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిమ్స్ చట్టం-1956 ప్రకారం దేశవ్యాప్తంగా 9 ఎయిమ్స్ ఆసుపత్రులపై గెజిట్ విడుదల చేసింది.
*సాఫ్ట్వేర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్ యార్డుల్లో బుధవారం పత్తి కొనుగోళ్లకు అంతరాయమేర్పడింది. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే సమయంలో కంప్యూటర్ ద్వారా వారికి తక్పట్టీలు ఇస్తున్నారు.
*రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ స్వీడన్కు చెందిన ‘‘ద రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’’ పురస్కారం స్వీకరించారు. దిల్లీలోని స్వీడన్ రాయబార కార్యాలయంలో స్వీడన్ రాజు గుస్తాఫ్-16, రాణి సిల్వియా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
*లాభదాయక పదవుల జాబితా నుంచి తెలంగాణలోని 28 ప్రభుత్వరంగ సంస్థ (కార్పొరేషన్)ల ఛైర్మన్ పదవులను ప్రభుత్వం తొలగించింది. ఇందుకోసం వేతనాలు, పింఛన్ల చెల్లింపులు, అనర్హతల తొలగింపు చట్టాన్ని సవరిస్తూ బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.
*దిశ ఘటనపై యావత్ దేశం కదలివచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్కు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు’ అని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ విమర్శించారు.
*కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల హాజరు 97 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి ప్రిన్సిపాల్ డి.భానుమతిని అభినందించి ప్రశంసాపత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపారు. హాజరు శాతంపై బుధవారం ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో జనార్దన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
*ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి ఇకపై చెల్లించబోయే బీమా పరిహారం మొత్తం పెరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని పెంచారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి వరకూ రూ.20 లక్షలు, ఎస్సై-ఇన్స్పెక్టర్ వరకూ రూ.35 లక్షలు, డీఎస్పీ, అంతకంటే పైస్థాయి అధికారులకు రూ.45 లక్షల మేర బీమా పరిహారం లభించనుంది.
*రాష్ట్రంలోని 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్)లకు ఏడుగురు సభ్యులతో కూడిన పర్సన్ ఇన్ఛార్జి కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఒక్కో కమిటీలో ఛైర్మన్తో పాటు ఆరుగురు సభ్యులుంటారు. మిగిలిన కాలం/ఎన్నికలు జరిగే వరకు(ఏది ముందైతే అది) వీరు పదవుల్లో ఉంటారు. ఈ మేరకు మార్కెటింగ్శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన్రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. సభ్యులలో 50 శాతం మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచి నియమించారు.
*మహిళాభివృధ్ధి, శిశు సంక్షేమ శాఖలో 106 విస్తరణాధికారుల పోస్టుల(గ్రేడ్-1) భర్తీలో కొందరు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖాముఖీలకు పిలిచిన వారిలో సుమారు సగం మంది వెనుదిరగాల్సి రావడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
*వివిధ జిల్లాల్లో రాకపోకలు సాగించేందుకు వీలుగా 239 అద్దె బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు పిలిచింది. వీటిల్లో 80 ఎక్స్ప్రెస్ బస్సులు, 159 పల్లెవెలుగు సర్వీసులు ఉన్నాయి. గురువారం నుంచి 17వ తేదీ వరకు టెండర్లను స్వీకరించనున్నారు. వాటిని తెరిచిన తర్వాత 20న రివర్స్ టెండర్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
*మహారాష్ట్రలోని పుణెలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న డీజీపీల వార్షిక సదస్సుకు రాష్ట్ర డీపీజీ గౌతం సవాంగ్ హాజరు కానున్నారు. ఏవోబీలో వామపక్ష తీవ్రవాదం, సైబర్నేరాలు, పోలీసుశాఖ చేపట్టిన చర్యలు తదితర అంశాలపై ఈ సదస్సులో ఆయన ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ప్రధాని మంత్రి, హోంశాఖ మంత్రి కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు.