DailyDose

చిత్తూరులో బాలిక కిడ్నాప్-నేరవార్తలు-12/05

Girl Kidnapped In Chittoor-Telugu Crime News-12/05

* దేశంలో ఆడవారికి భద్రత లేదంటూ మహిళా లోకం భగ్గుమంటోంది. దిశా ఘటన తర్వాత మరోసారి రోడ్డెక్కి నినదిస్తోంది. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తుండగానే.. ఏపీలో మరో దారుణం జరిగింది. చిత్తూరులో ఇంటర్ బాలికను కిడ్నాప్ చేశారు. కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది.
* మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దిశ ఘటనపై ఫేస్‌బుక్‌లో అసభ్య వ్యాఖ్యానాలు పెట్టిన ఏపీలోని గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన అమర్‌నాథ్(18)ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
* ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న డీసీఎం వ్యానును అదుపుతప్పిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతిచెందారు.
* ఆమెకు కనికరం లేదు.. కట్టుకున్న భర్తనే అతి దారుణంగా చంపేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను సజీవదహనం చేసింది. ఈ ఘటన వనస్థలిపురంలోని ఎస్కేడి నగర్‌లో నవంబర్ 26న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
* ఐఎంఎస్ మందుల కుంభకోణంలో నిందితుడు, దేవికారాణి భర్త గురుమూర్తిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడిని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. దేవికారాణి తరపున ఔషద పరిశ్రమ నుంచి గురుమూర్తి లంచాలు తీసుకున్నట్లుగా సమాచారం.
*తల్లిని దారుణంగా హత్య చేసినందుకు హాలీవుడ్ నటుడు రోన్ ఎలీ కుమారుడిని ఎం కౌంటర్ చేసారు. అమెరికన్ పోలీసులు అక్టోబరులో కేమేరాన్ తన తల్లి కత్తితో పొడిచి పంపారు. ఆతరువాత పోలీసులకు పోన్ చేసాడు పోలీసులు అతడిని అరెస్టు చేయడానికి ఇంటికి వెళ్ళగా వాళ్ళను కూడా చంపాలని కేమేరాన్ నిర్ణయించుకున్నాడు.
*తన భార్యను హత్యచేసి ఓ బ్యాంకు మేనేజరు అనతకు ముందే ఓ పామును కొని తెచ్చుకుని అది కాటేయడం వల్లే మరణించిందని డ్రామా ఆది అడ్డంగా దొరికిపోయాడు ఈఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది.
* రోడ్డు పక్కన నిల్చొన్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం మందిబోయినవారిపాలెం గ్రామ శివారులో జరిగింది. రోడ్డు పక్కన నిల్చొన్న అంజయ్య(అనే వ్యక్తి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బైక్‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.
* అమెరికా పర్యటనలో ఉన్న భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్ కుమార్‌ సింగ్‌ భదౌరియాకు పెను ప్రమాదం తప్పింది. హవాయిలోని పెరెల్‌ హార్బర్‌ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో భదౌరియా బృందం కూడా అక్కడే ఉంది. అయితే ప్రమాదం నుంచి వారంతా సురక్షితంగా బయటపడినట్లు ఐఏఎఫ్‌ వెల్లడించింది.
* అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కేసు పెట్టినందుకు ప్రతీకారంగా బాధితురాలికి నిప్పు పెట్టారు దుండగులు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో ఉన్నావో జిల్లాలోని తన తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు.
* తమ పరిధిలోకి రానప్పటికీ బాధితులు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత కృష్ణా జిల్లా నందిగామ సబ్‌డివిజన్‌ పరిధిలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వీరులపాడు మండలం రంగాపురం బాలుడి కిడ్నాప్‌ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలుడి తండ్రి రవినాయక్‌ ఫిర్యాదు మేరకు కంచికిచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కంచికిచర్ల పీఎస్‌ పరిధి కాకపోయినా.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. తెలంగాణలోని మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
* కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో కారులోనే ఓ మహిళ సజీవ దహనమైంది. నాసిక్ నుంచి మచిలీపట్నం వెళుతుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఇద్దరు పిల్లలుభర్త ప్రాణాలతో బయటపడ్డారు. వ్యాపారరీత్యా ఈ కుటుంబం నాసక్‌లో స్థిరపడింది. కాగా కుటుంబం మొత్తం స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
*మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతూపొంతూ ఉండటంలేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వివాహితపై యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన విషయం బుధవారం వెలుగు చూసింది.
*విశాఖ నగరంలో దారుణం చోటుచేసుకుంది. న్యూపోర్ట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది.
*రుణం మంజూరు చేయలేదనే కారణంతో ఓ వ్యక్తి బ్యాంక్ అధికారులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కోయంబత్తూర్ కెనరా బ్యాంక్ శాఖలో వెట్రివేల్ అనే వ్యక్తి తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా రుణం మంజూరు చేయించేందుకని వెట్రివేల్ ఓ మధ్యవర్తికి రూ.3 లక్షలు నగదు కూడా చెల్లించాడు
*హైదరాబాద్ నగరంలో పశువైద్యురాలిని పైశాచికంగా అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠినమైన శిక్షలు పడాలని కొందరు.. ఉరితీయాలని మరికొందరు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు
*మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో కేరళలోని ఓ వ్యక్తికి జీవిత ఖైదు పడింది. దానితో పాటు రూ.25,000 జరిమానా కూడా విధించింది కోర్టు. కేరళలోని కాసర్గోడ్ సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
*దిశ హత్యాచార ఘటన అనంతరం ఆమె ప్రవర్తనను హేళన చేస్తూ, అనుచితమైన వ్యాఖ్యలను ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేసిన సాయినాథ్ అలియాస్ స్మైలీ నానిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
*మూడో వివాహం చేసుకునేందుకు అడ్డు చెప్పిన రెండో భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన అరుణ్కుమార్ లమాణిగె (34)కూ ఉరి శిక్ష విధిస్తూ గదగ జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ముండరగి సమీపంలోని కమ్మగి గ్రామానికి చెందిన నిందితుడు 2016 మార్చి 29న రెండో భార్య దేవి (28), రెండేళ్ల కుమార్తె, రెండు నెలల పసిపాపకు కీటకనాశనిని బలవంతంగా తాగించి చంపాడు
*శ్రీశైలం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సు, ధర్మవరం డిపో బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ధర్మవరం బస్సులోని డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
*భార్య, మరదలు, తన ముగ్గురు బిడ్డలను అతి కిరాతకంగా నరికి చంపిన వ్యక్తికి బళ్లారి జిల్లా హొసపేటెలోని జిల్లా అదనపు న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.
*ఐటీబీపీ జవాను ఒకరు విచక్షణ కోల్పోయి సహచరులపైనే తూటాల వర్షం కురిపించాడు. ఐదుగురిని పొట్టనబెట్టుకున్నాడు. అనంతరం తననుతాను కాల్చుకుని మరణించాడు
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. ఈ కేసు విచారణకు రావాలని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు కోరారు.
*సముద్రపు దొంగలు నైజీరియా తీరానికి సమీపంలో హాంకాంగ్కు చెందిన ఒక నౌకను మంగళవారం అపహరించుకుపోయారు. ఆ నౌకలో 19 మంది ఉండగా వారిలో 18 మంది భారతీయులే. వారిని రక్షించేందుకు దౌత్యవర్గాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
*నిఘా సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు బుధవారం ఓ వ్యక్తి నుంచి రూ.66.64 లక్షల విలువైన 1.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు బస్సులో చార్మినార్ వద్దకు చేరుకున్న వ్యక్తిని అడ్డగించి తనిఖీలు నిర్వహించారు. అతని వద్ద అనుమతులు లేకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారం లభించింది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.